S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వ కమిటీలో అంగరకు స్థానం

పాలకొల్లు, జూన్ 10: మహిళా, శిశువు, మానసిక వికలాంగులు, వృద్ధుల అభివృద్ధి కమిటీలో సభ్యునిగా ప్రభుత్వ విప్ అంగర రామమోహన్‌ను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికలాంగులకు పూర్తి రక్షణ కల్పించే ఈ కమిటీ మూడు సంవత్సరాలు అమలులో ఉంటుంది. ప్రతి ఆరు మాసాలకు తప్పనిసరిగా ఈ కమిటీ సమావేశం జరిపి జరుగుతున్న పనులను సమీక్షిస్తుంది. దీనికి ఈ శాఖ మంత్రి ఛైర్‌పర్సన్‌గా ఉంటారు.

ముద్రగడకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టింగులు

భీమవరం, జూన్ 10: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు అరెస్ట్ చేసిన 24 గంటలు గడవకముందే సోషల్ మీడియాలో తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా.. ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా పోస్టింగులు హల్‌చల్ చేస్తున్నాయి. శుక్రవారం ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా టిడిపి గుర్తును కొట్టిపారేస్తూ కోడ్‌లతో ఉన్న పోస్టింగ్‌లు హల్ చేశాయి. నేను కాపుని టిడిపిని నమ్మి ఓటు వేసినందుకు సిగ్గుపడుతున్నానని.. అవసరమైతే ఓటు వేయడం మానేస్తానని.. కాని టిడిపికి మాత్రం ఓటు వేయనని.. నువ్వు అసలైన కాపువైతే ఓటు వెయ్యకంటూ పోస్టింగ్ హల్‌చల్ చేసింది.

రూ. 4900 కోట్లతో ‘చింతలపూడి’ విస్తరణ

ఏలూరు, జూన్ 10 : జిల్లాలో మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి 4900 కోట్ల రూపాయల వ్యయంతో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌ను విస్తరించనున్నట్లు రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక శనివారపుపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సేద్యపునీటి పధకాల ప్రగతిపై మంత్రి సమీక్షించారు.

ఆకివీడులో పోలీస్ పికెట్

ఆకివీడు, జూన్ 10: ముద్రగడ పద్మనాభం అరెస్టుతో ఆకివీడులో అల్లర్లు జరుగుతాయోమేనన్న ముందస్తుజాగ్రత్తతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు. వంగవీటి రంగా హత్య అనంతరం జరిగిన విధ్వంసకాండలో ఎక్కువగా ఆకివీడులో దీని ప్రభావం ఉండటంతో ఈ ప్రాంతంలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఆకివీడులో సెక్షన్ 30, 144 సెక్షన్‌లు అమల్లో ఉన్నాయని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదంటూ భీమవరం రూరల్ సిఐ ఆర్‌జి జయసూర్య హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం ఎస్సై కడియాల అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది జాతీయ రహదారిపై గస్తీ నిర్వహించారు.

నేడు జిల్లా బంద్

ఏలూరు, జూన్ 10 : కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్ చివరకు రకరకాల మలుపులు తిరుగుతూనే వస్తోంది. తాజా పరిణామాల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేసిన తీరుపై, అరెస్టుపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన కాపు నాయకులు ఉద్యమం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతూ జాతికి చెడ్డపేరు తీసుకువస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ వ్యవహారాలు ఇలా వుంటే ముద్రగడ అరెస్టును నిరసిస్తూ కాపుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ శనివారం జిల్లా బంద్‌కు కాపు సంఘాలు పిలుపునిచ్చాయి.

ఆటోనడిపిన మంత్రి మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, జూన్ 10: బిసి కార్పోరేషన్ సబ్సిడీ రుణంతో మంజూరైన ఆటోను దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు శుక్రవారం స్వయంగా నడిపి ప్రారంభించారు. రూరల్ మండలం దండగర్ర గ్రామంలో మిద్దే వెంకటేశ్వరరావుకు బిసి కార్పొరేషన్ ద్వారా ఆటో సబ్సిడీ రుణం మంజూరైంది. దీనిద్వారా సమకూర్చిన ఆటోను స్థానిక మంత్రి కార్యాలయం వద్ద శుక్రవారం మంత్రి మాణిక్యాలరావు స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

గుత్తేదారులదే గుత్యాధిపత్యం!

విజయనగరం (్ఫర్టు), జూన్ 10: విజయనగరం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సంబంధించి గుత్తేదారులే గుత్త్ధాపత్యం వహిస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరి వల్ల పట్టణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో టెండర్లు ఖరారు చేసిన పనులు కూడా పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. కొన్ని చోట్ల పనులు ప్రారంభించక పోగా, మరికొన్ని చోట్ల ప్రారంభించిన పనులను పూర్తి చేయడం లేదు. చాలాచోట్ల సగంలోనే పనులు నిలిచిపోయాయి. ఫలితంగా సరైన రోడ్లు, కాలువలు, కల్వర్టుల సదుపాయం లేక పట్టణ ప్రజలు నరకయాతన పడుతున్నారు.

ఆంగ్లభాషతో ఉపాధి అవకాశాలు

విజయనగరం(టౌన్), జూన్ 10: ఆంగ్ల భాషపై పట్టుసాధిస్తే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ పి. ఉదయభాస్కర్ అన్నారు. జెఎన్‌టియు విజయనగరం కళాశాలలో గడచిన ఐదురోజులుగా జరుగుతున్న ఇంగ్లీష్ వర్క్‌షాపు శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష పట్ల అవగాహన అధ్యాపకునికి విద్యార్థులకు అవసరమని తెలిపారు. ఇటువంటి వర్క్‌షాపుల ద్వారా ఆంగ్ల భాషపై విద్యార్థుల్లో ఉన్న అపోహలు తొలగిపోయి అవగాహన పెరుగుతుందని చెప్పారు. మెళకువలు ఆకళింప చేసుకుంటే ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం పెరిగి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు.

విద్యార్థులకు ‘బడి బస్సులు’

విజయనగరం (్ఫర్టు), జూన్ 10: జిల్లాలో విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నందున కేవలం విద్యార్థుల కోసం బడి బస్సులను నడపాలని నిర్ణయించామని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్ అన్నారు. విద్యార్థుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అనుకూలమైన సమయాలలో బస్సులు నడపాలని డిపోమేనేజర్లను ఆయన ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో విజయనగరం, ఎస్.కోట, సాలూరు, పార్వతీపురం డిపోమేనేజర్లతో సమావేశం నిర్వహించారు.

నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు

బొబ్బిలి, జూన్ 10: నిరుపేదలకు శుభవార్త.. వారు నివశించడానికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో సుమారు 2 లక్షలకుపై రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన మార్గదర్శకాలు జూలై నెలాఖరు నాటికి విడుదల చేస్తామని రాష్ట్ర గ్రామీణ, గృహ నిర్మాణశాఖా మంత్రి కిమిడి మృణాళిని వెల్లడించారు. పురపాలకసంఘ కార్యాలయంలో చైర్‌పర్సన్ ఛాంబర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ 1250 ఇళ్ల వంతున రెండు గదుల ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

Pages