S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

విజయనగరం(టౌన్), జూన్ 10: తుని ఘటనలో బాధ్యులుగా భావించి అరెస్టుచేసిన కాపునాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జిల్లా తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చనమల్లు ప్రసాదరావు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమేనని అయితే ముద్రగడ దీక్ష సందర్భంలో త్రిమెన్ కమిటీ ఇచ్చిన హామీ మేరకు కేసులు పెట్టమని చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథన్ కమిటీ ఇంతవరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన చేయలేదన్నారు.

14న పేద బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహాకాల పంపిణీ

విజయనగరం(టౌన్), జూన్ 10: విజయనగరం పట్టణ పరిధిలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించేందుకు దరఖాస్తులు పరిశీలన పూర్తిచేసామని సమాఖ్య కార్యదర్శి చక్రవర్తి తెలిపారు. పట్టణంలోని రాజీవ్ నగర్‌లోగల బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కార్యాలయంలో సమాఖ్య గౌరవాధ్యక్షులు డి.వి.శ్రీకాంత్, అధ్యక్షులు శివరామయ్య, సభ్యులురామంల పర్యవేక్షణలో ప్రోత్సాహకాలకు అందిన దరఖాస్తులను పరిశీలించామని కార్యదర్శి చక్రవర్తి శుక్రవారం వెల్లడించారు.

కార్పొరేట్ స్కూళ్లల్లో సీట్లు కేటాయింపు

విజయనగరం(టౌన్), జూన్ 10: జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలు, బెస్ట్ పాఠశాలల్లో సీట్ల కేటాయింపు కార్యక్రమాన్ని శుక్రవారం అదనపుజాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు నిర్వహించారు. కలెక్టరేట్ సమీపంలోని అంబేద్కర్ కల్యాణ మండపంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విశే్వశ్వరరెడ్డి, కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పి. రత్నం, సిబ్బంది పర్యవేక్షణలో హాజరైన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఒకటవ తరగతి, ఐదవ తరగతి ప్రవేశాలకు సీట్లు కేటాయించారు. ఒకటవ తరగతిలో వంద సీట్లకు 182 దరఖాస్తులు అందాయి.

కోనాడ రైతులకు లీజుపట్టా భూమిపై హక్కులు కల్పించాలి

విజయనగరం(టౌన్), జూన్ 10: గడచిన 30 ఏళ్లుగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామంలో సర్వే నెం.24లో సుమారు 12 ఎకరాల 90సెంట్లభూమిని లీజు పట్టాలుగా పొందిన రైతులకు ప్రభుత్వం భూమి హక్కు పత్రాలు కల్పించాలని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం పూసపాటిరేగ మండల పార్టీ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బాధిత రైతులు కోలగట్లను కలసి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు కొంత మంది ఈభూమిని జిరాయితీగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

వైకాపాలో చేరిన బొబ్బిలి కాంగ్రెస్ నాయకులు

విజయనగరం(టౌన్), జూన్ 10: జిల్లాలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అందరు కలసి పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి తెలిపారు. బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మజ్జిశ్రీనివాసరావు నాయకత్వంలో శుక్రవారం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటి గోపాలరావు, మున్సిపల్ కౌన్సిలర్లు ఈశ్వరరావు, ఆప్పారావు, మాజీ కౌన్సిలర్లు సాహూ, కృష్ణమూర్తి, గోవిందరావు, ఉమామహేశ్వరరావు, కృష్ణారావులకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయనగరం నాయకులు ఒమ్మి శ్రీను, గోపి పాల్గొన్నారు.

‘మీతో-మీ ఎస్పీ’కి ఫిర్యాదుల వెల్లువ

విజయనగరం(టౌన్), జూన్ 10: జిల్లా ఎస్పీ లేళ్ల కాళిదాసు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న మీతో-మీ ఎస్పీ ఫోన్ ద్వారా ఫిర్యాదుల కార్యక్రమానికి పలు ఫిర్యాదులు అందాయి. చీపురుపల్లి పట్టణానికి చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి అందించిన ఫిర్యాదులో కొంతమంది వ్యక్తులు అక్రిడేషన్ గుర్తింపుకార్డులు లేకుండా విలేఖర్లుగా చలామణి అవుతూ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలలో బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎస్పీ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వాడివేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

విజయనగరం (్ఫర్టు), జూన్ 10: పట్టణంలో వీధిదీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పింఛన్ల పంపిణీ, ఆక్రమణల తొలగింపులో అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరిపై పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రసాదుల కనకమహాలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం వాడివేడిగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో అధికారుల వైఖరిపై మండిపడ్డారు. పట్టణంలో వీధిదీపాలు వెలగడం లేదని మున్సిపల్ కౌన్సిలర్లు రొంగలి రామారావు, కెల్ల వరలక్ష్మి, గార సత్యనారాయణ, మైలపిల్లి పైడిరాజు, గాడు అప్పారావు అన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు.

ఊపందుకున్న వ్యవసాయ పనులు

గంట్యాడ, జూన్ 10: మండలంలో ఈ నెలలో ఇప్పటి వరకు అడపాదడపా కురిసిన వర్షాలతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అల్పపీడన ద్రోణుల పుణ్యమా అని మోస్తరు వర్షాలు కురిసాయి. ఈ నెలలో 1,3,6,7 తేదీలలో వర్షాలు బాగానే కురిసాయి. దీంతో రైతులు పొలాల దుక్కులుచేస్తున్నారు. మెట్ట భూముల్లో దుక్కులు పూర్తిచేసిన రైతులు నువ్వుపంటను వేస్తున్నారు. వర్షాధారం పై వరి పండిస్తున్న గ్రామాలలో పొలం దుక్కులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాటిపూడి జలాశయం నీటి ఆధారంగా వరి పండిస్తున్న ఆయకట్టు గ్రామాలలో వరి నారు మడులు వేయడానికి దుక్కులుచేస్తున్నారు.

పుష్కర ఘాట్ల పనులు ప్రారంభం

మహబూబ్‌నగర్, జూన్ 10: ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా కృష్ణా పుష్కర ఘాట్ల పనులకు శ్రీకారం చుట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏకంగా 32 ఘాట్లను ఏర్పాటు చేశారు. మరో 20 ఘాట్లను లోకల్ ఘాట్లుగా గుర్తించారు. ప్రధానంగా కృష్ణానది ఇరువైపుల ప్రధాన పుణ్యక్షేత్రాలతో పాటు వివిధ పర్యాటక ప్రదేశాలలో గుర్తించి 32 పుష్కర ఘాట్లను మాత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది.

గంజాయి స్మగ్లర్లల నుంచి రూ. 2 లక్షలు కాజేసిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అరెస్ట్

నర్సీపట్నం,జూన్ 10: గంజాయి స్మగ్లర్ల అనుచరులపై ఓత్తిడి తెచ్చి రెం డు లక్షల రూపాయలు తీసుకున్న హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం నర్సీపట్నం ఎఎస్పీ ఐశ్వర్య ర స్తోగి విలేఖరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నాతవరం పో లీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హె డ్‌కానిస్టేబుల్ కొండయ్య, కానిస్టేబుల్ సత్యనారాయణ గంజాయి స్మగ్లర్ సు రేష్ పటేల్ అనుచరులైన మహారాష్టక్రు చెందిన అల్లూరి వుద్దవ్, వరంగల్ జి ల్లాకు చెందిన గొడుగు రాజు నుండి రె ండు లక్షల రూపాయలు నగదు తీసుకున్నారన్నారు.

Pages