S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకో 20 రోజులు.. ఇదే స్ఫూర్తి

విజయవాడ, డిసెంబర్ 7: డిసెంబర్ నెల మొదటివారం విజయవంతంగా ముగించాం, మిగిలిన 20 రోజులు ఇదే స్ఫూర్తితో పని చేసి డిమానిటైజేషన్ సమస్యను అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. బ్యాంకర్లు, ఆర్థికశాఖ అధికారులతో ఆయన బుధవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిమానిటైజేషన్ ప్రారంభమై ఇప్పటికి నెల రోజులు అయ్యిందంటూ నగదు రహితంగా రాష్ట్రాన్ని మార్చడంలో ఉత్తీర్ణులు అయ్యామన్నారు. భౌతిక నగదు వినియోగం తగ్గించి, డిజిటల్ నగదు వాడకం పెంచడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారంగా మరోసారి గుర్త చేశారు. వచ్చే నెలలో ఈ సమస్య ప్రభావం పూర్తిగా అధిగమిస్తామనే విశ్వాసం ప్రకటించారు.

నగదు ఇబ్బందులు వాస్తవమే

వరంగల్, డిసెంబర్ 7: దేశంలో నల్లధనాన్ని వెలికితీయడానికి కేంద్రం తాజాగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు కార్యక్రమం కేవలం ప్రారంభమేనని, దశాబ్దాలుగా అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని బయటకు తీసుకురావటానికి కేంద్రం భవిష్యత్తులో అనేక రకాల చర్యలు తీసుకుంటుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనని, కానీ దేశప్రయోజనాల కోసం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు సమర్ధిస్తున్నారని చెప్పారు.

రైతు గొంతు వినిపిస్తాం

మహబూబ్‌నగర్, డిసెంబర్ 7: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని బాధ్యత గల రాజకీయ పార్టీగా.. రైతు గొంతుకగా నిలుస్తామని.. అసెంబ్లీ శీతకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా అప్పుడు రైతుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను మోసం చేస్తున్నారని రుణమాఫీ విషయంలో దగా చేశారని రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా చేసిన ఘనుడని ఆరోపించారు.

పేద విద్యార్థుల కోసమే ‘అక్షయపాత్ర’

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 7: పేద విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన కంది శివారులో నిర్మించనున్న అక్షయపాత్ర భోజన శాల తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి హై-టెక్ భోజనశాలగా నిలిచిపోతుందన్నారు. ఐదెకరాల స్థలంలో నిర్మించనున్న భోజనశాలకు బుధవారం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ భోజనశాల నిర్మాణం పూర్తయితే ప్రతి రోజు లక్ష మంది విద్యార్థులకు ఇక్కడి నుండే వేడి వేడి భోజనం సరఫరా జరుగుతుందన్నారు.

పర్యాటక కేంద్రంగా భవానీద్వీపం

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 7: భవానీ ద్వీపాన్ని ప్రపంచస్థాయి పర్యాటకకేంద్రంగా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి జయరామిరెడ్డి అన్నారు. కృష్ణానది తీరాన ఉన్న పున్నమిఘాట్‌లో వాటర్‌స్పోర్ట్స్ బోట్లను ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈసందర్బంగా జయరామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు తగ్గట్టుగా రాజధానిని దృష్టిలో పెట్టుకుని భవానీద్వీపాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ నగరంలో పర్యాటకులకు అనువైన ప్రదేశాలు లేవని, సినిమా ఒక్కటే ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉందన్నారు.

ప్రచారమే తప్ప.. ప్రజా సమస్యలు పట్టవు

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ప్రతిపక్షం టీవీలు, పత్రికల్లో ప్రచారం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది తప్ప ప్రజల సమస్యల గురించి చర్చ జరిపేందుకు ఇష్టపడటం లేదని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దుయ్యబట్టారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ పెద్దనోట్ల రద్దుమూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లేవనెత్తిన అంశాలకు జైట్లీ సమాధానం ఇస్తూ ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు. ‘ప్రతిపక్షం రాజ్యసభలో ప్రతిరోజూ ఇదే విధంగా చేస్తోంది. పూర్తిస్థాయి చర్చ జరిపేందుకు ఎందుకు అంగీకరించటం లేదు?

తీరు మారని లోక్‌సభ

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: నాలుగు రోజులుగా లోక్‌సభలో కొనసాగుతున్న ప్రతిష్టంభన బుధవారం కూడా కొనసాగింది. పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు జితేందర్ రెడ్డి 193 కింద ఇచ్చిన నోటీసుపై చర్చ జరిపేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు నినాదాలతో దెబ్బతీశారు. స్పీకర్ అనుమతి మేరకు జితేందర్‌రెడ్డి మాట్లాడటం ప్రారంభించగానే ప్రతిపక్ష సభ్యులు ముఖ్యంగా తృణమూల్ సభ్యులు ఆయనను చుట్టుముట్టి పెద్దఎత్తున నినాదాలిచ్చారు. జితేందర్ రెడ్డి మైక్ వైపు వంగి భయంకరంగా అరిచారు.

వందకోట్ల నల్లధనాన్ని మార్చుకున్న గాలి!

బళ్లారి, డిసెంబర్ 7: గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న మైనింగ్ దిగ్గజం గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి కూడా అయిన గాలి రద్దయిన పాత పెద్ద నోట్లలో ఉన్న రూ.100 కోట్ల నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నట్టు అతని వద్ద డ్రైవర్‌గా పనిచేసిన రమేశ్ గౌడ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్టు సమాచారం.

మార్పుకే ఓటేయండి

హల్‌ద్వానీ, డిసెంబర్ 7: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పారదర్శకత పాలన సాగుతోందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉద్ఘాటించారు. బిజెపి ప్రారంభించిన పరివర్తన యాత్ర బుధవారం ఉత్తరాఖంఢ్‌లో ముగిసింది. దేశ ప్రజలు మార్పునకు ఓటేయాలని ఈ సందర్భంగా షా పిలుపునిచ్చారు. వ్యవస్థలో మార్పుకోసమే బిజెపి పరివర్తన యాత్రకు శ్రీకారం చుట్టిందని ఆయన స్పష్టం చేశారు. ‘పరివర్తన యాత్ర అంటే ముఖ్యమంత్రిని మార్చడానికి కాదు. పారదర్శకత, సుపరిపాలనకోసం సమర్థవంతంగా పనిచేయడానికి’ అని ఆయన పేర్కొన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని ఆయన చెప్పారు.

ఆజంఖాన్ క్షమాపణకు సుప్రీం తిరస్కృతి

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ‘గ్యాంగ్ రేప్ సంఘటన రాజకీయ కుట్ర’ అంటూ తాను చేసిన వ్యాఖ్యపై ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ చెప్పిన క్షమాపణను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. ఆజంఖాన్ చెప్పింది బేషరతు క్షమాపణ కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తన వివాదాస్పద వ్యాఖ్యలపై బులంద్‌షహర్ గ్యాంగ్ రేప్ బాధితులకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని నవంబర్ 17న ఆజంఖాన్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

Pages