S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బండారి లే అవుట్ కాలనీలో మంత్రి జూపల్లి పర్యటన

జీడిమెట్ల: నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీలో రాష్ట్ర మంతి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్‌లు శుక్రవారం పర్యటించారు. కాలనీలో వరద నీటిలోనే పాదయాత్రలో బాధితులను పరామర్శించారు. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలనీకి ఆనుకున్న ఉన్న తుర్కచెరువును పరిశీలించారు. జూపల్లి మాట్లాడుతూ బాధితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, భయాందోళనకు గురికాకూడదని సూచించారు. కాలనీకి ఎలాంటి ప్రమాదం లేదని, వర్షం ఎక్కువగా ఉన్నందున ఇన్‌ఫ్లో ఉందని తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధితులకు అన్ని సదుపాయాలను సమకూరుస్తున్నామని అన్నారు.

వీడని వాన..నగర ప్రజల ఆందోళన

ఖైరతాబాద్, సెప్టెంబర్ 23: గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరాన్ని వీడటం లేదు. భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నాయి. దీంతో నగరవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు క్షణ క్షణం భయంతో జీవిస్తున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని మారుతీనగర్, ఇంద్రానగర్, ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్, టెస్ట్‌బుక్ ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయం వద్ద మోకాలి లోతు నీరు ప్రవహించింది.

ఉండాలా.. పోవాలా?

జీడిమెట్ల, సెప్టెంబర్ 23: నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీ బాధితులు ఉండాలా.. పోవాలా.. అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారికంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ప్రకటిస్తే లోపాయికారీగా కొందరు ఉండాలని చెబుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఫ్లాట్‌లకు తాళాలు వేసి వెళితే దొంగలు దోచుకుంటారనే రూమర్‌లు నెలకొన్నాయి. బండారి లే అవుట్ కాలనీలో సుమారు 250 అపార్ట్‌మెంట్‌లు ఉండగా వరద ఉద్ధృతికి దాదాపుగా 200 అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలోకి నీరు చేరింది. దీంతో మూడురోజులుగా బాధితులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

వదలని వర్షం..పెరిగిన వరదనీటి ఉద్ధృతి

ఉప్పల్, సెప్టెంబర్ 23: హైదరాబాద్ మహానగరం ప్రజల్ని జడివాన వెంటాడుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్భందమయ్యాయి. రహదారులు చెరువు, కుంటలుగా తలపించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఉధృతికి మూసీ మురికి నీటి పిల్ల కాలువలు ఏరులై పారుతూ పొంగి పొర్లుతున్నాయి. ఇరుకైన కల్వర్టుల వద్ద రహదారిపై నుంచి వరద నీళ్లు వెళ్తుండటంతో సమీపంలోని కాలనీలలోని ఇళ్లలోకి చేరుకుని జన జీవనం స్తంభించింది. వరద నీటితో ప్రవహిస్తున్న చిల్కానగర్, స్వరూప్‌నగర్ మురికి నీటి కల్లర్టుల రహదారిలో బయటకు వెళ్లలేక వాహనాదారులు భయపడి అక్కడే ఆగిపోయారు.

పొంగిపొర్లుతున్న నాలాలు, చెరువులు

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23: భారీ వర్షాలకు శేరిలింగంపల్లిలోని చెరువులు, కుంటలు, నాలాలు, కాలువలు పొంగిపొర్లుతుండటంతో రోడ్లు జలదిగ్బంధం అయ్యాయి. అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరి నివాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి, బిల్డర్ల అక్రమాలు ఇప్పడు ప్రజలపాలిట శాపంలా మారాయి. చాలాచోట్ల నాలాలను కబ్జాచేసి అపార్టుమెంట్లు, భవనాలు నిర్మించడంతో ఇరుకుగామారి వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తుండటం ఇబ్బందికరంగా తయారైంది.

