S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిట్‌‘లెస్’పై కొరడా!

శ్రీకాకుళం: ఆమదాలవలస రైల్వే ట్రాక్‌పై 2015 ఆగస్టులో ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన్ నిలిచిపోయింది. గేట్లు లేని ఆ ట్రాక్‌పై ఇలా వ్యాన్ మొరాయించడంతో బడిపిల్లల ప్రాణాలు గాలిలో ఊగిసిలాడాయి. ఆ సమయానికి రైళ్ళు రాకపోకలు లేకపోవడంతో పిల్లలను దింపించేసి, వ్యాన్‌ను పట్టాల పైనుంచి తప్పించారు.

ఐఏఎస్‌ల కోర్టు ధిక్కారం కేసు

హైదరాబాద్, జూన్ 10: కోర్టు ధిక్కారం కేసు కింద హైకోర్టు సింగిల్ జడ్జి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐఎఎస్ అధికారులకు విధించిన జరిమానా, శిక్షలను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవి తమపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు మార్కెటింగ్ కమిషననర్ శరత్‌కు ఐదు వేల రూపాయల జరిమానా, ఈ జరిమానా చెల్లించని పక్షంలో ఏడు రోజుల సాధారణ జైలు శిక్షను సింగిల్ జడ్జి విధించారు.

బదిలీలు పూర్తి

శ్రీకాకుళం, జూన్ 10: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఈనెల 20 నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర చంద్రబాబునాయుడు అన్నారు. కార్యాలయాల కంప్యూటరీకరణపై కలెక్టర్లతో శుక్రవారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఉద్యోగుల పనితీరు ఆధారంగా బదిలీలు నిర్వహించాలన్నారు. ఈనెల 14లోగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15నుంచి 17వరకు పనితీరు ఆధారిత బదిలీ కౌనె్సలింగ్ ఉంటుందన్నారు. 20 నాటికి బదిలీ స్థానంలో చేరాలన్నారు. ఐదేళ్లు పూర్తయిన వారికి విధిగా బదిలీ చేయాలని పేర్కొంటూ 20శాతం మించకుండా బదిలీలు ఉండాలన్నారు.

కొత్త జిల్లాలకు మంత్రులుండరు

హైదరాబాద్, జూన్ 10: మరో ఐదునెలల్లో కొత్త జిల్లాలు ఉనికి లోకి రానున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లాలు పని చేస్తాయని ముఖ్యమంత్రి సైతం ప్రకటించారు. జిల్లాలు ఏర్పడినా, కొన్ని జిల్లాలకు మంత్రులు లేని విచిత్రమైన పరిస్థితి ఏర్పడబోతోంది. జిల్లాలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేది జిల్లా మంత్రే. జిల్లా మంత్రికి జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయిస్తున్నారు. జిల్లా అభివృద్ధి సమావేశాలకు అధ్యక్షత వహించేది జిల్లా మంత్రులే. తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరినీ చేర్చుకునే పరిస్థితి లేదు.

ఎసిబి వలలో అవినీతి చేప!

ఆమదాలవలస, జూన్ 10: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న గండుబిల్లి రవి శుక్రవారం మధ్యాహ్నం ఎసిబి వలలో చిక్కుకున్నారు. స్థానిక వాటర్ ట్యాంక్ వద్ద ఎసిబి దాడిలో 50వేలు లంచం తీసుకుంటు దొరికిపోయారు. ఎసిబి డిఎస్పీ కె.రంగరాజు అందించిన వివరాల ప్రకారం అనకాపల్లికి చెందిన దాడి శ్రీనివాసరావు అనే పైపులైన్ కాంట్రాక్టర్ సుమారు రూ.35లక్షలతో పైపులైన్ పనులు చేస్తుండగా రూ.10లక్షల స్పాట్‌పేమెంట్ బిల్లుకు ఎఇ రవి రూ.50వేలు డిమాండ్ చేసినట్టు రంగరాజు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిని లంచం అందిస్తుండగా పట్టుకొని అదుపులోనికి తీసుకున్నట్టు ఎఎస్పీ రంగరాజు తెలిపారు.

