S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్ లై

హీరో నితిన్ తాజాగా ‘అఆ’ సినిమా హిట్ అందుకుని, 50 కోట్ల మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తరువాత నితిన్‌తో మళ్లీ ఓ సినిమా చేయడానికి దర్శకుడు త్రివిక్రమ్ సిద్ధవౌతున్నాడు. అయితే ఈసారి దర్శకుడుగా కాకుండా నిర్మాతగా? పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్‌లు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈమధ్యే ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘లై’ అనే పేరును ఖరారు చేశారు. తాజాగా ‘లై’ అనే టైటిల్‌ను ఫిలిమ్ ఛాంబర్ హాలులో రిజిస్టర్ చేయించారు. లవ్ ఈజ్ ఎండ్‌లెస్ అనేది సినిమాకు సబ్ టైటిల్. రౌడీ ఫెలో దర్శకుడు చైతన్యకృష్ణ నేతృత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

బాబీకే చాన్స్

‘జనతా గ్యారేజ్’ విడుదలై అప్పుడే మూడునెలలు గడిచిపోయాయి. ఇంతవరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా ఇంకా ఓకే చెయ్యలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథ చర్చలు జరిపిన ఆయన తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఆయన ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్వత్రా ఆసక్తినెలకొన్న ఈ సినిమా విషయంలో ఫైనల్‌గా ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆయన నటించే కొత్త సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తాడట. ఇటీవలే బాబీ చెప్పిన కథ నచ్చడంతో ఎన్టీఆర్ ఓకే చెప్పాడని సమాచారం. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తాడని, ఈనెల 10న సినిమా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

ఖైదీ 150 పాటలో కనిపిస్తా

టెన్షన్‌గా ఉంది
ప్రతి సినిమా విడుదలయ్యేటప్పుడు కచ్చితంగా టెన్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ సినిమాకు ఓ స్పెషల్ ఉండడంతో అది మరింత ఎక్కువైంది. రీమేక్ సినిమా అవడంతో ఎలా ప్రేక్షకులు ఆదరిస్తారా అని ఎదురుచూస్తున్నాను.
రీమేక్ ఎందుకు?
రీమేక్, స్ట్రయిట్ అనేది ఏం లేదు. కథ బాగుంటే ఏ సినిమా అయినా చేయాలి. అయితే రీమేక్ తీసేటప్పుడు ఎటూ అక్కడ హిట్టయ్యి ఉంటుంది కనుక దానికి మరింత పదునుపెట్టి చిత్రీకరణ చేయాల్సి వుంటుంది. ఆ జాగ్రత్తలన్నీ ఈ సినిమాకోసం చేశాం. ఎన్.వి.ప్రసాద్ ‘తనిఒరువన్’ సినిమాను చూడమని చెప్పారు. కథ నచ్చడంతో సురేందర్ రెడ్డికి చెప్పాం.
కొత్తగా..

- శ్రీ

ధనుష్ సినిమాలో కాజోల్

‘వెళ్లాయిల్లా పట్టాదారి’ సినిమాతో సంచలన విజయం సాధించాడు హీరో ధనుష్. ఆ సినిమా ‘రఘువరన్’గా తెలుగులో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘విఐపి 2’ పేరుతో చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రెట్టీ గర్ల్ కాజోల్ కీలక పాత్రలో నటిస్తుందట!! పెళ్లి చేసుకుని కొంత గ్యాప్ తీసుకున్న కాజోల్ లేటెస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. షారుఖ్ సరసన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’. ‘దిల్వాలే’ సినిమాల్లో నటించింది.

మళ్లీ యోగా

బాలీవుడ్ బ్యూటీ.. శిల్పాశెట్టి గ్లామర్ హీరోయిన్‌గా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఇక హీరోయిన్‌గా కెరీర్‌లో బ్రేక్ పడ్డాక ఈ అమ్మడు బిజినెస్‌మన్‌ని వివాహం చేసుకుని బిజీగా మారింది. ఆకట్టుకునే గ్లామకు తోడు యోగాలో ఆమెకు ఆసక్తి ఎక్కువ. ప్రావీణ్యమూ ఉంది. గతంలో యోగా విన్యాసాలు చేస్తూ వీడియోలూ విడుదల చేసింది. సనాతన యోగ సంప్రదాయాలు పుట్టింది ఇండియాలోనే అయినా.. విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ మళ్ళీ ప్రాచుర్యం తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేసింది. శిల్ప యోగ వీడియో అప్పట్లో దుమ్ము రేపింది. దాంతో ఇప్పుడు మళ్ళీ యోగాలోని ఇంకొన్ని అంశాలతో హాట్ వీడియోని రెడీ చేయడానికి సిద్ధం అయిందట.

