S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వానికి ప్రతిపక్షాల బాసట!

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ప్రకృతి కనె్నర్ర చేయడంతో ప్రజలను ఆదుకునేందుకు ప్రతిపక్షాలన్నీ నడుం బిగించాయి. సహాయక కార్యక్రమాల్లో ముందుండాలని పార్టీ అగ్ర నాయకులు తమ పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వర్షం, వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక కార్యక్రమాల్లో ముందుండాలని తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం వారు జిల్లా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

సహాయ చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వర్షం, వరదలతో తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజలు తల్లడిల్లుతుంటే సహాయక కార్యక్రమాలు సకాలంలో చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విపక్షాల నేతలు మండిపడ్డారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ నగరంలో వర్షంతో జలమయమైన వివిధ ప్రాంతాలను శుక్రవారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఆశించిన విధంగా సేవలు అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం అంత పటిష్టంగా లేదని, బాధితులను సకాలంలో ఆదుకునే పరిస్థితి లేదని అన్నారు.

ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిద్ధంగా ఉంది

హైదరాబాద్, సెప్టెంబర్ 23: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాల ప్రమాదం పొంచి ఉన్నందున సహాయ కార్యక్రమాల కోసం ఆర్మీని, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ను సిద్ధంగా ఉంచినట్టు మున్సిపల్ మంత్రి కె తారక రామారావు తెలిపారు. భారీ వర్షాలకు నీట మునిగిన పలు ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటించారు. వచ్చే రెండు నెలల్లో నగరంలోని రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో వర్షాల వల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.

వైద్యశాఖలో అలర్ట్ ప్రకటించిన మంత్రి

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున వైద్యశాఖ ఉద్యోగులు, డాక్టర్లు, సిబ్బంది సెలవులు తీసుకోవద్దని చెప్పారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సెలవులు వద్దని తెలిపారు. ఆదివారాలు కూడా వైద్య సేవకు అందుబాటులో ఉండాలని చెప్పారు. అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్న చోట ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

పంట నష్టాలను సేకరించి పంపండి

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ జిల్లాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, రబీ పంటలకు ఏర్పాట్లపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. వర్షాల వల్ల పంటలకు మంచి జరిగిందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. ఎక్కడైనా భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం జరిగి ఉంటే వివరాలు సేకరించి తనకు పంపించాలని ఆయన ఆదేశించారు. వివిధ పంటల పరిస్థితి గురించి అధికారులతో ఆయన ఆరా తీశారు. పంట కోతకు రాగానే రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇలా ఉండగా రబీకి కూడా ఏర్పాట్లు చేయాలని కోరారు.

నేను నిప్పును!

విశాఖపట్నం (పరవాడ), సెప్టెంబర్ 23: నేను నిప్పు, నాపై కేసులు పెట్టే దమ్ము ఎవరికి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విశాఖ జిల్లా పరవాడలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద 50.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 1,839 గృహాల సముదాయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై నిప్పులు చెరిగారు. ‘నా జీవితంలో ఎప్పుడూ లాలూచీ పడలేదు. క్రమశిక్షణకు నేను మారుపేరు. నాపై ఒక్క కేసు కూడా లేదు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఒకేసారి 25 కేసులు పెట్టినప్పటికీ ఒక్కటీ నిరూపణ కాలేదు.. నేనా కేసులకు భయపడేది...

టిడిపిలో చేరిన ఎమ్మెల్సీ సుధాకరబాబు

విజయవాడ, సెప్టెంబర్ 23: మాజీ కేంద్ర మంతి కోట్ల సూర్యప్రకాశరెడ్డికి అత్యంత సన్నిహితుడైన కర్నూలు జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు, కాంగ్రెస్ నేత ఎం.సుధాకర్‌బాబు శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాస గృహంలో తెలుగుదేశంలో చేరారు. మాజీ కార్పొరేటర్లు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులతో సహా మొత్తం 500 మందితో కలిసివచ్చి పచ్చ కండువాలు బాబుచే కప్పించుకున్నారు. మరో రెండు మాసాల్లో వీరి పదవీకాలం ముగియనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో శాసనమండలికి ఎన్నికయ్యారు.

కర్నూలులో గుండె శస్తచ్రికిత్స

కర్నూలు, సెప్టెంబర్ 23: రాయలసీమవాసులకు సంజీవనిగా పేరుగాంచిన కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో మొట్టమొదటి గుండె శస్తచ్రికిత్స విజయవంతమైంది. 60 ఏళ్ళ ఆసుపత్రి చరిత్రలో మొదటిసారి గుండె శస్తచ్రికిత్స విజయవంతం కావడంతో వైద్యులు విజయగర్వంతో సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని పాతబస్తీకి చెందిన షాదిజాబీకి చేసిన గుండె శస్తచ్రికిత్స విజయవంతమైంది. ఆసుపత్రి సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో కార్డియాలజి, కార్డియోథోరసిక్ సర్జన్ యూనిట్లు ఉన్నప్పటికీ సౌకర్యాలు లేక మూలనపడింది.

నా భూమిని లాక్కున్నారు!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: తెలంగాణ ప్రభుత్వం తన భూమిని ఆక్రమించుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఫిర్యాదు చేశారు. శుక్రవారం అమె హోంశాఖ మంత్రిని కలిసి, ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదన్నారు. ఈ భూమికి సంబంధించి తనకు అనుకూలంగా హైకోర్టు రెండు ఉత్తర్వులు ఇచ్చిందని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అత్యవసర బృందాల ఏర్పాటు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్ధను అత్యవసర ప్రాతిపదికపై పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో ప్రత్యేక పవర్ బ్రేక్ డౌన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ ఘాతాలకు తావులేకుండా పూర్తి స్ధాయి విద్యుత్ ఘాత నిరోధక వ్యవస్ధను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. డిస్కాంలు వినియోగదారుల కేర్ కాల్ సెంటర్లను 24 గంటల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు.

Pages