S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమర్థులను నియమించాలి

దేశంలోని కోర్టుల్లో, మరీ ముఖ్యంగా హైకోర్టులు,

సుప్రీంకోర్టులో సమర్థత, నిబద్ధత కలిగిన వారినే

న్యాయమూర్తులుగా నియమించాలి. ఇందుకోసం

న్యాయవ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ సంయుక్తంగా నిర్ణయం

తీసుకోవాలి. సమర్థత లేనివారిని నియమిస్తే ఎలాంటి

ఉపయోగం ఉండదు. కొంతమంది జడ్జీలు తమ పదవీ

కాలంలో ఒక్క తీర్పు కూడా ఇవ్వకుండా పదవీవిరమణ

చేసినవారు ఉన్నారు. సమర్థత, అనుభవం ఉన్న జడ్జీల

వద్దకు ఎలాంటి కేసులు వచ్చినా తొలుత వాటిలో మెరిట్

పరిశీలిస్తారు. విచారణకు యోగ్యమైనవిగా భావిస్తే,

నోటీసులు జారీ చేస్తారు లేనిపక్షంలో మొట్టమొదటనే

- జస్టిస్ రెడ్డపరెడ్డి హైకోర్టు మాజీ న్యాయమూర్తి

కోర్టులపై నమ్మకం పోతోంది

ఉన్నతస్థాయి న్యాయస్థానాల్లో విచారణకు వస్తున్న కేసుల్లో

తీర్పు ఇవ్వడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుండటం వల్ల

కోర్టులపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఈ నేపథ్యంలో

‘కన్సాలిడేటెడ్ హోలిస్టిక్ అప్రోచ్’ ఉండాలి. క్రిమినల్

కేసులతోపాటు సివిల్ కేసులు కూడా దశాబ్దాల తరబడి

పెండింగ్‌లో ఉంటున్నాయి. యావజ్జీవ కారాగారశిక్ష 14

సంవత్సరాలపాటు ఉండగా, కేసుల విచారణలో

అంతకుమించి జాప్యం జరుగుతోంది. దాంతో కోర్టులపై

ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. అందువల్ల ఉన్నత

న్యాయస్థానంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై

- జస్టిస్ ఎ. లక్ష్మణ్‌రావు ప్రధాన న్యాయమూర్తి (రిటైర్డ్), అలహాబాద్ హైకోర్టు

నియామకాలు పెరగాలి

కిందిస్థాయి కోర్టునుంచి మొదలుకుని సుప్రీం కోర్టు వరకూ

3 కోట్ల పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉండడం ఆందోళన

కలిగిస్తున్న అంశం. దీనివల్ల సకాలంలో న్యాయం జరగదు.

కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని జ్యుడీషియల్

కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. దేశంలో ఎక్కడైనా ఏ

కోర్టులోనైనా న్యాయమూర్తుల ఖాళీలేర్పడుతున్నాయంటే

ఆరు నెలల ముందే నియామకాలు చేపట్టాలి. ఈ

కమిషన్‌కు పూర్తి అధికారాలుండాలి. నియామకాలే

కాకుండా న్యాయమూర్తులపై ఎటువంటి ఆరోపణలు

వచ్చినా ఈ కమిషనే విచారణ జరిపి చర్య తీసుకునే

అధికారం ఉండాలి. ఉదాహరణకు కేంద్ర ఎన్నికల కమిషన్

- కె. పార్థసారథి అఖిల భారత లాయర్ల యూనియన్ తెలంగాణ శాఖ ఉపాధ్యక్షుడు

వ్యవస్థను బలహీనపర్చే కుట్ర

హైకోర్టుల్లో 500 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా

ఉన్నాయి. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఐదు వేల

న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ

కోర్టులు, హైకోర్టు, సుప్రీం కోర్టుపై కేసుల పరిష్కారం

విషయంలో తీవ్రమైన వత్తిడి పెరుగుతోంది.

న్యాయమూర్తులు నాణ్యమైన తీర్పులను

వెలువరించలేకపోతున్నారు. లక్షలాది కేసులు పెండింగ్‌లో

ఉన్నాయి. సామాన్యుడు కోర్టులను ఆశ్రయించి సత్వరమే

న్యాయాన్ని పొందలేకపోతున్నాడు. దీనికి మూలాలను

అనే్వషిస్తే దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడవుతాయి.

సుప్రీం కోర్టు కొలీజియంతో కేంద్రం అవలంభిస్తున్న

- పొన్నవోలు సుధాకరరెడ్డి అధ్యక్షుడు, వైకాపా ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్

పెండింగ్‌లో 3కోట్ల కేసులు

వివిధ కోర్టుల్లో మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీం కోర్టులో ఈ మూడు

స్థాయిల కోర్టుల్లో మూడు కోట్ల కేసులు పేరుకు పోయాయి.

