S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాపుమిత్ర చంద్రబాబు

మంగళగిరి, జూన్ 10: జగన్‌కు మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్న కాపు సామాజిక వర్గీయులను సహించ వద్దని, న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకే జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారని, కాపు సామాజిక వర్గానికి మేలుచేసే మంచిపనిని ఓర్వలేక పక్కదారి పట్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె కళావెంకట్రావు అన్నారు. మండల పరిధిలోని ఆత్మకూరులో గల హ్యాపీ రిసార్ట్స్ ప్రాంగణంలో శుక్రవారం అఖిల భారత కాపుసమాఖ్య ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్ర కాపుసంఘాల సమాఖ్య ఆత్మీయ సదస్సులో కళావెంకట్రావు ప్రసంగించారు.

నూతన రాష్ట్రంలో ఫోరం ఏర్పాటుకు సన్నాహాలు

గుంటూరు (లీగల్), జూన్ 10: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, అయితే వౌలిక సదుపాయాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో పరిశీలిస్తున్నామని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ నౌషద్ అలీ వెల్లడించారు. శుక్రవారం జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆయన తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం గుంటూరు బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు బార్‌లో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి బార్ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.

రైతుల ఆత్మహత్యలన్నీ పాలకుల హత్యలే..

గుంటూరు, జూన్ 10: దేశంలో, రాష్ట్రంలో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ పాలకులు చేస్తున్న హత్యలేనని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆరోపించారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలుత పురవీధుల గుండా సంఘ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అగ్రభాగాన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఝాన్సీ, కె కోటయ్య, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కన్నబిడ్డలను కాలరాసిన తల్లికి యావజ్జీవం

గుంటూరు (లీగల్), జూన్ 10: పుట్టు మూగ, చెముడుతో జన్మించిన పిల్లలను పోషించలేక వారిని కడతేర్చి తాను కూడా ఆత్మహత్యకు యత్నించిన తల్లికి యావజ్జీవ కారాగారశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు ఫ్యామిలీకోర్టు న్యాయమూర్తి బి మంజరి శుక్రవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... విశాఖపట్నం సమీపంలోని యలమంచలికి చెందిన గుడుపు చంద్రారావు తన మేనకోడలు సంధ్యాలక్ష్మిని సంఘటనకు పధ్నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. మేనరికం కావడంతో వీరికి జన్మించిన జోగి ప్రియాంక (5), దుర్గాకుమార్ (9) లిద్దరూ పుట్టుకతోనే మూగ, చెముడుతో పాటు మానసికంగా ఎదగలేకపోయారు.

వర్ష బాధితులకు పరిహారం పంపిణీ

అమృతలూరు, జూన్ 10: రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా ప్రజా సంక్షేమం దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఈనెల 4న పెనుగాలులతో వచ్చిన భారీ వర్షాలతో మండల గ్రామాలలో 72గృహాలు పూర్తిగా పడిపోయి నష్టం వాటిల్లింది. ఈసందర్భంగా బాధిత కుటుంబాల శ్రేయస్సుకోరి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తహశీల్దార్ అంకారావు ఆధ్వర్యంలో ఆయాగ్రామాల విఆర్‌ఓలు నివేదిక తయారుచేసి కలెక్టర్‌కు పంపారు. ప్రభుత్వం నుండి ఒక్కొక్క బాధిత కుటుంబానికి 5వేల రూపాయలు, 20కేజీల బియ్యం శుక్రవారం మంజూరుచేయిగా ఎమ్మెల్యే చేతులమీదగా పంపిణీ చేశారు.

తెనాలి వైద్యశాలలో అంతర్జాతీయ వైద్య సేవలు

తెనాలి, జూన్ 10: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వైద్య సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సి టీమ్ లీడర్ డాక్టర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆసుపత్రిలోని పిల్లల వార్డు, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, క్యాజువాలజీ వార్డులను పరిశీలించారు. ఆధునాతన పరికరాలు వినియోగం, రోగులకు అందిస్తున్న సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వరప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెనాలి, వేమూరు, కొల్లూరు, కూచిపూడి వైద్యశాలల వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆశ్రయ వార్డులో సరైనోడు విజయోత్సం

తెనాలి, జూన్ 10: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ 50 రోజుల విజయోత్సవ వేడుకలను చిరంజీవి, అల్లు అర్జున్ అభిమానులు శుక్రవారం స్థానిక ప్రభుత్వా ఆసుపత్రి ఆవరణలోని ఆశ్రయ వార్డులోని మానసిక వికలాంగుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా భారీ కేక్‌ను కట్‌చేసి వికలాంగులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ సరైనోడు చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులుగా తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శత విజయోత్సవం జరుపుకునేందుకు సంసిద్ధవౌతున్నట్లు చెప్పారు.

రిజిస్ట్రేషన్ల నిలుపుదలపై ఎమ్మెల్యే ఆర్కే ఆరా

మంగళగిరి, జూన్ 10: రాజధాని గ్రామాల్లో ఎన్‌ఓసి ఉంటేనే స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) శుక్రవారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు.
సబ్ రిజిస్ట్రార్ బెజ్జం నాగేశ్వరరావుతో ఆయన చర్చించారు. ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ మాత్రమే నిలిపామని, మిగతా రిజిస్ట్రేషన్లు యథావిధిగా చేస్తున్నామని ఆయన వివరించారు.

అనుమానాస్పద స్థితిలో యువ క్రీడాకారుడు మృతి

మాచర్ల, జూన్ 10: నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు కలకత్తాలో ఉరివేసుకొని అనుమానాస్పది స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఉప్పలపాడు గ్రామానికి చెందిన సామినేని ఫణీంద్ర (23) గుంటూరు జెకేసీ కళాశాలలో బీకాం పూర్తి చేసుకున్నాడు. క్రీడల పట్ల ఫణీంద్రకు ఆసక్తి ఉండటంతో గుంటూరులో శిక్షణ పొందాడు. ఫణీంద్ర టాలెంట్‌ను గమనించిన కళాశాల పీఈటీ కలకత్తాలోని ఓ ప్రైవేటు క్రికెట్ అకాడమీలో ఫణీంద్రను ఎనిమిది నెలల కిందట చేర్పించారు. అప్పటి నుండి ఫణీంద్ర శిక్షణ పొందుతూ ఉన్నాడు.

చట్టాలపై అవగాహనతో బాధ్యతగా వ్యవహరించాలి

చుండూరు, జూన్ 10: అందరూ చట్టపరిధిలో చట్టాలపై అవగాహనతో బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యం గా రైతులు వ్యవసాయ సంబంధమైన విత్తనాలు ఇతర రకాలు కొనుగోలు చేసేసమయంలో బిల్లులు తప్పక తీసుకోవాలని ఆలా తీసుకున్నప్పుడే నష్టపోయిన రైతులు న్యాయ పరిధిలో కో ర్టు ద్వారా తగిన నష్టపరిహారం పొందవచ్చునని తెనాలి 1వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి ప్రభాకరరావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మండలలోని ఒలివేరులో జరిగిని న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ కుటుంబంలో అందరూ బాధ్యతగా నిర్వహించుటకు బాల్యంనుండే తగిన జాగ్రత్తలు తీసుకొని సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలుగని రీతిలో ప్రవర్తించాలన్నారు.

Pages