S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపా టాటా స్టీల్‌తో నష్టమే

ముంబయి, డిసెంబర్ 6: టాటా-మిస్ర్తిల మాటల యుద్ధం ఆగడం లేదు. టాటా సన్స్ చైర్మన్‌గా మిస్ర్తి ఉద్వాసనకు గురైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను మిస్ర్తి మంగళవారం సమర్థించుకున్నారు. ముఖ్యంగా ఐరోపాలోని టాటా స్టీల్ మూసివేత నిర్ణయం సరైనదేనన్నారు. నష్టాల్లో నడుస్తున్న యూరోపియన్ టాటా స్టీల్ వల్ల మొత్తం టాటా గ్రూప్ ఉనికికే ప్రమాదం ఏర్పడేదని చెప్పారు. అలాంటి సంస్థను వదిలించుకోవడమే ఉత్తమమన్నారు.

జిసిసి కుంకుడు షాంపు

విశాఖపట్నం, డిసెంబర్ 6: అటవీ ఉత్పత్తుల్లో ముఖ్యమైనది, సహజ సిద్ధమైన, ఆరోగ్యప్రదమైన కుంకుళ్ళ నుంచి హెయిర్ షాంపును తయారు చేయాలని గిరిజన సహకార సంస్థ (జిసిసి) నిర్ణయించింది. నూతన సంవత్సర కానుకగా దీనిని దేశీయ మార్కెట్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడచిన రెండేళ్ళ కాలంలో అనేక రకాలైన ఆకర్షణీయమైన పథకాలు, ప్రయోగాలతో చక్కటి ఫలితాలు సాధించిన జిసిసి.. ఇప్పుడు మరో సరికొత్త ప్రాజెక్టును జాతీయ మార్కెట్‌లోకి తీసుకురావాలని నిశ్చయించింది. కుంకుడు కాయల నుంచి తీసే పిప్పి, నురగతో తలకు ఉపయోగించే ‘హెయిర్ షాంపు’ను తయారు చేయనుంది.

ఎయిర్‌సెల్ అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఎయిర్‌సెల్.. ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పరిమితస్థాయి ఉచిత డేటా వినియోగంతో నెట్‌పై 3 నెలల అపరిమిత కాల్స్‌ను ముందుకుతెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకూ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. 148 రూపాయలకే ఈ ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఎయిర్‌సెల్ టు ఎయిర్‌సెల్ ఉచిత లోకల్-ఎస్‌టిడి కాల్స్, ఎయిర్‌సెల్ టు ఇతర నెట్‌వర్క్‌లకు నెలకు 250 నిమిషాల ఉచిత లోకల్-ఎస్‌టిడి కాల్స్‌ను మూడు నెలలపాటు అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీ ఎన్‌సిఆర్ పరిధిలోని వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోండి

న్యూఢిల్లీ, డిసెంబరు 6: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థికంగా చిక్కుల్లోపడిన కోళ్ళ పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి తెలంగాణ పౌల్ట్రీ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎంపి జితేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పౌల్ట్రీ సంఘం నాయకులు రంజిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రమేష్, సినీ నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఆర్థిక మంత్రితో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు. కొంతకాలంగా కోళ్ళ దాణా ధర పెరిగి పరిశ్రమ ఆర్థికంగా నష్టాల్లో ఉందని, పౌల్ట్రీ రుణాలపై ఈ ఏడాది మారటోరియం ఇవ్వాలని కూడా జైట్లీకి ఈ సంఘం విజ్ఞప్తి చేసింది.

ఇక ‘మీ సేవ’లో స్వైపింగ్!

కర్నూలు, డిసెంబర్ 6: నగదు రహిత లావాదేవీలను ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో కూడా స్వైపింగ్ యంత్రాలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది. ప్రతి మీ సేవా కేంద్రం నిర్వాహకుడు తమ బ్యాంకుకు వెళ్లి స్వైపింగ్ యంత్రం తీసుకోవాలని సూచించింది. బ్యాంకుల నుంచి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులను కలిసి వివరించాలని ప్రభుత్వం ఆదేశాల్లో వెల్లడించింది.

నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించండి

కర్నూలు, డిసెంబర్ 6: ఇంత కాలం పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతా ల్లో నగదు రహిత సమాజం కారణంగా ప్రజలకు వచ్చే ప్రయోజనాలు వివరించడమే కాకుండా ప్రస్తుతం ఉన్న దుష్ప్రచారంపై కూడా అవగాహన కల్పించాలని సూచించింది. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతా తెరిచి దాని ద్వారా నగదు లావాదేవీలను నిర్వహించేలా అవసరమైన సలహాలు ఇవ్వాలని పేర్కొంది.

కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు!

కర్నూలు, డిసెంబర్ 6:పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన కరెన్సీ కష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ మొద టి వారం కావడంతో తెల్లవారుజాము నుంచే ప్రజలు ఏటిఎం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఏటిఎంలో పెట్టిన డబ్బులు గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుకు గురవుతున్నారు. బ్యాంకు ల్లో ఖాతాదారులకు రూ. 10వేలు మాత్రమే డ్రా చేసుకోవాలని మేనేజర్లు చెప్పడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. రూ. 10వేలలో ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కూరగాయలు, పాలు, ఇతరాత్ర ఖర్చులు ఎలా సర్దుకోవాలని ప్రజలు వాపోతున్నారు. అది కూడా బ్యాంకుల్లో రూ.

నంద్యాలలో ఓవర్‌బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

నంద్యాల, డిసెంబర్ 6:పట్టణంలోని బొమ్మలసత్రంలో నిర్మిస్తున్న ఓవర్‌బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఆర్‌అండ్‌బి అధికారులు ఇఇ రాజేంద్రయ్య, డిఇ ముక్తియార్‌పై ఆగ్రహం వ్యక్తం చేవారు. వంతెన కింది భాగాన రోడ్డు పనులను వేగంగా పూర్తి చేసి వాహనాల రాకపోకలకు అనుమతించాలన్నారు. వంతెన కింది భాగంలో, రోడ్డు మద్యలో సుందరంగా ఉండేలా మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ఉపరితల ఇరువైపులా ఉన్న దుకాణాల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాలని ఆదేశించారు.

కాల్షియం కార్బైడ్ వాడితే కఠిన చర్యలు

కర్నూలు సిటీ, డిసెంబర్ 6:కాయలను మాగపెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు, కడప జిల్లాల జోనల్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనాథ్‌రెడ్డి వ్యాపారులను హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సి.క్యాంప్ సెంటర్‌లో ఉన్న పండ్ల దుకాణాలపై ఆయన దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్లను మాగపెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడితే ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుందన్నారు. అంతేకాకుండా పండ్లు ఆకర్శణీయంగా కనపడటానికి ఇలాంటి రసాయనాలను వాడుతున్నారని, ప్రజలు వాటినే కొనుగోలు చేసి రోగాల బారిన పడుతున్నారని వెల్లడించారు.

రూ. 879 కోట్లతో చెరువులకు నీరు

పత్తికొండ,డిసెంబర్ 6:పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న 106 చెరువులకు నీళ్లు నింపడానికి రూ. 879 కోట్ల తో ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి స్పష్టం చేశారు. పత్తికొండలో మంగళవారం అధికారులు, పార్టీ కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులలో అందరు కలిసి పని చేయాలని కోరారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో అనేక మార్పులు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఈపాస్ పుస్తకాలు కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Pages