S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేట్ బెడ్

ఇంటికి రాగానే మనం పెంచుకునే పిల్లితోనో,కుక్కతోనో కాసేపు ఆడుకుంటే రిలాక్సింగ్‌గా ఉంటుంది. పెట్ డాగ్స్‌కి, పెట్ కాట్స్‌కి ఇప్పుడెంతో క్రేజ్. వాటికోసం ఇంట్లోనే బెడ్స్ ఏర్పాటు చేయడం చూస్తూనే ఉంటాం. అలాంటిదే కేట్ షార్క్ బెడ్. సొరచేప ఆకారంలో, మందమైన గుడ్డతో చేసిన ఈ బెడ్, ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది ఓ చిన్నపాటి గుహలా ఉంటుంది. పిల్లి దీంట్లోకి వెళ్లి హాయిగా కునుకు తీయొచ్చు.

చిన్నారుల్లో చిరునవ్వులు

సెక్స్ వర్కర్లను చూస్తే ఈసడించుకుంటాం. అలాంటిది వారి పిల్లలకు ఈ సమాజంలో ఆదరణ లభిస్తుందా? పొట్టకూటి కోసం తల్లులు చేస్తున్న ఈ వేశ్యావృత్తి వారికి శాపంగా మారాల్సిందేనా? తల్లి బాటలోనే పిల్లలు కూడా వెళ్లాల్సిందేనా? కనీసం ఈ జనరేషన్ పిల్లలనైనా విద్యాదిశగా అడుగులు వేయిస్తే.. భావి భారత పౌరులుగా ఎదగటానికి అవకాశాలు కల్పించినట్లయితే వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది కదా! ఇలాంటి ప్రశ్నలేన్నో లలితా నాయక్‌ను వేధించాయి. 54 ఏళ్ల ఈ సాధారణ మహిళ తన జీవితంలో సగం భాగం వేశ్యావాటికలోకి వెళ్లి ప్రతి ఇంటి తలుపు తట్టి అమ్మా! మీ పిల్లలకు చదువు చెబుతాను. పంపండి అని వేడుకోవటంలోనే గడిచిపోయింది.

అనార్కలీ కళ

అనార్కలీ అందం ఎప్పటికీ చెదరనిదే.కొత్త హంగులతో మార్కెట్లోకి వస్తుంటుంది. వైవిధ్యమైన వర్ణాలతో, ఎంబ్రాయిడరీ హంగులతో అద్భుతంగా మలచిన దుస్తుల్లో పండుగల కోసం వచ్చేసింది. టాలీవుడ్ కథానాయికి రకుల్ ప్రీత్‌సింగ్ వయ్యారు ఒలికిస్తూ ధరించిన ఈ అనార్కలీ సల్వార్ కమీజ్ డ్రెస్స్ యువతుల మనస్సు దోచేస్తుంది. ఆధునికతను, సంప్రదాయాన్నీ మేళవించే అనార్కలీ సల్వార్లు కనువిందు చేస్తున్నాయి. నేడు చాలామంది అనార్కలీ ఫ్రాక్‌కి బాటమ్‌గా జీన్స్ ధరిస్తూ.. స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆకట్టుకునే మెరూన్ మెరుపులో మెరిసిపోత్ను డ్రెస్స్‌కు పెద్ద అంచు ప్రత్యేకంగా నిలుస్తుంది.

ట్రావెల్ టాటూస్

టాటూ కల్చర్ ఇప్పుడు అన్ని దేశాలనూ చుట్టివేసింది. యూత్‌లో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. సమ్‌ధింగ్ డిఫరెంట్‌గానే ఉంటారు. నా రూటే సపరేట్ అనే కుర్రాళ్లు మాత్రం మనసుకు బాగా నచ్చిన లొకేషన్‌ను ఒంటిపై టాటూగా పొడిపించుకునేంతవరకూ నిద్రపోరు. ఈ ట్రెండే ట్రావెల్ టాటూస్! కొంతమంది అయితే విమానాన్ని బాడీమీద టాటూగా వేసుకుంటారు. ఇంకొందరైతే ఎవరికీ అర్థంకాని నెంబర్లను బొమ్మలాగా వేయించుకుంటారు. ఇష్టమైన పేర్లు.. ప్రదేశాలు.. వేటినైనా సరే శరీరమనే కాన్వాస్‌పై పొడిపించుకోవచ్చు.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి

