S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు

పాయకాపురం, జూన్ 10: తమ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొండా ఉమకు సిగ్గుంటే తక్షణమే కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజకు క్షమాపణలు చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు వంగవీటి రాధకృష్ణ డిమండ్ చేశారు. 59వ డివిజన్ కండ్రికలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడుతూ ఇళ్ల విషయమై 59వ డివిజన్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజ ఎమ్మెల్యేను ప్రశ్నించగా ఆమెను ఏకవచనంతో సంభోదించడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి తగదన్నారు.

పరస్పర దాడికి సిద్ధమైన వైసిపి, టిడిపి

పాయకాపురం, జూన్ 10: ఒకే రోడ్డు ఒకేవైపు కొంచెం దూరంలో తెలుగుదేశం.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు! వైసిపి నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుతమ్ముళ్లు ఒక్కొక్కరిగా చేరుతున్నారు. కొంత సేపటికి ఇరు పార్టీ కార్యాలయాలు కార్యకర్తలతో నిండిపోయి ఉన్నాయి. ఉన్నట్టుండి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైసిపి కార్యాలయం వైపు వేగంగా వస్తున్నారు. దీంతో తమ పై దాడికి వస్తున్నారనుకున్న వైసిపి నేతలు సైతం ఎదురు దాడికి సిద్ధమై రోడ్డుపై నిల్చున్నారు. ఇంతలో నున్న గ్రామీణ పోలీసుస్టేషన్ ఎస్సై శివప్రసాద్ అప్రమత్తమైయ్యారు.

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి

పాయకాపురం, జూన్ 10: వైసిపి నేత వంగవీటి రాధ మాట్లాడే ముందుకు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని తెలుగుదేశం డెప్యూటి ఫ్లోర్ లీడర్ జగదీష్, కార్పొరేటర్లు పైడి తులసి, బుగతా ఉమామహేశ్వరి అన్నారు. వైసిపి నేత రాధ సమావేశమనంతరం సమీపంలోనే ఉన్న తమ టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం నేతలు విలేఖరులతో మాట్లాడుతూ తమ పార్టీ కార్పొరేటర్ చెప్పిన మాటల్ని విని రాధ మాట్లాడటం సమంజసం కాదనీ, డివిజన్‌లో ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘనత వైసిపి కార్పొరేటర్‌దని ఆరోపించారు. ఎమ్మెల్యే ఉమ ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, ఆమె ఎమ్మెల్యేను గౌరవం లేకుండా మాట్లాడిందని ఎదురుదాడికి దిగారు.

బిసి సంచార జాతులకు ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 10: రాష్ట్రంలో సంచార జాతుల సంక్షేమానికి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం తెలిపారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సంచార జాతుల సమీక్షా సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొత్తం 139 బిసి కులాలు ఉన్నాయన్నారు. వాటిలో ఉన్న 32 సంచార జాతులకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ మేరకు వెనుకబడిన వర్గాలకు చెందిన సంచార జాతులకు ఎంబిసి కార్పొరేషన్ పేరుతో ఏర్పాటు చేశామన్నారు.

నాణ్యత ప్రమాణాలతో పుష్కరఘాట్లు

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 10: పుష్కర ఘాట్ల పనులను వేగవంతంగా చేపట్టడం అభినందనీయమైనప్పటికీ నాణ్యతా ప్రమాణాలను పాటించటంలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా ఘాట్ల నిర్మాణాలను పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం సీతమ్మవారి పాదాలు, దుర్గాఘాట్, పుష్కర నిర్మాణ పనులను మంత్రి ఉమ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ పనులను ఆదివారం సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తుండడం అభినందనీయ మన్నారు.

ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా పుష్కరాలు

విజయవాడ, జూన్ 10: త్వరలో రానున్న కృష్ణా పుష్కరాలు రాష్ట్ర నూతన రాజధాని గౌరవాన్ని పెంచేలాగా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపేర్కొన్నారు. కృష్ణ నదీపరీవాహక ప్రాంతంలో ఉన్న మూడు జిల్లాలోని 16 మండలాల్లో ఉన్న 81 ఘాట్స్‌ల్లో భక్తులకు సకల సదుపాయాలను కల్పించటమే కాకుండా సుందీకరణ, అలంకరణాలతో అద్భుతమైన శోభను తీసుకురావాలని నిర్ధేశించారు. మూడు జిల్లాలోని పుష్కరపనులు చేపట్టిన ప్రభుత్వ శాఖలతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పుష్కరాల తొలిరోజు ఆగస్టు 12వ తేదీన సాయంత్రం నుండి కృష్ణ నదీకి హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఈసమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

వ్యాపార కేంద్రాలుగా ‘విద్యాలయాలు’

మచిలీపట్నం, జూన్ 10: చదువుల తల్లి సరస్వతీ దేవి నడయాడే విద్యాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు విద్య అందని ద్రాక్షలా మారుతోంది. ఎంతో మంది మేధావులను సమాజానికి అందించిన ప్రభుత్వ పాఠశాలల పట్ల పాలకులు అవలంభిస్తున్న విధానాల వల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు రాజ్యమేలుతున్నాయి. విద్యా రంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుండటంతో పవిత్ర దేవాలయాలుగా భావించే ప్రభుత్వ పాఠశాలలు పతనావస్థకు చేరుతున్నాయి.

ముఖ్యమంత్రినీ విచారించాలి

రాజమహేంద్రవరం, జూన్ 10: తొలిరోజు తొక్కిసలాట ఘటనపై గోదావరి పుష్కరాల్లో అంతా తానై వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విచారించాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదించారు. తొక్కిసలాట దుర్ఘటనపై ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ విచారణ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జరిగింది. విచారణకు హాజరైన ఉండవల్లి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో సిఇఒగా వ్యవహరించి, ట్రాఫిక్‌ను కూడా క్రమబద్ధీకరించిన సిఎంను ప్రత్యక్ష సాక్షిగా పరిగణించి విచారించాలన్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌గా ‘మంగినపూడి బీచ్’

మచిలీపట్నం, జూన్ 10: మంగినపూడి బీచ్ ఇకపై ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌గా మారనుందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా మంగినపూడి బీచ్ అభివృద్ధికి తయారు చేసిన ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగినపూడి బీచ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై శుక్రవారం మంత్రి రవీంద్ర విజయవాడలో కలెక్టర్ బాబు.ఎ, పర్యాటక శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీచ్ స్వరూపాన్ని మార్చే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

లేడీ డాన్ ఆచూకీ ఎక్కడ?

చిత్తూరు, జూన్ 10: ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న కోల్‌కకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ చిక్కినట్టేచిక్కి తప్పించుకుంది. ఆమెను తమకు అప్పగించాలని చిత్తూరు పోలీసులు కోల్‌కతా హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు. జిల్లాలో నమోదైన కేసుల విచారణ కోసం రావాల్సి ఉండగా రాకపోవడంతో జిల్లా పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు.

Pages