S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైన్ స్నాచర్ అరెస్టు: సొత్తు స్వాధీనం

ఉప్పల్, ఆగస్టు 30: ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. చాలీచాలని జీతంతో అప్పుచేసి ఇల్లు కొనుగోలు చేశాడు. అప్పు తీర్చడానికి పార్ట్‌టైం దొంగగా మారాడు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకుతిరుగుతున్న ప్రైవేటు ఉద్యోగిని సిసి కెమెరాల పుటేజ్ ఆధారంగా ఉప్పల్ పోలీసులు పట్టుకుని అతని వద్ద రూ.2.5లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గాంధీనగర్ నాలాలో అర్థరాత్రి కెమికల్ వ్యర్థాల ప్రవాహం

జీడిమెట్ల, ఆగస్టు 30: కెమికల్ పరిశ్రమలు నాలాల్లోకి వదులుతున్న వ్యర్థ రసాయనాల ధాటికి మంటలు చెలరేగుతుండడంతో బస్తీల్లోని ప్రజలు ఇళ్లలో ఉండకుండా బయటికి పరుగులు తీసే దుస్థితిలు నెలకొంటున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని పలు కెమికల్ పరిశ్రమలు నాలాల్లోకి నేరుగా కెమికల్ వదిలిపెట్టడం మంటలు చెలరేగడం ఇక్కడ పరిపాటిగా మారుతుంది. సుమారు 2009 సంవత్సరంలో వివేన్ పరిశ్రమ పట్టపగలే నాలాల్లోకి కెమికల్ వ్యర్థాలను వదిలేయడం వలన మంటలు చెలరేగి ఇళ్లు దగ్ధం కావడంతో పాటు ఓ ద్విచక్ర వాహనం దగ్ధమైంది.

మల్లన్నసాగర్ ప్రాంతాలలో పోలీసుల నిర్బంధం ఎత్తివేయాలి

కాచిగూడ, ఆగస్టు 30: మల్లన్న సాగర్ ప్రాంతంలో జరుగుతున్న పోలీసు నిర్బంధం వెంటనే తొలగించాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘనపై మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.

కాంగ్రెస్ పురోగభివృద్ధికి కృషి చేయాలి

రాజేంద్రనగర్, ఆగస్టు 30: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పూర్వ వైభవానికి ప్రతి కార్యకర్త సైనికునిగా పనిచేసి పురోగాభివృద్ధికి తీసుకురావాలని సూచించారు.

నీటి కోసం రోడ్కెక్కిన విద్యార్థులకు ప్రతిఫలం

కులకచర్ల, ఆగస్టు 30: నీటి కోసం రోడ్డెక్కిన విద్యార్థులకు ప్రతిఫలం లభించింది. తమ నీటి గోస తీర్చాలని మండల జడ్‌పిటిసి ఇంటికి నడుచుకుంటూ చ్చిన కొత్తపల్లె విద్యార్థుల కష్టాలకు చలించింన జడ్‌పిటిసి మంజల వెంటనే స్పందించి రాత్రికి రాత్రే గొట్టపుబావిని తవ్వించారు. వివరాల్లోకి వెళితే.. కులకచర్ల మండలం కొత్తపల్లె గిరిజన ఆశ్రమ పాఠశాలలో మూడు నాలుగు నెలల నుంచి తీవ్రంగా నీటి ఎద్దడి నెలకుని ఉంది. ఈ విషయమై విద్యార్థులు.. వార్డెన్, ఉన్నతాధికారుల దృష్టికి తెస్తూనే ఉన్నారు. కానీ, ఎంతకూ నీటి సమస్య మాత్రం తీరడం లేదు.

జయేంద్ర సరస్వతికి అస్వస్థత

విజయవాడ, ఆగస్టు 30: కంచికామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతి స్వామి(82) హైబిపితో మంగళవారం ఉదయం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లగా పక్కనే ఉన్న ఆయన శిష్యులు, పీఠం సిబ్బంది హుటాహుటిన ఇక్కడి ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్య పరీక్షలు, వైద్య సేవలనంతరం ఆయనకు చికిత్సనందించిన డాక్టర్ రవిరాజు, డాక్టర్ పవన్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం స్వామీజీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకోటానికి మరో రెండు రోజులు సమయం పడుతుందన్నారు. స్వామీజీ వ్యక్తిగత గుండె, వైద్య, నరాల నిపుణులు సాయంత్రానికి చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు.

దళితులను చీల్చేందుకు కుట్ర

చార్మినార్, ఆగస్టు 30: ఎమ్మార్పీఎస్ నాయకులను పావులుగా చేసుకుని, దేశంలోని దళితులను చీల్చేందుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుట్ర చేస్తున్నారని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. మంగళవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసినా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్ తేల్చి చెప్పినా, ఇంకా రాజకీయాలు చేయటం తగదని అన్నారు. వర్గీకరణ ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్య కాదని, అది ఓ జాతీయ సమస్యగా సుప్రీంకోర్టు తెలిపినా, ఉషా మెహ్రా కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపించారు.

కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

వికారాబాద్, ఆగస్టు 30: జిల్లాలోని అన్ని పోలిస్‌స్టేషన్‌లలోని కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నవీన్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్‌స్టేషన్‌లలో కేసుల పురోగతిని సమీక్షించారు. కేసుల పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇచ్చారు. అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న చట్ట వ్యతిరేక చర్యలపై తక్షణమే స్పందించి ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని సూచించారు. వినాయకచవితి, బక్రీద్ పండుగల సందర్భంగా బందోబస్తు నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పోలీసుల విధుల గురించి తెలిపారు.

చేవెళ్ల జిల్లా ప్రకటించే వరకూ పోరాటం

చేవెళ్ల, ఆగస్టు 30: పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంమైన చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జిల్లా పోరాట సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి పి.వెంకటస్వామి, సిపిఐ చేవెళ్ల నియోజకవర్గ కార్యదర్శి రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభులింగం అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలో జిల్లా పోరాట సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించి, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. చేవెళ్లను జిల్లా కేంద్రంగా ఏర్పటు చేసే వరకు పోరాటం ఆగదని చెప్పారు.

ప్రకంపనలో ప్రణాళికలు

విశాఖపట్నం, ఆగస్టు 30: విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన వివిధ చర్యలపై విపత్తుల నిర్వహణకు సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి తూర్పు నౌకాదళం నిర్వహిస్తున్న ప్రకంపన కార్యక్రమం మంగళవారం ఇక్కడి సముద్రిక ఆడిటోరియంలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, సహాయ, పునరావాస చర్యల గురించి చర్చిస్తున్నారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఉమ్మడిగా చేపట్టాల్సిన చర్యలను క్రోడీకరించి ప్రణాళిక తయారు చేయనున్నారు.

Pages