S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశువుల తరలింపులో నిబంధనలు పాటించాలి

నల్లగొండ టౌన్, డిసెంబర్ 8: పశువులను వాహనంలో తరలించేటప్పుడు నియమ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన జిల్లాస్ధాయి పశువుల కౄరత్వ నిరోధకస్ధాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పక్షులు, కోళ్లు, జంతువులను తరలించేటప్పుడు కౄరత్వ నిరోదానికి నిర్వాహకులు వ్యక్తులకు ముందస్తుగా అవగాహన కల్పించాలని సూచించారు. అందుకు కావల్సిన వస్తువులను, సరఫరా చేసి అందరికీ చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

టెక్స్‌టైల్ పార్క్ రూపురేఖలు మారుస్తాం

చౌటుప్పల్, డిసెంబర్ 8: టెక్స్‌టైల్ పార్క్ రూపురేఖలు మార్చి అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు తెలిపారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని టెక్స్‌టైల్ పార్క్‌ను గురువారం సాయంత్రం అకస్మికంగా సందర్శించారు. పార్క్‌లోని యూనిట్లను పరిశీలించారు. 119 యూనిట్లకు కేవలం ఐదు యూనిట్లు నడవడం బాధకరమన్నారు. పార్క్‌ల్లో ఇక నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చెల్లదని పేర్కొన్నారు. కార్మికుల ఉపాధి కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వచ్చే బడ్జెట్‌లో చేనేతకు నిధులు పెంచుతామని పేర్కొన్నారు.

సింగిల్‌విండో ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం

కట్టంగూర్, డిసెంబర్ 8: కట్టంగూర్ సింగిల్‌విండో ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 13డైరెక్టర్ స్థానాలకు గాను 8డైరెక్టర్ స్థానాల్లో గెలుపొంది సింగిల్‌విండో చైర్మన్‌ను అధిష్టించనుంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ గట్టిపోటీ ఇచ్చినప్పటికి 5స్థానాలకే గెలుపు పరిమితమయ్యింది. మొత్తం 13డైరెక్టర్ స్థానాలకు గాను ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా టిఆర్‌ఎస్ సాధించగా 12డైరెక్టర్ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించారు.

బుల్లి వేరబుల్ కెమెరా

మార్కెట్‌ను రకరకాల వేరబుల్ కెమెరాలు ముంచెత్తుతున్నాయి. అలా అని కొత్త వాటికి చోటు లేదని కాదు. తాజాగా వచ్చిన పోగో కామ్ కెమెరాను చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. ఇది ప్రపంచంలోనే అతి చిన్నదైన అటాచబుల్ కెమెరా. కళ్లజోడు ఫ్రేమ్‌కు అటాచ్ చేసుకునేందుకు వీలుగా రూపొందించిన ఈ కెమెరాతో టకటకా 100 ఫొటోలు ఏకధాటిన తీసేయొచ్చు. అలాగే రెండు నిమిషాలసేపు వీడియో తీయొచ్చు కూడా. పోగో కామ్‌ను ఏ కళ్లజోడుకైనా అటాచ్ చేయొచ్చు లేదా డిటాచ్ చేయొచ్చు. మరి, కళ్లజోడు అవసరం లేనివాళ్ల విషయమేంటని అనుకుంటున్నారా? అలాంటివాళ్లు డమీ కళ్లజోడుకు పోగోకామ్‌ను అమర్చుకోవచ్చు.

రోబో రోడ్డెక్కింది!

‘మీ ఇంటికొచ్చా...మీ నట్టింటికొచ్చా’ అంటూ ఓ హీరో పలికిన డైలాగ్ ఆ మధ్య బాగా పాపులర్ అయింది. అవే మాటలు ఓ రోబో పలికితే ఎలా ఉంటుంది!
ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! లండన్‌కు చెందిన సైమన్ అనే మహిళ కూడా ఇలాగే బోలెడంత ఆశ్చర్యపోయింది. దానికి కారణం.. ఓ రోబో స్వయంగా వచ్చి, ఆమె ఇంటి తలుపు తట్టి ఆమె ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను సర్వ్ చేసి, బై చెప్పి వెళ్లిపోవడం!

ప్యాకేజ్డ్ వస్తువుల సరఫరా

స్టార్‌షిప్ టెక్నాలజీస్ తయారు చేసిన రోబో కేవలం ఆహారానే్న కాకుండా, ప్యాకేజ్డ్ వస్తువులను వేటినైనా సరఫరా చేస్తుంది. అలాగే కిరాణా సరుకుల్నీ ఇంటికొచ్చి అందిస్తుంది. ఇది బ్యాటరీతో నడుస్తుంది. దీని వేగం గంటకు పదహారు కిలోమీటర్లు. ఇవి తమ కేంద్ర స్థానానికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వస్తువుల్ని డెలివరీ చేస్తాయి. ఈ రోబోలు కేవలం ఫుట్‌పాత్‌పై మాత్రమే వెడతాయి. ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు వీలుగా మామూలు కెమెరాలతోపాటు శక్తిమంతమైన 360 డిగ్రీల కెమెరా, ఇన్‌ఫ్రారెడ్, అల్ట్రాసోనిక్ సెన్సర్లు ఇందులో ఉంటాయి. ఇవి స్వయం చోదకమైనవి (సెల్ఫ్ డ్రైవింగ్).