‘తుని’లో సీమ రౌడీలు తూచ్!?

హైదరాబాద్,జూన్ 10: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తుని విధ్వంసం వెనుక రాయలసీమ రౌడీలు ఉన్నారన్న ప్రభుత్వ-అధికార పార్టీ ప్రచారం ఉత్తిదేనా? అదంతా వైసిపి నాయకత్వాన్ని వణికించే ఎత్తుగడలో భాగంగా కొనసాగుతున్న వ్యూహాత్మక మానసిక దాడి మాత్రమేనా?.. ఇప్పటివరకూ జరుగుతున్న అరెస్టుల పర్వం తీరు చూస్తుంటే, ఇలాంటి అనుమానాలే తెరపైకి వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపుగర్జన సభ అనంతర విధ్వంసాల వెనుక రాయలసీమకు చెందిన, ప్రధానంగా కడప, పులివెందుల రౌడీలున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునుంచి హోంమంత్రి చినరాజప్ప వరకూ ప్రచారం చేశారు.

కందుకూరులో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

కందుకూరు, జూన్ 10 : పట్టణంలోని 30వ వార్డులో గల 60 అడుగుల రోడ్డులోని 270, 271 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఉన్న ఆక్రమణలను శుక్రవారం అధికారులు కూల్చివేశారు. గత కొంతకాలంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్న పలువురి ఇళ్లను కనిగిరి సిఐ యు సుధాకర్‌బాబు, పట్టణ, రూరల్, గుడ్లూరు ఎస్‌ఐలు సిహెచ్ హజరత్తయ్య, కె సురేష్‌బాబు, విజయచంద్ పోలీసుల సహకారంతో తహశీల్దార్ వి వెంకటేశ్వరరావు ప్రొక్లైయిన్ ద్వారా ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమ నివాసాలను కూల్చివేస్తే దిక్కులేకుండా పోతుందని, కుటుంబమంతా మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు.

ఏపి భవన్ ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు

న్యూఢిల్లీ, జూన్ 10: న్యూఢిల్లీలోని ఆంధ్రా భవన్‌లో ఉద్యోగుల పనిదినాలను వారానికి ఐదు రోజులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వుల ప్రకారం ఏపీ భవన్ ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిని సవరించి ప్రభుత్వం పై ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు ఇచ్చిన వెసులుబాటును ఆంధ్రా భవన్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

29 కేసుల్లో 10మంది నిందితులు అరెస్టు

ఒంగోలు, జూన్ 10:జిల్లాలోని ఒంగోలు,చీరాల,కందుకూరు, దర్శి సబ్‌డివిజన్ పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన 29కేసుల్లో పదిమంది నిందితులను అరెస్టుచేసి వారివద్ద నుండి సుమారు 25.60లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి త్రివిక్రమవర్మ వెల్లడించారు.

ఒంగోలులో ప్రారంభమైన ఎస్‌డబ్ల్యుఎఫ్ 10వ రాష్టమ్రహాసభలు

ఒంగోలు, జూన్ 10: ఒంగోలు నగరంలోని పర్సా సత్యనారాయణ నగర్ (కాపుకల్యాణమండపం)లో ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర పదవ మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సిఐటియు రాష్ట్రప్రధానకార్యదర్శి ఎంఎ గఫూర్ ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్టమ్రహాసభలను ప్రారంభించారు. తొలుత ఎస్‌డబ్ల్యుఎఫ్ మాజీ నాయకులు వెంకట్రావు జెండా ఆవిష్కరణ చేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర పదవమహాసభలు ఒంగోలునగరంలోని కాపుకల్యాణమండపంలో ఈనెల 10,11తేదీల్లో జరుగుతుండగా ఆ మేరకు శుక్రవారం నాడు సభలు ప్రారంభమయ్యాయి.

Pages