ఢిల్లీకి చెందిన టిటిఐ ఇంజనీర్లతో సివరేజీ మెయిన్ పైప్‌లైన్లను తనిఖీ చేసిన ఎండి

హైదరాబాద్, సెప్టెంబర్ 23: గ్రేటర్ హైదరాబాద్‌లోని సివరేజీ పైప్‌లైన్లపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు అధ్యయన కమిటీని జలమండలి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ధ్వంసమైన 1800 ఎంఎం డాయ సివరేజీ మెయిన్ పైప్‌లైన్‌పై పూర్తి స్థాయి విచారణను వేగవంతం చేసింది. శుక్రవారం ఢిల్లీకి చెందిన టిటిఐ ఇంజనీర్ల బృందంతో కలిసి జలమండలి ఎండి ఎం.దానకిషోర్, ఇడి, ఇఎన్‌సి ఎం.సత్యనారాయణ.. సివరేజీ మెయిన్ పైప్‌లైన్ మరమ్మతుల పనులను తనిఖీ చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ మార్గ్‌లో బుధవారం భారీ గొయ్యిపడింది.

నాలాల ఆక్రమణలపై శాటిలైట్ సర్వే

హైదరాబాద్, సెప్టెంబర్ 23: భారీ వర్షాలు కురిసినపుడు నీరు సజావుగా ప్రవహించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న నాలాలపై ఆక్రమణల తొలగింపుకు త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాలాల ఆక్రమణల తొలగింపు అంశంపై టౌన్‌ప్లానింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గతంలో నగరాన్ని వరదలు ముంచెత్తినపుడు కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుని, ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ప్రత్యేక కార్యచరణను సిద్దం చేయాలన్నారు.

వ్యాధులు ప్రబలకుండా సంచార వైద్య వాహనాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తరుచూ కురుస్తోన్న వర్షాల కారణంగా వీధుల్లో, రోడ్లపై రోజుల తరబడి వరద నీరు నిల్చి ఉండటంతో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డా.సి. లక్ష్మారెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా మరిన్ని భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలకు అవసరమైనపుడు వైద్యం అందుబాటులో ఉండేందుకు వైద్యారోగ్యశాఖకు సెలవులను రద్ద చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని వానల కంట్రోర్ రూంను ఆయన శుక్రవారం సందర్శించారు.

మూసీ నాలా ప్రక్షాళణకు శ్రీకారం చుట్టాలి: దత్తాత్రేయ

కాచిగూడ, సెప్టెంబర్ 23: నగరంలో మూసీ నాలా ప్రక్షళణకు శ్రీకారం చుట్టాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజా జీవితం అస్తవ్యవస్తంగా తయారైందన్నారు. నారాయణగూడ మూసీనాలాను శుక్రవారం సందర్శించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు భయభ్రంతులకు గురవుతున్నారని తెలిపారు. కాలువలు ఉన్నచోట రిటైర్నింగ్ వాల్ నిర్మాణం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వలు కూడా రిటైర్నింగ్ వాల్ నిర్మించడంలో నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. 2002లోనే మాస్టర్ ప్లాన్ ప్రకారం రిటైర్నింగ్ వాల్ నిర్మాణం చేయాలని ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు.

వరద ముప్పు

లోతట్టు ప్రాంతాలు జలమయం, బిక్కుబిక్కుమంటున్న నగరం ఒకరి మృతి, మరొకరు గల్లంతు
రోడ్లు జలమయం సాగర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో రంగంలోకి ఎన్‌డిఆర్‌ఎస్ బృందాలు
ఎమ్మెల్యేలతో ప్రత్యేక కమిటీలు: సిఎం ఆదేశం అర్ధరాత్రి భారీ వర్షం
గోల్నాకలో కూలిన గోడ..గాంధీనగర్‌లో కూలిన నాలా ప్రహరీ రోడ్లు నిర్మానుష్యం
జంట జలాశయాల్లోకి భారీగా చేరుతున్న నీరు జలసౌధలో కంట్రోల్ రూం... 23390794
బండారి లే అవుట్‌లో నివాసితుల తరలింపు రాంగోపాల్‌పేట ఠాణా భవనం పదిలమేనా?
అల్వాల్‌లో అత్యధికంగా 25 సెం.మీల వర్షం ఒకే రోజు 48 శిథిల భవనాల కూల్చివేత

Pages