S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొ-క్యారమ్స్ లోగో ఆవిష్కరణ

విశాఖపట్నం (స్పోర్ట్స్), జూన్ 10: అఖిల భారత క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ప్రొ క్యారమ్స్ లీగ్ లోగోను మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ లీగ్‌లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను ఆక్షన్‌ద్వారా ఆరు జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఇప్పటికే అయిదు జట్ల ఎంపిక జరిగిపోయింది. ఇంకా మిగిలిన ఒక జట్టు యుఎస్‌కు సంబంధించినది కాగా దానిని కూడా భారతీయులే స్పాన్సర్ చేస్తున్నారని సమాఖ్య అధ్యక్షుడు నీరజ్‌కుమార్ సంపత్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ప్రతి జట్టులో ఐదుగురు క్రీడాకారులు, కోచ్, మేనేజర్ ఉంటారన్నారు.

స్మార్ట్ రైల్వేస్టేషన్‌కు కొత్త కళ!

విశాఖపట్నం, జూన్ 10: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరిధిలోకి వచ్చే వాల్తేరు డివిజన్ ప్రాధాన్యత రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్ర విభజన తదుపరి గత రెండేళ్ళ కాలంలో ఊహించని విధంగా అభివృ ద్ధి చెందిన ఈ స్టేషన్‌కు త్వరలో హైస్పీడ్ రైలు రానుంది. ఇది రానున్న కొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుంది. దీనిపై ఇటీవల కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేశ్ ప్రభాకర్ ప్రభు విజయవాడలో అధికారిక ప్ర కటన చేశారు. ఇదేతరహాలో గత కొనే్నళ్ళుగా పెండింగ్‌లోనున్న అరకు అద్దాల రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. బహు శా వచ్చేనెలాఖరి లోపు దీనిని ప్రారంభిస్తారని రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

ప్రజాభీష్టం మేరకే జిల్లాల ఏర్పాటు

కరీంనగర్, జూన్ 10: పరిపాలన ప్రజలకు చేరువలో ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో జిల్లాల పునర్వీభజన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అయితే ప్రజలు ఏలాంటి అపోహలు, ఆందోళనలకు గురికావద్దని, ప్రజా అంగీకారం మేరకే జిల్లాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 70 కిలోమీటర్ల పరిధిలో 20 నుంచి 22 మండలాలను ఒక జిల్లాను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాల ఏర్పాటుతోపాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

అతీగతీలేదు!

విశాఖపట్నం, జూన్ 10: ఆర్థిక నేరాలకు పాల్పడిన సంస్థలపై నమోదవుతున్న కేసులకు పరిష్కారం దొరకట్లేదు. సిఐడికి బదలాయించిన కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. బోర్డు తిప్పేసిన సంస్థల ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పటికీ బాధితులకు పరిహారం మాత్రం అందట్లేదు. కొన్ని కేసుల్లో బాధితులు పరిహారం అందుకోకుండానే అనంతలోకాలకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ సెక్యూరిటీ డిపాజిట్లు, చిట్‌ఫండ్స్ ద్వారా అధిక వడ్డీలు ఎరవేసి, అమాయకుల నుంచి డిపాజిట్లు సేకరించిన పలు సంస్థలు బోర్డు తిప్పేశాయి.

ఐటిడిఎలో ఇ-ఆఫీస్ పాలనపై శిక్షణ

పాడేరు, జూన్ 10: పాడేరు ఐటిడిఎ కార్యాలయంలో వారం రోజులలోగా కాగిత రహిత పాలనను అమలులోకి తీసుకురానున్నట్టు సంస్థ ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్ తెలిపారు. స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో ఇ-ఆఫీస్ నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన శిక్షణను ఆయన ప్రారంభించారు. ఐటిడిఎ నుంచి వెళ్లవల్సిన దస్త్రాలన్నీ ఇకపై ఇ-ఆఫీస్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు, సిబ్బందికి ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.

కాపు ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్ర!

పాడేరు, జూన్ 10: కాపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. శుక్రవారం రాత్రి ఆమె విలేఖరులతో మాట్లాడుతూ కాపులకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షను భగ్నం చేసేందుకు అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు.

తాడి కాలుష్య సమస్యపై నేడు కలెక్టర్ సమక్షంలో సమావేశం

పరవాడ, జూన్ 10: జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ కా లుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలించే సమస్య పై శనివారం కలెక్టర్ ఎన్.యువరాజ్ అధికారులతో సమావే శం కానున్నారు. సమావేశానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంపిపి మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటిసి పయిల జగన్నాధరావులను ఆహ్వానించారు. తాడికి ఐ దుగురు ప్రతినిధులను ఎమ్మెల్యే బండారు సమావేశానికి తీ సుకువెళ్లనున్నారు. తాడి తరలింపుపై ఆధ్యయన కమిటీ కా లుష్య కోరల్లో చిక్కుకున్న గ్రామాల్లో పర్యటించి ఏడాది కావచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ సమక్షంలో సమావేశం కావడం చర్చనీయాంశమైంది.

అందరూ సహకరిస్తేనే అభివృద్ధి

కేశంపేట, జూన్ 10: ప్రజలందరి సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి దత్తత గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి గ్రామస్థులు, యువకులతో చర్చించారు. గ్రామస్థులంతా అభివృద్ధిలో భాగస్వాములు కావడం వల్ల గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, యువకులను గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.

విశాఖలో జూలై 2న బే మారథాన్

విశాఖపట్నం, జూన్ 10: విశాఖ ఆర్‌కె బీచ్ వేదికగా జూలై 2న బే మారథాన్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి సారిగా రాత్రి సమయంలో మారథాన్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు విశాఖ అనుకూలంగా ఉంటుందని భావించి బే మారథాన్ నిర్వహణకు సంబంధించి మెడల్స్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆవిష్కరించారు. తొలి సారిగా రాత్రి వేళలో జరుగుతున్న బే మారథాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు వేదికగా నిలిచిన విశాఖ నగరంలో బే మారథాన్ నిర్వహించాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు.

ఎడ్యుకేషన్ హబ్‌గా విశాఖ

పరవాడ, జూన్ 10: విద్యా హబ్‌గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోగల లా రెస్ ల్యాబ్స్ యాజమాన్యం సుమా రు 35లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించి న మార్కెట్ యార్డ్‌లో షెడ్లును శుక్రవా రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వి ద్యా సంస్థలకు జిల్లా వ్యాప్తంగా 1100 ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. ఇప్పటికే 800 ఎకరాల స్థలాల్లో వివిధ యూనివర్సిటీల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

Pages