S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్‌లో భారతీయ మహిళ కిడ్నాప్

న్యూఢిల్లీ/కోల్‌కతా, జూన్ 10: అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న భారతీయ మహిళను కాబూల్‌లో అనుమానిత ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కోల్‌కతాకు చెందిన జుదిత్ డిసౌజా కాబూల్‌లో ఆగాఖాన్ ఫౌండేషన్ సంస్థలో సీనియర్ సాంకేతిక సలహాదారుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆఫీసు బయట జుదిత్‌తో పాటు సెక్యూరిటీ గార్డు, డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. కాబూల్ నడిబొడ్డున తైమని ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో భారత్‌కు తిరిగిరావాల్సిన జుదిత్ కిడ్నాప్‌కు గురికావడంతో కోల్‌కతాలోని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మితిమీరిన విమర్శలు చేయొద్దు

ముంబయి, జూన్ 10: బాలీవుడ్ చిత్రం ‘ఉడ్తా పంజాబ్’ లో కొన్ని సన్నివేశాలు ‘చాలా అసభ్యకరం’గా ఉన్నాయని కేంద్ర సెన్సార్ బోర్డు (సిబిఎఫ్‌సి) సోమవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. ఈ చిత్రంలోని ‘జమీన్ బంజర్ తో ఔలాద్ కంజర్’ అనే డైలాగ్‌ను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటూ, ఇటువంటి అసభ్యకరమైన డైలాగ్‌లను, అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించి తీరాల్సిందేనని హైకోర్టుకు సెన్సార్ బోర్డు విజ్ఞప్తి చేసింది.

ఇక మనమే సూపర్ పవర్

లక్నో, జూన్ 10: భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చైనా, అమెరికాకన్నా కూడా భారత్ ఎక్కువ పెట్టుబడులు సుమారు 51 బిలియన్ డాలర్లను ఆకర్షించిందని ఆయన అన్నారు. మన దేశం ‘ఎకనమిక్ సూపర్‌పవర్’గా అవతరించే రోజు మరెంతో దూరంలో లేదని ఆయన అన్నారు. ‘అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వం కన్నా ముందు భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా ఉండింది. వాజపేయి ప్రభుత్వ హయాంలో వృద్ధి రేటు 8.4 శాతానికి చేరింది. యుపిఏ హయాంలో ఆరు శాతం కన్నా దిగువన ఉన్న వృద్ధి రేటు గత రెండేళ్లలో 7.6 శాతానికి పెరిగింది.

ఐదుగురికి యావజ్జీవం

న్యూఢిల్లీ, జూన్ 10: ఢిల్లీలో రెండున్నరేళ్ల క్రితం డెన్మార్క్ నుంచి వచ్చిన ఒక పర్యాటకురాలిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన అయిదుగురు దోషులకు ఇక్కడి కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 52 ఏళ్ల డెన్మార్క్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. దోషులు మహేందర్ అలియాస్ గంజా (25), మహమ్మద్ రజా (25), రాజు (23), అర్జున్ (21), రాజు చక్కా (30)లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి రమేశ్ కుమార్ తీర్పు చెప్పారు.

చెడ్డపేరు తీసుకురావద్దు

ఏలూరు, జూన్ 10 : జాతి పేరుతో అరాచకాలు సృష్టించడం వలన ఎటువంటి ప్రయోజనాలు వుండవని, చివరకు ఆ జాతికే చెడ్డపేరు తీసుకువచ్చే పరిస్థితి వస్తుందని, అలాంటివి విరమించుకోవాలని రాష్ట్ర మంత్రి పీతల సుజాత ముద్రగడ పద్మనాభంకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కాపుల అభ్యున్నతికి కృషి చేస్తుంటే ఉద్యమం చేయడం వలన ఏం ప్రయోజనం వుంటుందని ఆమె ప్రశ్నించారు. కాపులూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, గతంలో ఏ ప్రభుత్వమూ చేయని కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.

భారత్‌పై కుట్రలు ఆపండి!

వాషింగ్టన్, జూన్ 10: భారత్‌లో దాడులకు కుట్ర పనే్నందుకు ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడాలని దాయాది దేశాన్ని అమెరికా హెచ్చరించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు తెలియజేయడంతో దాయాది దేశానికి అగ్రరాజ్యం ఈ విషయాన్ని స్పష్టం చేసిం ది. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు పాకిస్తాన్ చేపట్టవలసిన చర్యల్లో ఇదొకటని అమెరికా పేర్కొన్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ డిప్యుటీ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ గురువారం వెల్లడించారు.

కాపునేతల హౌస్ అరెస్టు

భీమవరం, జూన్ 10: జిల్లాలోని కాపునాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గత 24 గంటల నుండి వీరు పోలీసుల అధీనంలోనే ఉన్నారు. శనివారం బంద్ కారణంగా ముందస్తుగానే పోలీసులు ఈ చర్యలకు పూనుకున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తుని ఘటన నేపథ్యంలో అమాయకులను సిఐడి పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దీక్షతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో కాపుగర్జనకు జిల్లా నుండి ఎవరెవరు వెళ్ళారు అనే వివరాలు తెలుసుకున్న పోలీసులు వారి ఇళ్ళను రక్కీ చేశారు. జిల్లా అంతా కూడా ఒకే సమయంలో ఈ రెక్కీ నిర్వహించారు.

వెబ్‌సైట్‌లో గ్రామాల సమాచారం

ఏలూరు, జూన్ 10 : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆ గ్రామానికి సంబంధించి నూరుశాతం సమాచారం పొందుపరచాలని పంచాయతీ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పంచాయితీ పన్నుల వసూళ్లు, డంపింగ్ యార్డుల నిర్మాణం, శానిటేషన్, బయోమెట్రిక్ అటెండెన్స్, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ సమీక్షించారు.

భీమోలులో మళ్లీ భూ వివాదాలు

గోపాలపురం, జూన్ 10: మండలంలోని భీమోలు గ్రామంలో భూములకు సంబంధించి ఇరువర్గాల మధ్య వివాదాలు మళ్లీ తలెత్తాయి. ఈ గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు ఉండడంతో ఆ భూముల్లో గత కొనే్నళ్లుగా గ్రామంలోని కొందరు సాగుచేసుకుంటున్నారు. ఈ భూముల వ్యవహారం న్యాయ స్థానంలో ఉండగా ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఆధీనంలో ఈ భూములు ఉన్నాయి. ఆ భూములు సాగువిషయమై ఏటా గ్రామంలోని ఇరువర్గాల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి శాంతింపజేయడం పరిపాటిగా మారింది.

4వేల మెగావాల్ట్‌ల సౌర విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యం

ఏలూరు, జూన్ 10 : రాష్ట్రంలో జూలై 17 నాటికి నాలుగు వేల మెగావాల్ట్‌ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మం6తి పీతల సుజాత చెప్పారు. చింతలపూడిలో శుక్రవారం 42 లక్షల రూపాయలతో నిర్మించిన విద్యుత్తు సబ్ డివిజన్ ఇంజనీరింగ్ కార్యాలయ నూతన భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా విద్యుత్తు రంగంపై ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 24 గంటలూ విద్యుత్తు అందించ గలుగుతున్నామన్నారు.

Pages