S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ను వీడని వర్షాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: హైదరాబాద్ నగరం భారీ వర్షాలు, వరదలతో వణికిపోతోంది. రోడ్లన్నీ వాగు లు, వంకలుగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. మూడురోజుల పాటు కురిసిన వర్షాల వల్ల సికిందరాబాద్‌లో సంతోష్ అనే వ్యక్తి ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. వందలాది అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వరదనీరు చేరడంతో అపార్ట్‌మెంట్ల ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. హుస్సేన్‌సాగర్‌లోకి శుక్రవారం కొంత ఇన్‌ఫ్లో తగ్గింది.

ఈ వర్షాలు శుభసూచకం

హైదరాబాద్/ సంగారెడ్డి, సెప్టెంబర్ 23:తన అనుభవంలో ఇంత భారీ వర్షాలు ఎన్నడూ చూడలేదని, ఈ వర్షాలు భవిషత్తుకు శుభసూచకంగా తాను భావిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే అయినా సంయమనంతో ఉండాలని ప్రజలకు సూచించారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లో నీరు సమృద్ధిగా చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల వద్దకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

ఏరూ ఊరూ ఏకం

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా శుక్రవారం మెదక్ జిల్లాలో ఐదుగురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు, నల్లగొండలో ఇద్దరు మరణించారు. వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలలో అనేక కాలనీలు నీటమునిగాయి. వరంగల్-కరీంనగర్ రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నగరానికి తాగునీరు అందిస్తున్న వడ్డేపల్లి, భద్రకాళి రిజర్వాయర్లు మత్తడి పోస్తున్నాయి.

10కోట్ల నష్టం

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వర్షాల వల్ల దెబ్బతిన్న జాతీయ, రాష్ట్ర రహదారులు, వంతెనలు, కాజ్‌వేలకు మరమ్మతులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు వర్షాలవల్ల రహదారులు దెబ్బతిని సుమారు పదికోట్ల రూపాయల వరకు నష్టం కలిగినట్టు చెప్పారు. ఇది ప్రాథమిక అంచనా అని, నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయి.

పులిచింతలకు వరద తాకిడి

అచ్చంపేట, సెప్టెంబర్ 23: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీటి తాకిడి అధికమైంది. గురువారం ప్రాజెక్టులో 29 టిఎంసిల నీటిని నిల్వ ఉంచిన ప్రాజెక్టు అధికారులు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా అధికారులతో ప్రాజెక్టు వద్ద జరిపిన సంప్రదింపుల అనంతరం శుక్రవారం 30 టిఎంసిల నీటిని నిల్వ ఉంచారు. ఎగువ నుంచి 1,05,476 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుండగా, 12 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత 30 టిఎంసిల నీటిని నిల్వ చేయడం ఇదే ప్రథమం కావడంతో కృష్ణ, నల్గొండ, గుంటూరు జిల్లాల నుంచి సందర్శకుల తాకిడి కూడా పెరిగింది.

కన్నీటి కడగండ్లు

విజయవాడ / గుంటూరు, సెప్టెంబర్ 23: నిన్నమొన్నటి వరకు సాగునీటి కోసం అల్లాడిన రాష్ట్రం నేడు ఎడతెగని భారీ వర్షాలతో కుదేలైంది. ఎక్కడ చూసినా నీరే దర్శనమిస్తోంది. కన్నీటిని మిగిల్చింది. వాగులూ, వంకలూ ఏకమై వరదనీరు గ్రామాలను ముంచె త్తుతోంది. లక్షలాది ఎకరాల్లోని పంట నీటిపాలైంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ప.గో జిల్లాల్లో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ప్రకాశం బ్యారేజీ నిన్న, మొన్నటివరకు వెలవెలబోగా నేడు లక్షా 35వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుండటంతో రైతాంగం ఉసూరుమంటోంది. రహదారులు దెబ్బతిని రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం జలదిగ్బంధంలో కొనసాగు తోంది.

ఖమ్మం జిల్లాలో పొంగిన వాగులు

ఖమ్మం, సెప్టెంబర్ 23: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలో టేకులపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. కినె్నరసాని ప్రాజెక్టు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తాలిపేరుకు వరద నీరు చేరుతుండడంతో దిగువనున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలు అంథకారంలోకి ఉండిపోయాయి.

ప్రకాశం బ్యారేజీకి వరద పోటు

విజయవాడ, సెప్టెంబర్ 23: వరదనీరు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తడంతో మొత్తం 70 గేట్లను 3 అడుగులమేర పైకి లేపి లక్షా 35వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఐదేళ్ల తర్వాత మొత్తం గేట్లను పైకెత్తడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. పులిచింతల నుంచి లక్షా 70వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతున్నది. కీసర నుంచి 13వేల క్యూసెక్కుల నీరు, అలాగే పట్టిసీమ మోటార్లు కట్టివేసినప్పటికీ ముందుగా వదిలిన నీటి వలన 3,500 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతోంది. కాల్వలన్నింటికి కలిపి 7వేల క్యూసెక్కుల నీటిని వదులుతూ మిగిలిన నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

అయితే.. నిజమేంటో చెప్పండి

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: విభజన ముందు గంటలో స్పీకర్ చాంబర్‌లో ఏమి జరిగిందో నిజాన్ని బయటపెట్టాలని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి హృదయం దహిస్తోందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. తను రాసిన విభజన కథ పుస్తకం కట్టు కథ అయితే అసలు నిజమేమిటో జైపాల్ రెడ్డి బయటపెట్టాలన్నారు. విభజన కథ పుస్తకంలో ఉండవల్లి కట్టు కథ రాశారని, అసలు విషయం బయటపెట్టాలంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి చెప్పడానికి వీల్లేదని జైపాల్‌రెడ్డి గాంధీభవన్‌లో విమర్శించడంపై స్పందించిన ఉండవల్లి శుక్రవారం రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో పలు ప్రశ్నలను సంధించారు.

పంటల ఉత్పత్తిలో ముందుండాలి

విజయవాడ, సెప్టెంబర్ 23: వ్యవసాయ రంగానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ అవసరమైన మేర నీరు, విద్యుత్, ఇతర ఉపకరణాలు అందిస్తున్నందున పంటల ఉత్పాదనలో భారతదేశంలోనే ఏపి ముందుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. శుక్రవారం తన నివాస గృహం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అదృష్టవశాత్తు భారీ వర్షాలతో జలాశయలన్నీ నిండాయి. ఇక ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని గట్టిగా చెప్పారు. ఆర్థిక వనరులు, మానవ వనరులు సమకూర్చాం, ఇక మీరు చేయాల్సిందల్లా నిర్వహణ మాత్రమే అన్నారు.

Pages