వీటిలో లక్ష కేసులు వివిధ హైకోర్టుల్లో ఉంటే, సుప్రీంకోర్టులో

65వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టుల్లో 50శాతం

ఖాళీలున్నాయి. జీవిత కాలంలో న్యాయస్థానాల్లో న్యాయం

లభిస్తుందనే ఆశలు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా

మూడున్నర వేలమంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 40

శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని

తేలింది. విచారణ జరిగి, తీర్పులు వచ్చేంతవరకు వీరి

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి

సంస్కరణలు అవసరం

కోర్టుల్లో అసంఖ్యాకంగా కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

వాటిలో కొన్ని కేసులు దశాబ్దాలుగా ఉంటున్నాయి.

పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని

న్యాయమూర్తుల నియమాకాన్ని వెంటనే చేయాలి. కొత్త

నియమకాలను ఎవరు చేయాలన్నది ఇక్కడ ప్రశ్న కాదు.

ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు

చూసుకుంటుంది. కానీ అందుకు అనుగుణంగా చర్యలు

తీసుకునే బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుంది.

అటువంటి చర్యలేవీ కేంద్రం ఇంత వరకుచేపట్టినట్లు

కనిపించడం లేదు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో

సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు

- కె.ఆర్. సురేష్ రెడ్డి అసెంబ్లీ మాజీ స్పీకర్

న్యాయ వ్యవస్థపై రాజకీయాలు వద్దు

న్యాయ వ్యవస్థలో రాజకీయ నాయకులు తలదూర్చరాదు.

రాజకీయాలతోనే న్యాయ వ్యవస్థ కలుషితమవుతోంది.

పెండింగ్ కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి

కూడా రాజకీయాలే కారణం. కోర్టుల్లో న్యాయమూర్తుల

పోస్టులు భర్తీ కానందువల్లే కేసుల పరిష్కారంలో దిగువ

కోర్టులు, హైకోర్టు, సుప్రీం కోర్టులపై తీవ్రమైన ఒత్తిడి

పెరుగుతోంది. సుమారు ఐదు వందల న్యాయమూర్తుల

పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీచేస్తే కొంతమేరకు

కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. న్యాయ స్థానాల్లో కేసులు

పెరిగిపోతున్నందునే న్యాయమూర్తులు నాణ్యమైన

-పాండురంగారావు లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వాల వైఖరే కారణం

కోర్టులలో కేసులు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోవడానికి పరోక్షంగా, ప్రత్యేక్షంగా ప్రభుత్వాలే కారణం. కోర్టులలో కేసులు పెరగడానికి కారణం సరిపడినన్ని కోర్టులు, న్యాయమూర్తులు లేకపోవడమే. కోర్టులు, న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని హైకోర్టులు, సుప్రీంకోర్టు, లా కమిషన్ కోరుతున్నా ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయి. కోర్టులలో పెండింగ్‌లలో ఉన్న వాటిలో 60 నుంచి 70 శాతం కేసులు ప్రభుత్వం ప్రతివాదులుగా ఉన్నవే. కోర్టుల సంఖ్య పెంచడంవల్ల న్యాయవ్యవస్థ బలపడుతుందని, తద్వారా శాసన వ్యవస్థ ప్రాధాన్యత తగ్గుతుందని పాలకులు భావన. కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉండటానికి ప్రభుత్వాలే కారణం.

- జస్టిస్ చంద్రకుమార్ రిటైర్టు హైకోర్టు న్యాయమూర్తి

7 వేల థియేటర్లలో రోబో-2

పెద్ద నోట్ల ప్రభావం చాలా సినిమాలపై పడింది. కొన్ని సినిమాలు విడుదల వాయిదా వేస్తున్నాయి. ఇక కొత్త ఏడాదిలో పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉండొచ్చు. ఇక వచ్చే ఏడాది ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి. అవే ఒకటి ‘బాహుబలి-2’, రెండు ‘రోబో-2’. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో రోబోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తోంది. ఏకంగా నాలుగువందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విడుదల కూడా అంతే భారీగా చేయనున్నారు. క్రేజీ దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 7 వేల థియేటర్లకు పైగా విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రేపు అఖిల్ నిశ్చితార్ధం

అక్కినేని నాగేశ్వరరావు మనమడు, నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని జివికె కుటుంబానికి చెందిన శ్రీయాభూపాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అఖిల్, శ్రీయాభూపాల్ నిశ్చితార్ధం ఈనెల 9న జరగనుంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటుగా అక్కినేని కుటుంబ వేడుకగా జరపనున్నారు. వివాహం తరువాత జరిగే రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించడానికి అక్కినేని కుటుంబం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి అందర్నీ ఆహ్వానిస్తున్నట్టుగా అక్కినేని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

Pages