S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంచికొట్టొచ్చు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. గురువారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తరకోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్ మధ్యభాగంలో ప్రభావం చూపగా, ప్రస్తుతం ఇది తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్, విదర్భ మధ్య కొనసాగుతోంది. ఇలాఉండగా నైరుతీ రుతుపవనాలు తెలంగాణ జిల్లాల్లో ఉద్ధృతంగానూ, ఆంధ్రలో చరుగ్గానూ ఉన్నాయి. అల్పపీడనంతో పాటు నైరుతీ రుతుపవనాల ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని ఐఎండి స్పష్టం చేసింది.

జలకల్లోలం!

అడ్డూఆపూ లేని వర్షాలతో తెలంగాణ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. శుక్రవారం వర్షాల కారణంగా మెదక్ జిల్లాలో ఐదుగురు, వరంగల్ జిల్లా ఇద్దరు, నల్గొండ జిల్లాలో ఇద్దరు, సికింద్రాబాద్‌లో ఒకరు మరణించారు. హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లో అత్యధికంగా 25సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. జంట నగరాల్లో 48 పురాతన భవనాలను కూల్చివేశారు. హుస్సేన్‌సాగర్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముంపు బాధితుల కోసం ప్రభుత్వం 98 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. వరద ప్రవాహం కారణంగా వరంగల్-కరీనగర్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి.

అనుక్షణం.. అప్రమత్తం

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అసాధారణ వర్షాలతో సంభవించిన నష్టాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సిఎస్ రాజీవ్ శర్మను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భారీ నష్టాలపై కేంద్ర సాయం కోరనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ పర్యటన నుంచే సిఎం వర్షాలు, వరదల పరిస్థితిని సమీక్షించారు. సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్, అసాధారణ వర్షాలపై మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. నేడు, రేపు భారీ వర్షాలను ప్రకటించిన నేపథ్యంలో మంత్రులంతా అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితివుంటే తప్ప ప్రజలు రోడ్లపైకి రావొద్దని సిఎం కెసిఆర్ సూచించారు.

కడగండ్ల వరద

ఆంధ్రావని జల దిగ్బంధంలో చిక్కుకుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రెండు రోజుల పాటు కురిసిన కుంభవృష్టి ప్రభావం రాష్ట్రాన్ని వరద పాలు చేసింది. పల్నాడు ప్రాంతంలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. వరద నీటికి గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంట నీటి పాలైంది. ప్రకాశం బారేజీ నిండిపోవడంతో శుక్రవారం లక్షా 35వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. రహదారులు దెబ్బతినడంతో రవాణా కుదేలైంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజుపాలెం సహా ఏడు మండలాల్లో వీటిని ఏర్పాటు చేశారు.

ఆక్వాకు అభయం

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: తీర ప్రాంత రాష్ట్రాల్లో మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విశాఖలో మూడు రోజులపాటు జరగనున్న ఇండియా, ఇంటర్నేషనల్ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో పనిచేసే ఈ అథారిటీలో సముద్ర ఆహార ఉత్పత్తుల యజమానులు, భాగస్వాములు సభ్యులుగా ఉంటారన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సముద్ర ఆహార

పాక్‌తో సిరీస్‌ల ప్రసక్తే లేదు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్‌లో ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌తో ఇప్పట్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) చైర్మన్ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. శనివారం అతను పిటిఐతో మాట్లాడుతూ ఉగ్రవాదానికి పాక్ మద్దతునిస్తున్నదని, ఫలితంగానే ఉరీలోని భారత సైనిక స్థావరంపై దాడి జరిగిందని అన్నాడు. 18 మంది భారత జవాన్లు మృతి చెందడాన్ని దురదృష్ట సంఘటనగా అభివర్ణించాడు. ఈ పరిస్థితుల్లో పాక్‌తో క్రికెట్ సిరీస్‌ల గురించిన ఆలోచనే లేదని తేల్చిచెప్పాడు.

రూ.20 లక్షల టర్నోవర్ వరకూ జిఎస్‌టి మినహాయింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి కొత్త పరోక్ష పన్నుల విధానాన్ని అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న కేంద్రం శుక్రవారం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులుగా ఇక్కడ సమావేశమవుతున్న జిఎస్‌టి కౌన్సిల్ శుక్రవారం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)నుంచి మినహాయింపునకు ఎంత ఆదాయ పరిమితి నిర్ణయించాలనే దానిపై చర్చించింది. ఆదాయ పరిమితిని రూ.20 లక్షలుగా నిర్ణయించినట్లు సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ. 10 లక్షలుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా అన్ని సుంకాలను జిఎస్‌టిలో విలీనం చేయాలని కూడా కమిటీ

mataata

కాశీ ఖండం..20

మరికొన్ని ఎండలతో, ఇంకా కొన్ని భరింపనలవికాని చలిగాలులతో చేతనం కోల్పోయి వున్నాయి. జగాలకి అకాండ ప్రళయం ఆవిర్భవించింది. ఈ కాశీక్షేత్రం కల్పాంతకాలంలో అయినా కసుగందక వుంటుంది కనుక ఆ ఉత్పాతం ఇక్కడ కనపడదు. మేము అందరం ఈ మహోపద్రవాన్ని ఉపశమనం కోరి అబ్రహ్మణ్యం చేస్తూ పద్మ సంభవుడిని శరణుచొచ్చాం. ఆ బ్రహ్మదేవుడు మాపై కరుణించి, ఈ ఉత్పాతాన్ని తొలగింపగల సమర్థుడు మైత్రావరుణుడు ఒక్కడే. ఆ మహర్షి కాశీ క్షేత్రంలో వున్నాడు. ఆ మహర్షిని ప్రార్థించండి’’ అని నీ వున్న తావు చెప్పి పంపగా మేము ఇక్కడికి చనుదెంచాము.

శ్రీపాద కృష్ణమూర్తి

తాపత్రయములు

తాపమనగా దుఃఖము. లౌకిక జీవనములో మానవుడు మూడు రకములైన దుఃఖములలో మునిగితేలుచుండును. అవి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములు. ఈ తాపత్రయములనుండి బయటపడుటకు నిరంతరము ఏదో ఒక రక్షణ మార్గాన్ని అనే్వషిస్తూనే యున్నాడు. తాపత్రయాలతో ప్రధానమైనది ఆధ్యాత్మిక దుఃఖము. దీనికి బాధ్యత వహించునది మనసు.
మానవునికి శ్రేయస్సును చేకూర్చినా, పతనానికి దగ్గర చేసినా దీని చేతులలోనే యున్నది. మనసును ఉత్తేజపరచి ధర్మమునకు దగ్గర చేయునది ఒక్క సనాతనము మాత్రమే! సనాతనమనగా నిత్యనూతనమని అర్థము. యుగయుగాలకు అనుసరణీయమైనది. అందుకే ఇది నిత్యసత్యమై వెలుగొందుచున్నది. దీనికి మూలములు మన వేదా వేదాంగములు.

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు

Pages