S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.90 కోట్లతో ముద్దాడపేట వద్ద వంతెన

ఆమదాలవలస, జూన్ 10: మండలంలోగల ముద్దాడపేట గ్రామం వద్ద నాగావళి నదిపై సుమారు రూ.90కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. నియోజకవర్గంలో పొందూరు, ఆమదాలవలస మండలాలను అనుసంధానం చేసి నాగావళి నదీ తీరంలో ఉన్న సుమారు 120 గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు తాను ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

ప్రమాదాల నివారణ

శ్రీకాకుళం(రూరల్), జూన్ 10: రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పాటూరి లక్ష్మీనృసింహం అన్నారు. మండలంలోని మునసబుపేటలో ఉన్న గాయిత్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో శుక్రవారం పాఠశాలల బస్సు డ్రైవర్లకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమాన్ని రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సు డ్రైవర్లకు చంద్రన్న బీమా పథకం గురించి అవగాహన కల్పించి వారికి వర్తింపజేయాలన్నారు.

విజయవాడ సదస్సుకు తరలిరావాలి

శ్రీకాకుళం(రూరల్), జూన్ 10: విజయవాడలో ఈనెల 14న వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి నిర్వహించనున్న విస్తృత స్థాయి సమావేశానికి వైసిసి శ్రేణులు తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 8న చంద్రబాబుపై గతంలో ఎన్నడూ లేని విధంగా 420 కేసులు నమోదు చేయించినట్టు తెలిపారు. అర్హులైన పింఛన్‌దారులను వైసిపి కార్యకర్తలనే కారణంతో ప్రభుత్వ పథకాలకు దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదన్న విషయాన్ని బాబు గుర్తెరగాలన్నారు.

సామాజిక సమస్యను రాజకీయం చేయొద్దు

హైదరాబాద్, జూన్ 10: ఆమరణ దీక్ష చేస్తున్న కాపునేత ముద్రగడ పట్ల పోలీసు బలగాలు అనుసరించిన తీరు దుర్మార్గమైనదని, ముద్రగడ కుమారుడ్ని కూడా పోలీసులు దారుణంగా కొట్టారని, తుని ఘటనలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ప్రతిపక్షనేత, వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సామాజిక సమస్యను రాజకీయం చేసి శాంతి భద్రతల అంశంగా సృష్టించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటని ధ్వజమెత్తారు. తుని ఘటన నుంచి తాజా సంఘటనలకు వరకు సిబిఐ విచారణ జరిపిస్తే దోషులెవరో బహిర్గతమవుతుందన్నారు.

16 నుంచి ఈసెట్ కౌనె్సలింగ్

ఎచ్చెర్ల, జూన్ 10: ఈ విద్యా సంవత్సరంలో డిప్లమో పూర్తిచేసిన అభ్యర్థులు రెండో సంవత్సరం ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ అభ్యర్థులకు 16నుంచి వెబ్‌కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ విఎస్ దత్తు స్పష్టంచేశారు. 16న 7వేలు ర్యాంకు సాధించిన అభ్యర్థులకు, 17న 14వేలు, 18న 21వేలు, 19న 28వేలు, 20న చివరి ర్యాంకు వరకు సాధించిన అభ్యర్థులకు ఈ కౌనె్సలింగ్ కొనసాగిస్తామన్నారు. 17నుంచి వెబ్ ఆప్షన్ అభ్యర్థులు ఇచ్చుకోవాల్సి ఉంటుందని సూచించారు.

కొరత లేకుండా విత్తనాల పంపిణీ: ఎమ్మెల్యే

పాతపట్నం, జూన్ 10: పాతపట్నం పిఎసిఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులకు విత్తనపంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పూర్తిస్థాయిలో రైతులకు విత్తనాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మండలంలో పుగడవెల్లిగెడ్డ, కుమ్మగెడ్డ, రేణుకోడగెడ్డ వంటి సాగునీటివనరులను అభివృద్ధి పరిచే దిశలో ప్రతీ 500 మీటర్లకు ఒక చెక్‌డ్యామ్‌ను నిర్మించి భూగర్భ జలాలను అభివృద్ధి పరిచే దిశగా చర్యలు చేపడతామన్నారు.

శ్రీవారి పోటులో అగ్నిప్రమాదం

తిరుమల, జూన్ 10: తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూలు తయారుచేసేందుకు టిటిడి యాజమాన్యం శ్రీవారి ఆలయం వెలుపల ఏర్పాటుచేసిన అదనపు పోటులో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అగ్నిమంటలు చెలరేగాయి. ఇటీవల రద్దీ నేపథ్యంలో ఒకే నెలలో కోటి లడ్డూలకు పైగా తయారుచేసిన నేపథ్యంలో పోటును శుభ్రం చేసే సమయం లేకుండా వదిలేయడంతో నెయ్యికి సంబంధించిన బూజు గోడలకు అంటుకోవడం, బూందీ తయారీచేసే ప్రాంతంలో నిప్పురవ్వలు నెయ్యి బూజుకు తగలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలు చెలరేగిన మరుక్షణం వాటిని ఆర్పడానికి సిబ్బంది ప్రయత్నం చేస్తూనే అధికారులకు సమాచారం ఇచ్చారు.

వెబ్ కౌనె్సలింగ్‌లో దరఖాస్తుల పరిశీలన

గార, జూన్ 10: మండల కేంద్రంలో గల అంపోలు పేరున ఉన్న జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో శుక్రవారం వెబ్‌కౌనె్సలింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు నిర్వహించారు. స్థానిక విద్యాలయం ప్రిన్సిపాల్ గణపతిరావు పర్యవేక్షణలో టెక్కలి, ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గురుకుల విద్యాలయాల సిబ్బంది ఈ వెబ్‌కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించారు.

కంచ ఐలయ్యపై చర్య తీసుకోండి

హైదరాబాద్, జూన్ 10: కంచ ఐలయ్య షెపర్డ్ బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ, బాధ్యతారాహిత్యంగా ప్రపంచానికే గర్వకారణమైన హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నందున, తక్షణమే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మిన్ యూనిటీ ఫరెవర్, బ్రాహ్మణ సంఘ నేతలు తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మను కోరారు. ఈ మేరకు ద్రోణంరాజు రవికుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు. హిందూ సంస్కృతిని పరిరక్షిస్తున్న బ్రాహ్మణుల మనోభావాలను ఐలయ్య దెబ్బతీస్తూ, అవమానిస్తున్నారని ఇది చట్టపరమైన నేరమేనని వారు స్పష్టం చేశారు.

సామాజిక పరివర్తనకు కృషి అవసరం

శ్రీకాకుళం, జూన్ 10: సామాజిక పరివర్తన తీసుకురావడానికి సాంఘిక సంక్షేమ శాఖ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరారు. జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మాణాలను ఆమోదించింది. ఆమదాలవలస మండలం తొగరాం, పొందూరు మండలం రాకాక గ్రామాల్లో ఎస్సీ కులాల వారికి కేటాయించిన భూముల పరిస్థితులను నియోజకవర్గం అసైన్‌మెంట్ రివ్యూ కమిటీ పరిశీలించాలని కమిటీ తీర్మానించింది.

Pages