S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బూతు.. కామెడీ అయిపోయింది!

‘ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రాలలో భారతీయత, మన సంస్కృతి ఎక్కడా కనబడడంలేదు. దర్శక నిర్మాతలందరూ ఓ గిరి గీసుకొని కూర్చున్నారు. మన సంస్కృతిమీద ఆధారపడి బతుకుతున్నవారు ఎందరో వున్నారు. అలాగే సినిమా పరిశ్రమపై ఆధారపడినవారు ఎంతోమంది వున్నారు. సినిమాల ప్రభావం పాత్రలపై పడుతున్నాయి. దానితో ప్రేక్షకులు కూడా ఏదో అర్ధంకాని మత్తులో సినిమాలు చూస్తున్నారు అనిపిస్తోందిది నాకు’ అంటున్నారు అలనాటి అభినేత్రి వాణిశ్రీ. ఇటీవల తమిళనాడులో ఆమెకు అంజలీదేవి అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు తెలిపారు.
శోకరసంలో అంజలి టాప్

-శేఖర్

ఫిబ్రవరి 10న నమో వేంకటేశాయ

అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి చిత్రాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కలయికలో రూపొందుతున్న మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

గల్ఫ్‌లో అరబిక్ పాట

వలసల నేపథ్యంలో పి.సునీల్‌కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గల్ఫ్’. శ్రావ్య ఫిలింస్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు, ఎం.రమణీకుమారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ ఇందులో హీరో హీరోయిన్లు. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా విశేషాలను దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి వివరించారు. ‘ఇలాంటి నేపథ్యంలో ఇంతవరకు తెలుగులో సినిమా రాలేదు. అనేక యధార్థగాధలను పరిశీలించి, పరిశోధించి ఈ స్క్రిప్టు తయారుచేశాం. ఆర్‌ఎఫ్‌సి, హైదరాబాద్ పరిసరాలు, గల్ఫ్ కంట్రీస్‌లో చిత్రీకరణ జరిపాం. ఈ సినిమాలో ఒక అరబిక్ పాటను సందర్భోచితంగా చిత్రీకరించాం.

ఎంతవరకు ఈ ప్రేమ

‘రంగం’ వంటి సూపర్‌హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కవలై వేండం’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డి.కె. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. జీవా మాట్లాడుతూ- ఎంతవరకు ఈ ప్రేమ చాలా ఎంటర్‌టైనింగ్ లవ్‌స్టోరీ అని, ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అని, ఫుల్ ఫన్ మూవీ అని అన్నారు. నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్న ఈచిత్రం ‘్భలే భలే మగాడివోయ్’, ‘పెళ్లిచూపులు’ తరహాలో ఉంటుందని అన్నారు.

మేఘమాల కథతో ఇదో ప్రేమలోకం

అశోక్ చంద్ర, రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో ఎస్.పి.నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. ఈ చిత్రానికి సంబంధించిన రీ రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కరణ్‌రాజ్ మాట్లాడుతూ- ఓ అందమైన ప్రేమకథగా రూపొందించిన ఈ చిత్రంలో ఓ మేఘమాల కథనం వుంటుందని అన్నారు.

మలయాళంలో చాన్స్

గత కొద్దికాలంగా హీరోయిన్ ప్రధాన సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తోన్న త్రిష, హీరో ప్రధాన సినిమాల్లోనూ తనకంటూ ఒక బలమైన పాత్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ‘్ధర్మయోగి’ అనే సినిమాలో ఎవ్వరి ఊహకూ అందకుండా ఓ నెగెటివ్ రోల్ చేసిన త్రిప ఇప్పుడు సౌతిండియన్ సినిమాలో మళ్లీ టాప్ హీరోయిన్ రేసులోకి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె దాదాపు నాలుగు సినిమాల్లో పలు ఇంటరెస్టింగ్ రోల్స్ చేస్తున్నారు. మలయాళంలో ఇప్పుడున్న యువ హీరోల్లో క్రేజీ హీరో అయిన నివిన్ పాలీ నటించే సినిమాలో త్రిష ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారట.

అల్లుడు శీను సరసన ప్రగ్యా

‘సరైనోడు’తో బంపర్ హిట్ కొట్టి తన స్థాయిని మరింత పెంచుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా రెండో హీరోయిన్ కోసం ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసారు. ‘కంచె’ సినిమాతో పరిచయమై హీరోయిన్‌గా పలు వరుస అవకాశాలను సొంతం చేసుకుంటోన్న ప్రగ్యా, ఈ సినిమాలో గ్లామరస్ పాత్రలో కనిపిస్తారు. ద్వారకా క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా బోయపాటి స్టైల్ యాక్షన్ ఎంటర్‌టైన్‌గా ప్రచారం పొందుతోంది.

శరవేగంగా నీలిమలై

నీలిమ ప్రొడక్షన్స్ పతకంపై ఆనంద్ కృష్ణ, స్వరూప హీరో హీరోయిన్లుగా బేబీ హర్షిత ప్రధాన పాత్రలో ఆనంద్ కృష్ణ నిర్మాతగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో భక్తిరస చిత్రం ‘నీలిమలై’. వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మరియు హీరో ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ- కేరళలో వివిధ లొకేషన్స్‌లో 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుని మిగిలిన 30 శాతం షూటింగ్ ప్రస్తుతం వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుపుతున్నామని, ఈనెల 24తో షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ ఈ చివరి వారంలోపే పూర్తిచేసి ఇదే నెల ఆడియోని జనవరి మొదటివారంలో సినిమాను విడుదల చేయనున్నామన్నారు.

ఆకుకూరలతో ఆరోగ్యంగా...

ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, పోషకాలు అతి చౌకగా లభించే ఆకు కూరలు తినటమే మేలు. కాని పచ్చటి ఈ ఆకుకూరలను మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. వీటిని ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటే అధిక బరువు పెర గకుండా శరీరాకృతి నాజుకుగా కూడా ఉంటుంది. సాత్వికాహారమైన ఆకు కూరల్లో పోషకాలు పోకుండా ఉండాలంటే వాటిని సూర్యరశ్మి తగలని ప్రదేశంలో ఉంచాలి. సూర్యరశ్మి తగిలితే ఆకుకూరల్లో వుండే కెరోటిన్ అనే పోషక పదార్థాలు నశిస్తాయి. వండటానికి ముందు ఆకులపైన జల్లిన మందు వాసన పోయేలా శుభ్రంగా కడగాలి.

ప్రొటీన్ల పుట్ట పొన్నగంటి

పొన్నగంటికూర రక్తాన్ని శుభ్రపరచడమే కాక శరీరానికి చలువనిస్తుంది. గుండెకి మంచిది. బి, సి విటమిన్‌లు ఎక్కువగా వుంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. మూత్ర వ్యాధులవను నివారిస్తుంది. పొన్నగంటి ప్రొటీన్ల పుట్ట అని సామెత. విటమిన్ ఎ, బి6, సి, ఫాలేట్, రిబొఫ్లావిన్, పొటాసిం, ఇనుము, మెగ్నీషియం దీనిలో సమృద్ధిగావుంటాయి. గోధుమపిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే 30 శాతం అధికంగా ప్రొటీన్లు దీనిలో వున్నాయి. అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. బరువు తగ్గాలనేవారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఎక్కువగా తినాలి. ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా వుంటుంది. రోగనిరోధక శక్తి దీనిలో వుంది.

Pages