S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొడ్డిదారి అడ్మిషన్లు!

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణలో దొడ్డిదారిన మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి అన్ని మెడికల్ కాలేజీల్లో సీట్లను మెరిట్ ప్రాతిపదికగానే నింపాల్సి ఉంది. మెరిట్ ప్రాతిపదికపైనే సీట్ల భర్తీ జరుగుతోందా? లేదా? అన్నది ఆయా రాష్ట్రాల వైద్యవిద్యా విభాగం పర్యవేక్షించాల్సి ఉంటుంది.

వృద్ధిరేటు సరాసరి 12% సమ్మతం కాదు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సంవత్సరానికి కోటిన్నర టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్ధలు, పరిశ్రమలపై నియంత్రణాధికారాలను రాష్ట్రాలకే అప్పగించేందుకు కేంద్రం అంగీకరించినట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ రెండవ సమావేశానికి ఆర్థిక మంత్రి రాజేందర్ హాజరయ్యారు. అనంతరం కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేఖరులకు వివరించారు. పన్నులకు సంబంధించిన ‘బేస్ ఇయర్’గా 2015-16 సంవత్సరాన్ని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.

ఏటా 10వేల మంది దళితులకు నైపుణ్య శిక్షణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దళితులకు ఉపాది అవకాశాలు పెంపోదించేందుకు ఏటా పది వేల మంది చొప్పున వచ్చే మూడేళ్లలో 30వేల మందికి శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగు పెట్టనున్నట్టు ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. అందులోభాగంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్‌ఆర్‌ఐ), ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ల అధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా లెదర్ పరిశ్రమలో దళితులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు ఎస్సీ కార్పొరేషన్ 30 కోట్ల రూపాయలు కేటాయించనుంది.

టి.సర్కారు అడిగితే కేంద్రం నిధులిస్తుంది

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అల్పపీడనంతో తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి (సిడిఆర్‌ఎఫ్) నుంచి తాత్కాలిక సహాయం అందజేస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంపించే నివేదిక ఆధారంగా కేంద్రం సహాయం అందజేస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయంలో తానూ చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇతోధిక సహాయం అందించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కె.

జైళ్ల సంస్కరణలపై 29,30న సదస్సు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఈ నెల 29,30 తేదీల్లో జైళ్లలో సంస్కరణలపై ఢిల్లీలో బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రరాష్ట్రానికి చెందిన జైళ్ల శాఖాధికారులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జైళ్లలో అమలు చేస్తున్న సంస్కరణలను కేంద్రానికి తెలియచేసేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నివేదిక రూపొందించింది. మెదక్ జిల్లా సంగారెడ్డిలో పురాతన జైలును మ్యూజియంగా మార్చడంపై దేశవ్యాప్తంగా తెలంగాణ జైళ్ల శాఖ ప్రశంసలు అందుకుంది. ఈ మ్యూజియంపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర జైళ్ల శాఖ ఐదు పెట్రోలు బంకులను నిర్వహిస్తోంది.

పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: తెలంగాణలో ప్రకృతిసిద్ధమైన సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ది చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఇంక్రెడిబుల్ ఇండియా టూరిజం ఇనె్వస్టర్స్ సమ్మిట్‌లో తెలంగాణ తరపున చందూలాల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంపై ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రజెంటేషన్ ఇచ్చారు.

విమానంలో పేలిన శామ్‌సంగ్ నోట్ ఫోన్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సిగంపూర్‌నుంచి చెన్నై వస్తున్న విమానంలో శుక్రవారం శామ్‌సన్ గెలాక్సీ నోట్-2 పేలిపోయింది. ఈ రోజు ఉదయం 7.45 గంటల సమయంలో చెన్నై విమానాశ్రయంలో విమానం లాండయ్యే సమయంలో ఈ ఫోన్ పేలినట్లు తెలుస్తోంది. ఫలితంగా విమానంలో స్వల్పంగా మంటలు చెలరేగగా, సిబ్బంది మంటలార్పే యంత్రాలతో ఆ మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగింది ఏ విమానయాన సంస్థకు చెందిన విమానంలోనో వెంటనే తెలియరాలేదు.

తెలంగాణ గ్రూప్-2కు 26వరకు గడువు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ గ్రూప్-2 కేటగిరి పోస్టులకు దరఖాస్తు చేసే గడువును ఈ నెల 26వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దరఖాస్తు గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించినట్టు తెలిసింది. తొలి దశ నోటిఫికేషన్‌లో దాదాపు ఐదు లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా, మలి దశ నోటిఫికేషన్‌లో ఇంత వరకూ 1.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని ఇంత వరకూ ఫీజు చెల్లించని వారు సైతం ఈనెల 26లోగా ఫీజు చెల్లించాలని సూచించారు.

పిఎస్‌ఎల్‌వి-సి 35 ప్రయోగానికి నేటినుంచి కౌంట్‌డౌన్

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 23: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల 26న జరిపే పిఎస్‌ఎల్‌వి-సి 35 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 9:12గంటలకు ప్రారంభం కానుంది. ప్రయోగం పై శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్. సురేష్ అధ్యక్షతన జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో శాస్తవ్రేత్తలు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు.

ప్చ్..వెనుకబడిపోయాం!

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమాభారతి సమక్షంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ తదనంతర ప్రచార పరిణామంలో తాము పూర్తిగా వెనుకబడిపోయామని ఏపి మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో బాబు-కేసీఆర్ సమావేశంలో ఆంధ్ర వాదనలను తప్పని నిరూపించడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమయిందన్న ప్రచారం జరిగిందే తప్ప, తాము సమర్థవంతంగా వినిపించిన వాదనలకు తగిన ప్రచారం లభించకపోవడంపై సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ విషయంలో ఢిల్లీలో తాము మీడియాను ఆకట్టుకోలేకపోయామన్న విషయం స్పష్టమవుతుందని అంగీకరిస్తున్నారు.

Pages