S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-పాక్ స్నేహవారధి సింధూ జల ఒప్పందం

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 23: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇప్పటివరకు రెండు యుద్ధాలు జరిగాయి. రెండు దేశాలు దాయాదుల్లాగా నిత్యం ఏదో ఒక విషయంపై గొడవ పడుతూనే వస్తున్నాయి. రెండు దేశాల మధ్య 50 ఏళ్లుగా కాశ్మీర్ వివాదం రావణ కాష్ఠంలాగా కాలుతూనే ఉంది. అయితే ఒక్క విషయంలో మాత్రం రెండు దేశాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి పొరపొచ్చాలు తలెత్తలేదు. అదే సింధూ జలాల ఒప్పందం. 56 ఏళ్ల క్రితం కుదిరిన ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య స్నేహవారధిగా కొనసాగుతోంది. నిజానికి సింధూ జల ఒప్పందం పాకిస్తాన్‌కు జీవనాడి. ఈ ఒప్పందం ప్రకారం, సింధూనది, దాని అయిదు ఉపనదుల నీటిని రెండు దేశాలు పంచుకుంటున్నాయి.

టీచర్లకూ పరీక్షలు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ప్రమాణాలు పెంచేందుకు గత ఏడాది నుండి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండగా, రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల ప్రావీణ్యాన్ని పెంచేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారి పనితీరును సమీక్షించాలని కూడా చూస్తోం ది. ఇందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రానున్న రోజుల్లో దేశంలో నూతన విద్యావిధానం అమలుకానున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులతో పాటు పాఠశాలలను సంస్కరించే పనిలో పడింది. రానున్న రోజుల్లో విద్యా ప్రణాళిక-పరిపాలనపై ప్రభుత్వం దృష్టిసారించింది.

నాలుగు వారాల్లో తేల్చండి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23:ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ మీద నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి)ద్వారా ఆయన సవాలు చేశారు. హైకోర్టు మధ్యంతర ఆదేశాలలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు దీని కారణంగానే ఎస్‌పిఎల్‌ను తిరస్కరిస్తున్నామని తెలిపింది.

రాజ్‌నాథ్‌తో పారికర్ భేటీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కాశ్మీర్‌లో తాజా పరిస్థితులపైనా, వచ్చే నెలలో జరగబోయే బ్రిక్స్ సమావేశాల భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. అరగంటపాటు జరిగిన ఈ ఇద్దరు సీనియర్ మంత్రుల సమావేశంలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ లోయలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, చొరబాట్లను తీసుకుంటున్న చర్యలతో పాటు ముంబయి తీరంలో అనుమానితుల సంచారం కూడా ఈ చర్చలో చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే వచ్చే నెలలో గోవాలో జరిగే బ్రిక్స్ సమావేశాల భద్రతా ఏర్పాట్లపై కూడా వీరు చర్చించారు.

వెంటనే వెళ్లిపోండి!

ముంబయి, సెప్టెంబర్ 23: జమ్మూకాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన ఫావద్ ఖాన్ వంటి కళాకారులు తక్షణమే భారత్‌ను వదలిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) శుక్రవారం డిమాండ్ చేసింది. లేకుంటే వారి షూటింగ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించింది. మహిరా ఖాన్, ‘ఆయే దిల్ హై ముష్కి’ స్టార్ ఫావద్ ఖాన్ వంటి పాకిస్తాన్‌కు చెందిన కళాకారులు భారతీయ కళాకారుల అవకాశాలను కొల్లగొడుతున్నారని ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాకరే భార్య శాలిని థాకరే శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆరోపించారు.

అనాథ పిల్లలకు ఒబిసి రిజర్వేషన్!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సిబిసి) చేసిన తీర్మానం ప్రకారం పదేళ్ల లోపు అమ్మానాన్నలిద్దరిని కోల్పోయి, సంరక్షకులు ఎవరూ లేక అనాథలుగా మిగిలిన జనరల్ కేటగిరికి చెందిన పిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాలలో ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) కోటాలో రిజర్వేషన్లు పొందుతారు. ఎన్‌సిబిసి గత వారం ఈ తీర్మానాన్ని ఆమోదించిందని కమిషన్ సభ్యుడు అశోక్ సాయిని ఒక వార్తాసంస్థకు చెప్పారు.

రెండో పెళ్లి చేసుకున్నాడని భర్తపై యాసిడ్ పోసేసింది!

జమ్ము, సెప్టెంబర్ 23: కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త రెండోపెళ్లి చేసుకున్నాడన్న ఆగ్రహంతో ఓ మహిళ అతనిపై యాసిడ్ కుమ్మరించింది. ఈ ఘటనలో ఆమెకూ తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కతువా జిల్లాలోని బని పట్టణంలో మహమ్మద్ దిన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం షమీమా అఖ్తర్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. మహమ్మద్ దిన్ ఇప్పుడు రెండో వివాహం చేసుకోవడంతో కుమార్తెతో కలిసి షమీమ్ యాసిడ్‌పోసింది. మరో ఇద్దరి సహాయం కూడా తీసుకుంది.

జయకు అస్వస్థత

చెన్నై, సెప్టెంబర్ 23: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జ్వరంతో బాధపడుతుండటంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జ్వరం తగ్గుముఖం పట్టిందని, సాధారణ ఆహారం తీసుకుంటున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి ప్రతినిధి సుబ్బయ్య విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, జయ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ్‌సామి ట్వీట్ చేశారు. ఇదిలావుండగా, జయలలితకు ఆరోగ్యం చేకూరాలని ఎఐడిఎంకె నాయకులు, కార్యకర్తలు, భాగస్వామ్య పక్షాల కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా ప్రత్యేక పూజలు జరిపారు.

బాబుపై చెరుగుతున్న ముద్ర!

హైదరాబాద్: బాబు వస్తే వర్షాలు రావు. రిజర్వాయర్లు నిండవు. కరవు విలయ తాండవం చేస్తుంది! ఇదీ గత కొనే్నళ్ల నుంచి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉన్న సెంటిమెంటుకు సంబంధించిన ముద్ర!! గత రెండేళ్ల నుంచి ఏపిలో సరైన వర్షాలు కురవకపోవడం, అంతకుముందు తొమ్మిదేళ్లు సీఎంగా చేసినప్పటి కరవును దృష్టిలో పెట్టుకుని విపక్షాలు చేసిన విమర్శలు, కొందరు స్వాములు చేసిన వ్యాఖ్యలు ఒక సెంటిమెంటుగా మారాయి. తాజాగా కురుస్తున్న భారీ వర్షా లు ఏపి భారీ రిజర్వాయర్లు, చెరువులను నింపేయడం జలకళ ఉట్టిపడుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 140 టీఎంసీల నీరు ఎక్కువగా ప్రాజెక్టుల్లో చేరింది.

తెలుగు వర్శిటీ, అకాడమీ విభజనపై ఏపి దృష్టి

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆస్తుల పంపకానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో షెడ్యూలు 10 బిలోని విద్యాసంస్థలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారించింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి, ఉన్నత విద్యా మండలి, సంస్కృత విశ్వవిద్యాలయం, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం, వైద్య విశ్వవిద్యాలయం, న్యాయ విశ్వవిద్యాలయం, ఆర్‌జియుకెటి వంటి రాష్టస్థ్రాయి, జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, జాతీయ సంస్థలు ఈ షెడ్యూలులో ఉన్నాయి.

Pages