S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు

హైదరాబాద్, జూన్ 10: మొత్తం పది మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 51 మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకం పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 168 మార్కెట్ కమిటీలు ఉండగా, వీటిలో 51 మార్కెట్ కమిటీలకు నియామకాలు పూర్తి కాగా, మిగిలిన 117 మార్కెట్ కమిటీలకు వరుసగా నియమాకాలు చేపట్టనున్నారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జిల్లా అక్కపల్లిని,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గంధం శ్రీనివాస్‌ను, ఖానాపూర్‌కు నల్లా శ్రీనివాస్‌ను చైర్మన్‌గా నియమించారు. ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా యుగంధర్‌ను నియమించారు.

మన్యం అభివృద్ధిని అడ్డుకున్న ప్రభుత్వం!

పాడేరు, జూన్ 10: విశాఖ గిరిజన ప్రాంత అభివృద్ధిని ప్రభుత్వమే అడ్డుకుందని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆరోపించారు. పాడేరులోని తన నివాస గృహంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం మంజూరైన పనులను రద్దుచేసి గిరిజనులకు తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. మన్యాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది రూపాయల పనులను ప్రస్తుత టిడిపి ప్రభుత్వం రద్దు చేసిందని బాలరాజు ఆరోపించారు. అభివృద్ధి పనులను, నిధులు మంజూరు చేయించామని, వీటిని ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జీతం తీసుకుంటున్నారు.. పనిచేయండి

విశాఖపట్నం, జూన్ 10: జీతం తీ సుకుంటున్నాం...దానికి తగ్గట్టుగా పనిచేయండి...అటెండెన్స్ వేస్తారు... ప్రైవే టు ప్రాక్టీస్‌కు పోతారు...ఇలాగైతే ఎ లా? ప్రభుత్వ వైద్యులపై నమ్మకం ఎలా కలుగుతుంది. ఇకనుంచైనా సక్రమంగా విధులు నిర్వహించండి. అలా కాదు ఇలానే చేస్తామంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొ ండయ్య హెచ్చరించారు. విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం పెదగంట్యా డవద్ద నూతనంగా 256 ఎకరాల్లో ఏ ర్పాటు చేయనున్న మెడ్‌డెక్ హెల్త్‌పార్కు కోసం స్థల పరిశీలన చేపట్టారు.

బంద్ సంపూర్ణం జనగామలో ఉద్రిక్తత

జనగామ టౌన్, జూన్ 10: వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పట్టణ బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం పార్టీలతో పాటు జిల్లా సాధన సమితి ప్రతినిధులు చౌరస్తాలో నినాదాలు చేస్తుండగా వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అనంతరం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న మంత్రి హరీష్‌రావుకు చౌరస్తాలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆందోళనకారులను ఆ ప్రాంతం నుంచి చెదరగొట్టి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

16 నుంచి పది సప్లిమెంటరీ పరీక్షలు

జగదాంబ, జూన్ 10: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీపరీక్షలను ఈ నెల 16 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ యువరాజ్ తెలిపారు. ఈ పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. బార్‌కోడింగ్ విధానం అమల్లో ఉన్నందున ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. జిల్లాలో పదోతరగతి పరీక్షలకు 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతంలో 14, గ్రామీణ ప్రాంతంలో 7 పరీక్ష కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, హెచ్‌ఎంలను కలెక్టర్ ఆదేశించారు.

విశాఖ ఖ్యాతి మరింత పెరగాలి

విశాఖపట్నం, జూన్ 10: విశాఖ ఖ్యాతి మరింత ప్రజ్వరిల్లేలా కార్యకపాలు చేపట్టనున్నట్టు మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో జూలై 2న నిర్వహించే బే మారథాన్ మెడల్స్‌ను శుక్రవారం ఆవిష్కరించిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి వేడుకలకు వేదిగా నిలుస్తున్న విశాఖలో భవిష్యత్‌లో మరిన్ని కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీచ్‌రోడ్డులో యోగా ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వేలాది మంది ఉద్యోగులు, స్థానికులతో యోగా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు.

పాఠశాలల్లో యోగా

జగదాంబ, జూన్ 10: పోటీ పరీక్షలు, ర్యాంకుల పేరుతో పలు ప్రైవేటుపాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను మానసిక వత్తిడి, మనో వేదనకు గురి చేస్తున్నాయి. దీంతో కొందరు ఆ వత్తిడిని జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను మానసిక, శారీరక ప్రశాంతతకు యోగ లేదా మెడిటేషన్ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తొంది. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో వీటిని తప్పనిసరిచేస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లో మచిలీపట్నం బీచ్

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 10: మచిలీపట్నం బీచ్ ఇకపై ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌గా మారబోతుందని టూరిజం శాఖ ఆధ్వర్యంలో సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కలెక్టర్ బాబు, టూరిజం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం బీచ్ అభివృద్ధి పనులు తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. బీచ్ స్వరూపం పూర్తిగా మారిపోవాలని దీనికోసం టూరిజం శాఖ పనులు తక్షణమే చేపట్టాలన్నారు. బీచ్‌లో టూరిజం అభివృద్ధి చేస్తే ఎంతోమంది ఔత్సాహికులు వస్తారని మంత్రి తెలిపారు.

పార్కింగ్ సౌకర్యం లేకపోతే దుకాణం మూసివేతే!

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 10: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టిన ప్రస్తుత తరుణంలో విస్తరించిన రోడ్లపై వాహనాల పార్కింగ్ చేస్తున్న వైనంపై కమిషనర్ వీరపాండియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పర్యటనలో భాగంగా శుక్రవారం నగరంలోని పలు రహదారుల విస్తరణ పనులను పరిశీలించిన ఆయన రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న వాహనాల తీరుతోపాటు స్థానిక వ్యాపారుల తీరుపై మండిపడ్డ ఆయన రోడ్ల విస్తరణకు అవరోధం కలిగించే ప్రతి ఆక్రమణలను తొలగించాలన్నారు.

ఖరీఫ్ నుండే జిల్లాలో ఎరువుల పంపిణీ

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 10: కలెక్టర్ క్యాంపు కార్యాలయాల్లో ఎరువుల పంపిణీదారులు, హోల్‌సేల్ డీలర్లు, డీలర్లు రిటైలర్లతో పాటు జిల్లాలోని అన్ని స్థాయి వ్యవసాయశాఖ అధికారులకు ‘ఎఇఎఫ్‌డిఎస్’పై శిక్షణ ఇచ్చారు. దేశంలోనే ప్రప్రథమంగా జాతీయస్థాయిలో స్థిరీకృత వ్యవసాయాన్ని అమలుచేయాలని అందుకు 2016-17 సంవత్సరం నుండి ప్రణాళికల అమలుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం జరుగుతోందన్నారు. ఈ దేశంలోనే ఎరువుల వినియోగ క్రమబద్దీకరణకు ఎఇఎఫ్‌డిఎస్ ద్వారా చేపట్టే ప్రాజెక్టు కృష్ణాజిల్లాను ఎంపిక చేయడం జరిగిందన్నారు.

Pages