నరుూం సినిమా షూటింగ్‌కు బ్రేక్!

నల్లగొండ టౌన్, డిసెంబర్ 7: పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నరుూం నేర చరిత్ర ఆధారంగా తీస్తున్న ‘ఖయ్యూం భాయ్’ సినిమా చిత్రీకరణ నల్లగొండ పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయింది. సినిమా యూనిట్ ఎలాంటి ముందస్తు అనుమతులు పొందకుండా రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించేలా సన్నివేశాల చిత్రీకరణ సాగిస్తుండటాన్ని నల్లగొండ పోలీసులు అడ్డుకుని షూటింగ్ నిలిపివేశారు. అయితే గత రెండు రోజుల్లో సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణను చిత్ర యూనిట్ పూర్తి చేసింది. దర్శకుడు భరత్ ఖయ్యూం భాయ్‌గా టైటిల్ రోల్ పోషిస్తుండగా నటులు బెనర్జీ, రాంప్రసాద్ ప్రభృతులు షూటింగ్‌లో పాల్గొన్నారు.

కామెడీతో మామ ఓ చందమామ

రామ్‌కార్తీక్, సనాఖాన్ హీరో హీరోయిన్లుగా శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో ఈస్ట్‌వెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న చిత్రం ‘మామ.. ఓ.. చందమామ’. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రం యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో... నవంబర్ 11న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను దర్శకుడు పెద్ద వంశీ ఊరు అయిన పసలపూడిలో స్టార్ట్ చేశాం.

పేద బాలల్ని అమ్మల్లా ఆదరించండి

పటమట, విజయవాడ 7: అక్షరాస్యత వల్ల ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని, దీనికి మన రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీలు, డ్వాక్రా సంఘాలు విరివిగా కృషి చేయాలని, ఉద్యోగులుగా కాకుండా పేద బాలలకు తల్లులుగా సేవలందించినప్పుడే ఇది సాధ్యవౌతుందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గురునానక్ నగర్ నాక్ కల్యాణ మండపంలో జిల్లా ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో ఎంపిడివోలు, ఎంఈవోలు, డ్వాక్రా సంఘాలు, అంగన్‌వాడీల కోసం ఏర్పాటు చేసిన ‘ఆహార జ్యోతి- పౌష్టికాహారం- చిరుధాన్యాల’పై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియచేయాలి

అవనిగడ్డ, డిసెంబర్ 7: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించటమే ధ్యేయంగా కృషి జరగాలని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వామీజీలు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కృష్ణా పుష్కర ఘాట్ వద్ద కంచికామకోటి పరమాచార్య చంద్రశేఖర స్వామీజి వారి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం గాంధీ క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో స్వామీజీలు భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేశారు. ఈ ఆధునిక సంస్కృతి మధ్య ఆధ్యాత్మికతతో పరిరక్షించుకోవాలని, శాంతిపై దృష్టిని మరల్చి సంతృప్తి జీవనం కోసం ప్రతి మానవుడు కృషి చేయాలన్నారు.

గురుకుల పాఠశాలలుగా సంక్షేమ హాస్టళ్లు

పామర్రు, డిసెంబర్ 7: ఆంధ్ర రాష్ట్రంలో రానున్న మూడు సంవత్సరాలలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు అన్నింటినీ అనుసంధానం చేస్తూ ఆయా ప్రాంతాలలో గురుకుల పాఠశాలలుగా రూపాంతరం చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడించారు. పామర్రు మండలం ఉరుటూరులో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.13కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన రాష్ట్ర స్థాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ దివంగత ఎన్టీ రామారావు ప్రభుత్వ గురుకుల వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు.

Pages