S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంట జలాశయాల్లో పెరిగిన నీటి మట్టం

నార్సింగి, సెప్టెంబర్ 23: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరానికి అందించే జంట జలాశయాలల్లో భారీగానే వరద నీరు వచ్చి చేరింది. మునుపెన్నడు రాని విధంగా ఒక్కరోజు కురుసిన వర్షానికే జంట జలాశయాలల్లో భారీగా వరద నీరు వచ్చింది. కొన్ని నెలలుగా పూర్తిగా ఎండిపోయిన జంట జలాశయాలల్లో కొత్తగా నీరు రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. మరో రెండు, మూడు రోజులు పాటు ఇదేవిధంగా భారీ వర్షాలు కురిస్తే జంట జలాశయాలు నిండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జలమండలి అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావారణం శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నా విషయం తెలిసిందే.

రంగారెడ్డి జిల్లాలో 10సెం.మీ వర్షపాతం నమోదు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రంగారెడ్డి జిల్లాలోని 37 మండలాల్లోని 13 మండలాల్లో పది సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అదే విధంగా శుక్రవారం కురిసిన వర్షంతో 7 నుండి 11 సె.మీ వరకు వర్షపాతం చేరుకుంది. మల్కాజిగిరిలో అత్యధికంగా 11.4సెం.మీలు, అత్యల్పంగా గండ్వీడ్ మండలంలో 1.8 సెం.మీల వర్షపాతం నమోదైంది.

సాగర్ ఔట్‌ఫ్లోను పరిశీలించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 23 నగరానికి మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తాయన్న హెచ్చరికలుండటంతో మంత్రి కెటిఆర్ ఉదయం నుంచి జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని అధికారులతో, కంట్రోల్ రూం ద్వారా పరిస్థితులను పర్యవేక్షించారు. అనంతరం టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆ తర్వాత సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో హుస్సేన్‌సాగర్ అలుగుల ద్వారా హోటల్ వైస్రాయ్ వద్ధ విడుదల చేస్తున్న ఔట్‌ఫ్లోను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం

హైదరాబాద్, సెప్టెంబర్ 23: నగరానికి మరో రెండురోజుల పాటు భారీ వర్ష సూచనలుండటంతో ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రెస్క్యు బృందాలు, పోలీసు, అగ్నిమాపక బృందాలు క్షేత్ర స్థాయిలో సిద్దంగా ఉన్నాయని, అవసరమైతే సైన్యాన్ని దింపేందుకు కూడా కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

అల్వాల్, సెప్టెంబర్ 23: అల్వాల్‌లో డ్రైనేజీ, వరద నీటి కాలువల సమస్య శాశ్వతంగా పరిష్కరించటానికి ప్రజలు సహకరించాలని రాష్ట్ర మంత్రులు కెటి రామారావు, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం టెంపుల్ అల్వాల్ ప్రాంతంలో వరద నీటి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బొల్లారం, మల్కాజిగిరి ప్రాంతంలో భారీ వర్షం నమోదు కావటంతో అల్వాల్‌లో ఉన్న మూడు చెరువులు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయని, దాంతో వరద ఉద్ధృతంగా వస్తోందని ఆయన చెప్పారు.

పోలీసులపై తిరగబడ్డ ప్రజలు

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని జరుగుతున్న ఆందోళనలు తార స్థాయికి చేరుకున్నాయి. గద్వాల జె ఎసి, అఖిలపక్షం ఆద్వర్యంలో మూడు రోజుల సకల జనుల బంద్‌కు పిలుపునిచ్చారు. అందులో బాగంగా శుక్రవారం సకల జనుల బంద్ సందర్భంగా జనమంతా రోడ్లపైకి వచ్చి గద్వాల పట్టణంలో కవాతు నిర్వహించారు. సకల జనుల బంద్ సందర్భంగా గద్వాల ఆర్టిసీ డిపో మూతపడింది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. గద్వాలలో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. వ్యాపారస్థులు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నారు.

మణుగూరు-కాజిపేట ప్యాసింజర్ నేడు రద్దు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: భారీ వర్షాల కారణంగా గుంటూరు డివిజన్‌లోని సత్తెనపల్లి-పిడుగురాళ్ళ సెక్షన్‌లో రైలు పట్టాలు దెబ్బ తిన్న కారణంగా ఒక రైలును రద్దు చేయగా, మరో రైలును మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మణుగూరు-కాజిపేట ప్యాసింజర్‌ను 24వ తేదీన రద్దు చేసింది. హైదరాబాద్-కోచువెల్లి ప్రత్యేక రైలును శనివారం (24న) దారి మళ్లించి సులెహల్లి, గుంతకల్లు, రేణిగుంట, తిరుపతి మీదుగా మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

డిజిటల్ విద్యా పోర్టల్ ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబర్ 23: హైదరాబాద్‌లో ప్రసిద్ధ విద్యాసంస్థ కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిజిటల్ విద్యా పోర్టల్‌ను ప్రారంభించింది. బిగ్ డాటా, హడూప్, ఆర్, సేల్స్‌ఫోర్సు, అడోబ్ తదితర సంస్థల సమన్వయంతో డిజిటల్ ఎడ్యుకేషన్ పోర్టల్ నిర్వహించనుంది. ఉద్యోగ నైపుణ్యాలు , ఉత్పత్తికి సంబంధించి విద్యార్ధులకు- పరిశ్రమల అవుసరాలకు మధ్య ఉన్న అగాధం పూడ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సంస్థ డైరెక్టర్ నీల్ గోగ్టే చెప్పారు. పనికోసం తిరిగే వారికే కాదు, పనిచేస్తున్న వారికి సైతం నైపుణ్యాలను పెంపొందించుకునే శిక్షణ అందిస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు.

వేములఘాట్‌లో 144 సెక్షన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వేములఘాట్ గ్రామంలో 114 సెక్షన్ కింద ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం వాదనలు ముగిసాయి. కాగా న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తీర్పును రిజర్వు చేసినట్టు ప్రకటించారు. మెదక్ జిల్లా మల్లనసాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో వేములఘాట్ గ్రామంలో జూలై 28 నుంచి నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయి. గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిషేదాజ్ఞలను కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ గ్రామస్తులు వై సంతోష్‌రెడ్డితో పాటు ఐదుగురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.

భగీరథకు మొత్తం 6750కోట్ల రుణం

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలో ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంగా ఏర్పడి మిషన్ భగీరథకు మొత్తం 6750 కోట్ల రూణాన్ని అందజేయనున్నాయి. శుక్రవారం సైఫాబాద్ లోని ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కన్సార్టియం సమావేశం జరిగింది. ఆంధ్రాబ్యాంకు 1300 కోట్లు, దేనా బ్యాంకు 500 కోట్లు, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 700 కోట్లు, సిండికేట్ బ్యాంకు వెయ్యి కోట్లు, ఓబిసి బ్యాంక్ 1000కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1000 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 750 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ 500 కోట్లు మొత్తం ఎనిమిది బ్యాంకు కన్సార్టియం 6750 కోట్ల రూపాయలను ఈనెల 29న అందజేయనుంది.

Pages