mataata

కాశీ ఖండం.. 83

సర్వజ్ఞుడు అయిన మా తండ్రి ఆ జగన్మాతకి ఆనతిచ్చిన ప్రకారం నీకు చెపుతాను, ఏకాగ్రమతివై ఆకర్ణించు.
వారణస్వాది నామ నిర్వచనము
బ్రహ్మదేవుడి ఆయుర్దాయవసాన కాలంలో సమస్త లోకాలను మ్రింగి ‘మాయ’ వికల్పాలు లేనిదై తన్ను ఆశ్రయించింది. అంత పరమాత్మ అలలు లేని సముద్రమై అన్ని హద్దులు కలదై ప్రాణుల కర్మలు పండే కాలం ప్రాప్తించేదాకా మిన్నక వుంది.
ఆ సమయంలో బ్రహ్మ సృష్టి ఆకాశం ఒక్కటీ తప్ప మిగిలిన భూతాలు కరగిపోయాయి. చీకటి మాత్రం దట్టంగా క్రమ్మివేసింది. ఆ అంధకారంలో సత్తు, అసత్తు, సదసత్తును శూన్యమై ఏమీ తెలియరాదయ్యెను. ఏమి చెప్పేది?

-శ్రీపాద కృష్ణమూర్తి

శుభదినము

భగవంతుని సృష్టిలో మనకు అన్నీ అద్భుత రహస్యాలే. ఆదికాలం నుండి మానవుడు చేసే ప్రతి చర్య భగవత్ సంకల్పబలమే. తరిగే కాలాన్ని, పెరిగే మనిషి ఆయుష్షును ఎవరూ ఆపలేరు. మన జననం మనకు తెలియదు.. మన మరణం మరెవరికీ తెలియని మర్మం. అదే దేవరహస్యం. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. పంచభూతాలు మనల్ని నడిపించే ప్రత్యక్ష దైవాలు. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే లోకకళ్యాణం, లేదంటే ప్రళయం. ఇప్పటికే ఈ భూప్రపంచంలో ఎన్నో విపత్తులు చూస్తేనే వున్నాము. మానవులు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారు. ఈ కలియుగంలో వరదలు, తుఫానులు, భూకంపాలు వచ్చి ప్రాణ ఆస్తి నష్టాలు అనునిత్యం చూస్తూనే ఉంటున్నాము.

- కురువ శ్రీనివాసులు

నేర్చుకుందాంకం

బహు కష్టములం బొందక
మహిలో సమకూడబోదు మానవ జన్మం
బహహ! ఈ జన్మంబున
నిహపరముల గొనెడు జాడ లెఱుగు కుమారీ!
భావము:ఓ కుమారీ! అనేక విధములైన కష్టములను చెందక భూమియందు మనుష్య జన్మము కలుగదు. ఔరా! ఈ జన్మమునందు ఈ లోక సౌఖ్యములను పర లోక సౌఖ్యములను అనుభవించు విధములను తెలుసుకొనుము. ఈ మనుష్య జన్మములో ఏ పాపమూ రాకుండా సౌఖ్యాన్ని అనుభవించే విధమును తెలుసుకుని పుణ్యమును సంపాదించవలెనని కవి బోధించాడు.
బక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారీ శతకములోనిది. - కె. లక్ష్మీఅన్నపూర్ణ

కొత్త స్నేహితులు 37

అనాకారుల్లో ఉన్నంత ఆకర్షణ కూడా తనలో లేదా? తనలో ఏ ఆకర్షణా కనిపించకపోవడంవల్లనేనా- దీపం వెలుతుర్లో తనకు నిద్రపట్టదని చెప్పినవాడు కూడా అంత హాయిగా తన ఉనికినే పరిగణనలోకి తీసుకోని వాడిలా అంత హాయిగా నిద్రపోతున్నాడతడు?
పరస్తుతి, ఆత్మనిందలతో మనసులో ఎంతసేపు ఎన్ని విధాలుగా విత్కరించుకున్నా ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు సామ్రాజ్ఞికి.
చివరకు ‘తాను ఆడదైనా కాకపోయి ఉండాలి లేదా అతడు మగాడైనా కాకపోయి ఉండాలి’ అనే నిర్థారణకు వచ్చి మంచంమీద నుంచి లేచి నిలబడి సోఫాలో పడుకున్న అతడి దగ్గరగా వెళ్లింది.
‘అతణ్ణి తట్టి లేపాలా? వద్దా’ మళ్లీ సంశయం.

సీతాసత్య

Pages