ఉట్టిపడే సేవాభావం

చిన్న వయసులోనే సేవాభావాన్ని అలవరచుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సమాజసేవకు పాటుపడుతున్న యాలాల ప్రవీణ్‌కుమార్ ఇందుకు ఉదాహరణ. సెంట్రల్ వర్శిటీలో ఫిలాసఫీలో పీజీ చేస్తున్న ప్రవీణ్‌ను ఇటీవల ఇందిరాగాంధీ ఎన్‌ఎస్‌ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) అవార్డు వరించింది. వారం రోజుల కిందట ఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అతను అవార్డు అందుకున్నాడు. ఇదే విషయమై ప్రవీణ్‌ను కదిలిస్తే...యువతకు స్ఫూర్తిగొలిపే ఎన్నో అంశాల గురించి ప్రస్తావించాడు.

మంచు స్థూపాలతో నీటి ఎద్దడి పరార్

ఏడేళ్ల కిందట వచ్చిన ‘3 ఇడియట్స్’ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంప్రదాయ విద్యావ్యవస్థలోని లోపాలను సున్నితంగా ఎత్తిచూపుతూ, పాఠ్యాంశాల బోధనలో ఎలాంటి మార్పులు చేయొచ్చో సాధికారికంగా చూపిస్తూ, వీలైనప్పుడల్లా సెటైర్లు పేలుస్తూ సాగిన ఈ సినిమా కుర్రకారును ఎంతో ఆకట్టుకుంది. అందులో హీరో అమీర్ ఖాన్ పోషించిన ‘్ఫన్‌షుక్ వాంగ్డూ’ పాత్ర అయితే మరీను! పిల్లలతో చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేయిస్తూ, వారి ప్రతిభకు సానబెట్టే పాత్రలో క్లైమాక్స్ సీన్లలో అమీర్‌ఖాన్ నటన చిన్నారులపై ఎంతో ప్రభావం చూపింది. అయితే ఈ పాత్రకు సంబంధించినంతవరకూ అమీర్‌పై ప్రభావం చూపిన మరో వ్యక్తి ఉన్నాడు.

వైబ్రేటింగ్ ఇయర్‌ఫోన్స్!

చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ నిద్రలోకి జారుకోవడం చాలామందికి అలవాటు. అయితే వారు నిద్రలోకి వెళ్లిపోయినా, మ్యూజిక్ మాత్రం ఆగదు కదా? అయితే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికింది. ఇప్పుడు మార్కెట్లోకి వైబ్రేటింగ్ ఇయర్‌ఫోన్స్ వచ్చాయి. దీనికో టైమర్ మోడ్ ఉంటుంది. టైమర్‌ను సెట్ చేసుకుంటే, అప్పటివరకూ పనిచేసి, ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. ఇందులో అలారమ్ మోడ్ కూడా ఉంటుంది. ఇది దేనికంటే, ఉదాహరణకు మీరు బస్సులో మ్యూజిక్ వింటూ వెడుతున్నారనుకోండి. మ్యూజిక్ ధ్యాసలో పడి, దిగవలసిన బస్టాప్ మరిచిపోయే ప్రమాదం ఉంది కదా. అలాంటప్పుడు అలారమ్‌ను సెట్ చేసుకుంటే సరి.

సెల్ఫీలు తీసే డ్రోన్!

ఫొటోలో కనిపిస్తున్న వస్తువేంటో అంతుబట్టడం లేదా? అరచేతికి అరంగుళం ఎత్తున ఎగురుతున్న ఈ వస్తువు ఓ బుల్లి డ్రోన్! మరో విశేషమేంటంటే... అది సెల్ఫీలు తీస్తుంది. కేవలం సెల్ఫీలు తీసేందుకే రూపొందించిన ఈ మైక్రో డ్రోన్ పేరు-ఎయిర్ సెల్ఫీ! పేరుకు తగ్గట్టే ఇది గాలిలో ఎగురుతూ సెల్ఫీలు తీస్తుంది.
ఇప్పుడు యువతరాన్ని సెల్ఫీల క్రేజ్ ఊపేస్తోంది. అందుకు తగ్గట్టే సెల్ఫీ కెమెరాలతో ఉన్న స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. వీటితో సెల్ఫీలు తీసుకునేందుకు సెల్ఫీ స్టిక్స్‌లాంటి ఉపకరణాలూ వస్తున్నాయి. అయితే సెల్ఫీల కోసం ఏకంగా డ్రోన్‌నే తయారు చేయడం మాత్రం ఇదే మొదటిసారి.

Pages