S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వార్నర్ సూపర్ సెంచరీ

కాన్‌బెరా, డిసెంబర్ 6: న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన రెండో వనే్డను ఆస్ట్రేలియా 116 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెల్చుకుంది. చివరిదైన మూడో వనే్డ ఫలితంతో సంబంధం లేకుండా ఆసీస్‌కు సిరీస్‌ను అందించిన ఘనత డేవిడ్ వార్నర్‌కు దక్కుతుంది. అతను సెంచరీతో కదంతొక్కి, ఆసీస్ విజయంలో కీలక భూమిక పోషించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 378 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ వార్నర్ 115 బంతుల్లో 119 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

భారత్‌తో వనే్డ సిరీస్‌కు మోర్గాన్ కెప్టెన్సీ

లండన్, డిసెంబర్ 6: ఇంగ్లాండ్ వనే్డ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నాడు. భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లేందుకు మోర్గాన్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనితో అతని స్థానంలో వికెట్‌కీపర్ జొస్ బట్లర్ నాయకత్వం వహించాడు. భారత్‌లో సిరీస్‌కు మోర్గాన్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) తిగిరి అతనికే పగ్గాలు అప్పగించింది. మోర్గాన్‌తోపాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హాలెస్ కూడా జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న జో రూట్‌కు మళ్లీ జట్టులో స్థానం లభించింది.

పెద్దనోట్ల రద్దు ప్రభావం ఐపిటిఎల్ టోర్నీకి

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పెద్దనోట్ల రద్దు ప్రభావం క్రీడా రంగంపైనా పడింది. దీని కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని, అందుకే ఈసారి ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)లో రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్ వంటి స్టార్లు పాల్గొనడం లేదని టోర్నీ వ్యవస్థాపకుడు మహేష్ భూపతి తెలిపాడు. దేశంలో ఆర్థిక పరిస్థితి టోర్నీకి అనుకూలంగా లేదని వ్యాఖ్యానించాడు. దీనితో ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగే హైదరాబాద్ లెగ్‌లో ఫెదరర్, సెరెనా హాజరుకావడం లేదని సింగపూర్ నుంచి పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు.

చపెకొయన్స్‌కే సుడామేరికనా కప్

అసన్సియన్, డిసెంబర్ 6: ఇటీవల కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మినహా మిగతా క్రీడారులందరినీ కోల్పోయిన చపెకొయన్స్ జట్టుకు సుడామేరికానా టైటిల్‌ను ప్రకటించారు. కొలంబియాకు చెందిన అట్లెటికో నేషనల్ జట్టుతో కోపా సుడామెరికానా ఫైనల్ ఆడేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో చపెకొయన్స్ ఫుట్‌బాల్ క్రీడాకారులు 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మొత్తం 71 మంది దుర్మరణం చెందారు. వీరిలో చపెకొయన్స్ క్రీడాకారులపాటు అదే క్లబ్‌కు చెందిన 17 మంది సిబ్బంది, ఏడుగురు డైరక్టర్లు కూడా ఉన్నారు.

అంకితభావం.. అమ్మ నైజం

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు మంగళవారం ఘనంగా నివాళి అర్పించారు. జయ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది. జయ మృతి జీర్ణించుకోలేని విషాదమని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. దేశ రాజకీయాల్లో జయ ఓ గొప్ప నాయకురాలని, పరిస్థితులను ఆమె ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చేలా పని చేశారని ప్రశంసించారు. జయ నాయకత్వ లక్షణాలు అసాధారణమైనవన్న సోనియా తమిళనాడు ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి అంకితభావంతో పని చేశారని, పేద ప్రజల జీవితాలను మెరుగుపరిచే పాలనను అందించారని అన్నారు.

డిసెంబర్ మాసం.. దురదృష్టకరం

చెన్నై, డిసెంబర్ 6: తమిళనాడు రాష్ట్రానికి డిసెంబర్ ఒక దురదృష్ట మాసంగా పరిణమించిందని జయలలితకు నివాళి అర్పించటానికి వచ్చినవాళ్లు చర్చించుకున్నారు. బహుళ ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎంజి రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న చనిపోయారు. అంతే ప్రజాదరణ పొందిన జయలలిత కూడా డిసెంబర్‌లోనే (సోమవారం) కన్నుమూశారు. ఇద్దరు నేతలూ చాలాకాలంపాటు అనారోగ్యంతో బాధపడ్డారు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు కూడా డిసెంబర్‌లోనే తమిళనాడును కబళించాయి. 2004 డిసెంబర్ 26న సునామీ తమిళనాడును ఛిన్నాభిన్నం చేసింది.

పలు రాష్ట్రాల నివాళి

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీలు ఘనంగా నివాళులర్పించగా, కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఒక రోజు సంతాప దినాలను ప్రకటించాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించడమే కాకుండా ఆమెకు గౌరవసూచకంగా పది నిమిషాలపాటు వాయిదాపడింది. అసెంబ్లీ స్పీకర్ సీతాశరణ్, రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ మల్లయ, తాత్కాలిక ప్రతిపక్ష నేత బాలబచ్చన్, బిజెపి లెజిస్లేచర్ పార్టీ నేత సత్యప్రకాశ్ సక్వార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జయలలిత గుణగణాలను ప్రశంసించారు.

‘అమ్మ’బ్రాండ్

చెన్నై, డిసెంబర్ 6: ‘అమ్మ’ బ్రాండ్‌తో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రకటించిన ఉచిత తాయిలాలు, పథకాలు ఆమెకే ప్రత్యేకమైనవిగా నిలవడమే కాకుండా, ప్రధాన ప్రత్యర్థి అయిన కరుణానిధి నేతృత్వంలోని డిఎంకెను చిత్తు చేయడానికి తోడ్పడ్డాయని చెప్పవచ్చు. అమ్మ క్యాంటీన్లు, అమ్మ జిమ్నాసియంలు, పార్కులు.. ఒకటేమిటి, ప్రతిదానికీ ‘అమ్మ’ పేరు ఉండడం సర్వసాధారణమైపోయింది. తమిళనాడులో ఉచిత తాయిలాలకు అద్యుడు కరుణానిధి కావచ్చు కానీ, జయలలిత తన రాజకీయ చతురతతో వాటికి కొత్త అర్థం తీసుకువచ్చారని చెప్పవచ్చు.

గుండె పగిలింది..

చెన్నై, డిసెంబర్ 6: తమ ప్రియతమ నేత జయలలిత మరణించిందన్న వార్త విని తమిళనాడులో మంగళవారం ముగ్గురు గుండెపోటుతో చనిపోయారు. కోయంబత్తూర్‌లో టెలివిజన్‌లో జయ ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వింటున్నవారు ఆమె మరణ వార్త విని కుప్పకూలిపోయారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. కునియమత్తూర్‌లో 50 అడుగుల ఎతె్తైన మొబైల్ టవర్ పైనుంచి లోకనాథన్ అనే వ్యక్తి కిందకు దూకేందుకు ప్రయత్నించగా, పోలీసులు అతడికి సర్దిచెప్పి కాపాడారు. అన్నూర్‌లో అన్నాడిఎంకె కార్యకర్త ఒకరు శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 60శాతం కాలిన గాయాలతో అతను చికిత్స పొందుతున్నాడు.

సెల్వంను ఓదారుస్తున్న ప్రధాని

చిత్రం..జయలలిత భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ఓదారుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

Pages