S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూపులు

ఖమ్మం, జూన్ 10: రెండురోజుల క్రితం మహబూబ్‌నగర్... తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్... నిన్న మెదక్... నేడు ఆదిలాబాద్... ఇలా అన్ని జిల్లాల్లోని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని పదవులపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. జిల్లాలో ఉన్న 500కు పైగా నామినేటెడ్ పదవుల కోసం అధికార పార్టీ నేతలు హైదరాబాద్, ఖమ్మంలలోని ప్రధాన నేతల చుట్టూ తిరుగుతూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

వామపక్షాలను కనుమరుగుచేసే శక్తులు పుట్టలేదు

కొత్తగూడెం రూరల్, జూన్ 10: అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సుజాతనగర్ గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన సిపిఎం కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టుపార్టీలను కనుమరుగుచేసే శక్తులు పుట్టలేదని స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పక్కకునెట్టి తమసొంత ఎజెండాలను అమలుచేయడానికి ఉత్సాహం చూపుతున్నారని విమర్శించారు.

కూరగాయల ధరలకు రెక్కలు

సత్తుపల్లి, జూన్ 10 : సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు కూరగాయల ధరలు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే వీటి ధరలు 50శాతం పెరగడంతో సాధారణ ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు వేసవి ఎండల తీవ్రత కూరగాయల సాగుపై పడటంతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో మార్కెట్‌కు సరిపడా కూరగాయలు రాకపోవడంతో దాని ప్రభావం ధరలపై పడింది. వారం రోజుల్లో కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి తోడు నిత్యవసర వస్తువులు ధరలు కూడా అధికంగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం తీవ్రంగా పడుతోంది.

205 నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం

ఖానాపురం హవేలి, జూన్ 10: నకిలీ విత్తనాలు విక్రయిస్తూ వ్యవసాయశాఖాధికారులకు ముగ్గురు వ్యక్తులు దొరికిన సంఘటన రఘునాథపాలెం మండలంలోని చిమ్మపుడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వ్యవసాయ శాఖ ఏడిఏ కొంగర వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిమ్మపుడి గ్రామంలో ఓ వాహనంలో తీసుకొచ్చి రైతులకు 8రకాలకు చెందిన పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారని, ఈ మేరకు స్థానికులు సమాచారం అందించారన్నారు. దీంతో తాము సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించామన్నారు.

కోదండరాంపై టిఆర్‌ఎస్ విమర్శలు తగవు

ఖమ్మం(ఖిల్లా), జూన్ 10: తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాంపై టిఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలు సరికాదని, కేంద్ర, రాష్ట్రాలు రెండేళ్ల పాలనలో చేసింది శూన్యమని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హన్మంతరావు అన్నారు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 25వ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సద్భావనయాత్రలో భాగంగా శుక్రవారం ఖమ్మంలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో విహెచ్ మాట్లాడుతూ వేలాది మంది ప్రాణత్యాగంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాపాలన అందించడంలో విఫలమైందన్నారు.

సమస్యలపై స్పందించని రైతు సంఘాలు

ఖమ్మం(జమ్మిబండ), జూన్ 10: ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పత్తి పంటను వేయవద్దని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు నిర్బంధంగా పత్తి వేయవద్దని ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. దీనిపై కొన్ని చోట్ల పోలీసులు కూడా జోక్యం చేసుకొని ప్రభుత్వ విధానాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంకంటే ముందునుంచే రైతుల సమస్యలపై ఆందోళనలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వామపక్ష పార్టీలకు చెందిన రైతు సంఘాలు ఈ ఏడాది మాత్రం మిన్నకుండిపోతున్నాయి.

రైతులకు సరిపడ విత్తనాలు అందించాలి

పెనుబల్లి, జూన్ 10: రైతులకు ఖరీఫ్ సీజన్‌లో సరిపడ విత్తనాలను, క్రిమి సంహారక మందులను, ఎరువులను సకాలంలో సక్రమంగా పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పెనుబల్లి మండల కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో రైతుకూలీ సంఘం అధ్యక్షులు పాల్వంచ డివిజన్ అధ్యక్షులు అమర్లపూడి రాము మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు విత్తనాల కోసం వ్యవసాయ పనులు మానుకొని సొసైటీల చుట్టూ పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రైతుల అవసరాలకు సరిపడ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు మార్కెట్‌లోకి తీసుకురావటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

సమస్యలపై స్పందించని రైతు సంఘాలు

ఖమ్మం(జమ్మిబండ), జూన్ 10: ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పత్తి పంటను వేయవద్దని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు నిర్బంధంగా పత్తి వేయవద్దని ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. దీనిపై కొన్ని చోట్ల పోలీసులు కూడా జోక్యం చేసుకొని ప్రభుత్వ విధానాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంకంటే ముందునుంచే రైతుల సమస్యలపై ఆందోళనలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వామపక్ష పార్టీలకు చెందిన రైతు సంఘాలు ఈ ఏడాది మాత్రం మిన్నకుండిపోతున్నాయి.

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త మండలాలు

ఖానాపురం హవేలి, జూన్ 10: పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాలో కొత్త మండలాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక టిటిడిసిలో జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటుకు ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపిడివోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల ఏర్పాటుకు ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండేలా సూచించాలన్నారు. తహశీల్దార్లు, ఎంపిడివోలు సంయుక్తంగా పరిశీలన చేసి నివేదికలు పంపించాలన్నారు. పరిపాలన సౌలభ్యాన్ని, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

Pages