S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొయ్యల రైతుల్ని కలవరపెడుతున్న వాతావరణంరొయ్యల రైతుల్ని కలవరపెడుతున్న వాతావరణం

నందివాడ, జూన్ 10: వాతావరణంలో చోటు చేసుకున్న పెను మార్పుల వల్ల రొయ్యల రైతులకు కంటి మీద కునుకు ఉండట్లేదు. శుక్రవారం ఈ విషయమై రొయ్యల సాగుపై రైతులు మాట్లాడారు. రోజంతా చల్లగా మబ్బులు పట్టి ఉండటం, ఎడతెరిపి లేకుండా చినుకులు పడుతుండడంతో చెరువుల్లో రొయ్యలకు ప్రాణ వాయువు సమస్య ఏర్పడిందన్నారు. అక్కడక్కడా చెరువుల్లో రొయ్యలు చనిపోతున్నాయన్నారు. మండలంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందని, ప్రస్తుత వాతావరణం చూసి నష్టాల భయంతో రైతులు తల్లడిల్లుతున్నామన్నారు. ఈ సంవత్సరం పంట కాల్వలు ద్వారా మంచినీటి సదుపాయం లేకపోయినా బోర్లు ద్వారా (ఉప్పు నీటి) రొయ్యల సాగు చేపట్టినట్టు చెప్పారు.

కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతర్

నెల్లూరు, జూన్ 10: తన ఆదేశాలు బేఖాతరు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ జానకి జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు, అసిస్టెంట్ డైరక్టర్ విజయను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. కాగా డిఇఓ ఆంజనేయులుకు ఇంకా మూడు నెలలే సర్వీసు ఉండడం గమనార్హం. డిఇఓ సరెండర్, ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌కు దారితీసిన కారణాలు ఇలా ఉన్నాయి. ఎఎస్‌పేట మండలం గంపర్లపాడు ఉన్నత ఇంగ్లీషు మీడియం పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పవన్‌కుమార్ వేధింపులు తట్టుకోలేక అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. పవన్ మరలా రెండో వివాహం చేసుకున్నాడు.

కాపు నాయకుల మానవహారం

బంటుమిల్లి, జూన్ 10: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అక్రమ అరెస్టును నిరసిస్తూ బంటుమిల్లిలో వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులు శుక్రవారం సాయంత్రం బంటుమిల్లి లక్ష్మీపురం సెంటరులో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల నాగేశ్వరరావు తదితరులు శాంతి యుతంగా నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడను అక్రమంగా అరెస్టు చేయటం దారుణమన్నారు. ఈ ప్రభుత్వంలో కాపులకు న్యాయం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల నాగేశ్వరరావు, చిటికనేని అబ్బులు, పి గాంధి, ఎం వెంకటేశ్వరరావు, కె ప్రేమ్, వెంకట్రావు, బాబు, పి నాగబాబు, వీరశేఖర్, డి నాగరాజు, వెంకటేశ్వరరావు, ఆంజనేయులు పాల్గొన్నారు.

అక్రమంగా రవాణా చేస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

వీరులపాడు, జూన్ 10: అక్రమంగా రవాణా చేస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యంను విజిలెన్స్ అధికారులు శుక్రవారం మండలంలోని పెద్దాపురం గ్రామ చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ఒక టాటా ఎసి, ఆటోల ద్వారా రేషన్ బియ్యం బస్తాలను లారీల్లో లోడింగ్ చేస్తుండగా విజిలెన్స్ సిఐ అపర్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావులు సిబ్బందితో దాడి చేసి బియ్యంతో సహా వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యంపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ అవినాష్, సిబ్బంది పాల్గొన్నారు.

ముద్రగడ అరెస్టుకు నిరసనగా రాష్టవ్య్రాప్త నిరసనలు

విజయవాడ, జూన్ 10: ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. తన ఇంట్లో దీక్ష చేస్తున్న ముద్రగడను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో కాపు సంఘాలు ముద్రగడకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నాయి. మరోపక్క రైలు దగ్థం చేసిన ఘటనలో అరెస్ట్‌లు, ముద్రగడ వ్యవహార శైలిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు సమర్థిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కాపుల ఆత్మీయ సభలో చంద్రబాబును కాపు మిత్రగా అభివర్ణిస్తూ తీర్మానం చేశారు.

రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతున్న జగన్

పామర్రు, జూన్ 10: దీక్షలు, ధర్నాలు పేరిట వైకాపా ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్, పామర్రు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్ల రామయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నిర్మాణంలో, ప్రజా సంక్షేమంలో విధి విధానాలతో చంద్రబాబు పాలిస్తుంటే ప్రజలను పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తూ రోడ్డెక్కటం సరికాదన్నారు. ప్రజలే త్వరలో జగన్‌కు బుద్ది చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, శంకర్‌బాబు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి, మరో 8 మందికి గాయాలు

జగ్గయ్యపేట రూరల్, జూన్ 10: మండలంలోని చిల్లకల్లు - వైరా రోడ్డులో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యాచకుడు మృతి చెందాడు, 8 మంది గాయపడ్డారు. చిల్లకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మక్కపేట వైపు నుండి వస్తున్న లారీ ఆల్ సైన్స్ స్కూల్ సమీపంలో రోడ్డు దాటుతున్న యాచకుడిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ కంగారులో స్టీరింగ్ అదుపు తప్పడంతో అదే మార్గంలో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరగడ్డ మాచవరానికి చెందిన 8 మంది గాయపడ్డారు. వీరిని 108లో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

రూ.37 కోట్లతో శ్మశానాలు, పార్కుల అభివృద్ధి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 10: పట్టణంలో శ్మశానవాటికలు, పార్కులు, డ్రైనేజిల అభివృద్ధికి రూ.37.50కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం స్థానిక 2వ వార్డు తౌడు ఫ్యాక్టరీ వద్ద గల ఐదు సమాధుల రోడ్డును సిమెంట్ రోడ్డుగా నిర్మించేందుకు మంత్రి రవీంద్ర కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పట్టణంలో ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఐదు సమాధుల రోడ్డును రూ.7.79లక్షలతో సిసి రోడ్డుగా అభివృద్ధి పర్చే పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

అఫీషియల్ కాలనీలో స్వచ్ఛ భారత్

బలగ, జూన్ 10: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు స్పందించిన అఫీషియ్ కాలనీ వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ముఖ్యమంత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి వ్యక్తిగత పరిశ్రభతతోపాటు పరిసరాల శుభ్రత చేపట్టి ఆరోగ్యకర వాతావరణానికి నాంది పలికాలని ఇచ్చిన పిలుపుతో కాలనీ వాసులు స్ఫూర్తి పొందారు. కాలనీ వాసుల స్ఫూర్తికి నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి దవళ భాస్కరరావు అండగా నిలిచి నగర పాలక సంస్థ తరుపున అండగా నిలిచి పరిశుభ్రతకు ముందుకు వచ్చే వారికి తమ సహకారం ఉంటుందని చెప్పారు.

తిరోగమన దిశలో ‘చెత్త నుండి సంపద’

సారవకోట, జూన్ 10: పారిశుద్ధ్యం కార్యక్రమాలల్లో భాగంగా ఏర్పాటు చేసిన చెత్తనుంచి సంపద ఉత్పత్తి కార్యక్రమం జిల్లాలో తిరోగమన దిశలో ఉంది. సోలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ డివిజనల్ కన్వీనర్ పి.సత్యనారాయణ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. 15 మండలాలల్లో ఈ ప్రాజెక్టు పరిమాణానికి స్థలం లభించలేదని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో పాతపట్నం, సోంపేట, మెళియాపుట్టి, కవిటి, భామిని మండలాల్లో మాత్రమే స్థలం లభ్యం కాగా ప్రాజెక్టు నిర్మాణం వివిధ దశలలో ఉన్నట్టు ఆయన తెలిపారు.

Pages