S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమల స్థాపనకు అనుమతులివ్వాలి

అనంతపురం సిటీ, జూన్ 10:జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను ఆలసత్వం లేకుండా వెంటనే మంజూరు చేయాలని జెసి బి.లక్ష్మికాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీని కాన్ఫరెన్సు హాల్‌లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కమిటీ జెసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయంతో పాటు పరిశ్రమలను ఫ్రోత్సహించాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన అన్నివసతులను సింగల్ విండో పద్దతిలో మంజూరు చేయాలన్నారు.

ఐదుగురు ఎస్‌ఐల బదిలీ

అనంతపురం సిటీ, జూన్ 10:జిల్లాలో 5 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో విఆర్ అనంతపురంలో ఉన్న ఎస్.నరేంద్ర బూపతిని బ్రహ్మసముద్రం పోలీస్టేషన్‌కు, విఆర్‌లో ఉన్న ఎం.రాజేష్‌ను కదిరి టౌన్ పోలీస్టేషన్‌కు, విఆర్‌లో ఉన్న యు.సద్గురుని కసాపురం పోలీస్టేషన్‌కు, విఆర్‌లో ఉన్న ఎం.కరుణాకర్‌ను అనంతపురం త్రీ టౌన్ పోలీస్టేషన్‌కు, అనంతపురం టుటౌన్ పోలీస్టేషన్‌లో ఉన్న పి.మహమ్మద్ రఫీని సికె పల్లి పోలీస్టేషన్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

జనావాసంలోకి నెమలి

మడకశిర, జూన్ 10 : అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన నెమలి శుక్రవారం జనావాసంలోకి వచ్చింది. పట్టణంలోని ఆదిరెడ్డిపాళ్యంలో నివాసం ఉంటున్న ఓ రైతు గడ్డివామి వద్దకు చేరింది. అటవీ ప్రాంతంలో సరైన ఆహారం లేకపోవడంతో నివాస ప్రాంతంలోకి వచ్చినట్లు స్థానికులు భావించారు. నెమలికి వివిధ రకాల ఆహార పదార్థాలను అందించారు. అయితే కుక్కల బెడద కారణంగా నెమలిపై ఎక్కడ దాడి చేశాయోనన్న ఆందోళన స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వచ్చి నెమలిని అడవిలో వదిలేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

హిందూపురం, జూన్ 10 : ఎమ్మె ల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శుక్రవారం స్థానిక టిడిపి నాయకులు, పిఎల్‌ఎన్ గ్రూపుల అధినేత పల్లా లక్ష్మీకుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో మెగా రక్తదాన శి బిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా 120 మంది యువకులు రక్తదానం చేశారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాలకృష్ణ జన్మదిన సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా వందలాది మంది అభిమానులు రక్తదానం చేయడం ఆదర్శప్రాయమన్నారు. అలాగే ఎమ్మెల్యే నివాస ప్రాంగణంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

నాగదేవతలకు పూజలు

పెద్దపప్పూరు, జూన్ 10:పవిత్ర పుణ్యక్షేత్రమైన అశ్వర్థనారాయనస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆలయ చైర్మన్ నాగిరెడ్డి నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతలను ప్రతీష్ఠించి యేడాది అయిన శుభసందర్భంగా ప్రథమ వార్సికోత్సవం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. వివిద అలంకరణలతో పూజలందుకుంటున్న నాగదేవతలకు అర్చకులు సునీల్‌శర్మ అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు స్వామి వారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. నాగదోషం ఉన్న వ్యక్తలు ఇక్కడ ప్రతీష్ఠించిన నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేయిస్తే నాగదోషం తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతారని అర్చకులు పేర్కొన్నారు.

నీటికుంటలో పడి మహిళ మృతి

పరిగి, జూన్ 10 : మండల పరిధిలోని పి.నరసాపురానికి చెందిన అనిత (30) శుక్రవారం నీటి కుంటలో పడి మృతి చెందింది. గ్రామ సమీపంలో ఉన్న నీటికుంట వద్దకు అనిత బట్టలను ఉతికేందుకు వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన అక్కడే కొందరు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఊపిరాడక మృతి చెందింది. భర్త రామచంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడి అనుమానాస్పద మృతి

తేనెటీగల దాడి..

ఉరవకొండ, జూన్ 10 : తేనెటీగలు దాడి చేయడంతో పదిమంది గాయపడిన సంఘటన మండలంలోని పెన్నోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న బగరిగుండ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని మోపిడి, అనంతపురం తదితర గ్రామాల నుంచి అనేక మంది భక్తులు బగరిగుండ్ల వద్ద ఉన్న నరసింహస్వామి ఆలయం వద్ద దాసంగాలు పెట్టడానికి చేరుకున్నారు. అయితే అక్కడే ఉన్న కొంతమంది చెట్లపై ఉన్న తేనెటీగల తట్టపై రాళ్లు వేయడంతో తేనెటీగలు ఒక్కసారిగా భక్తులపై దాడి చేశాయి. ఈ దాడిలో మోపిడి గ్రామానికి చెందిన సరస్వతి, కొట్టాలపల్లికి చెందిన లక్ష్మీదేవి, ఉరవకొండకు చెందిన ఆదినారాయణ, అనంతపురం పట్టణానికి చెందిన చక్రవర్తితో పాటు మరి కొంతమంది గాయపడ్డారు.

తగ్గిపోతున్న పశు సంపద!

అనంతపురం, జూన్ 10 : జిల్లా నెలకొంటున్న వరుస కరవుల నేపథ్యంలో ఏ ఏటికి ఆ ఏడు పశు సంపద తగ్గిపోతూనే ఉంది. జిల్లాలో నెలకొంటున్న వర్షాభావ పరిస్థితులతో పంటలు సరిగా పండటం లేదు. దీంతో భారీగానే పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. అంతేగాకుండా ఆఖరికి తాగునీటికి సైతం కటకటలాడాల్సిన పరిస్థితి. అటవీ ప్రాంతాల్లో సైతం జీవాలకు గ్రాసం లభ్యం కాని దుస్థితి. ఏటా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చెరువుల్లో గ్రాసం పెంపకం, రైతులకు గ్రాసం విత్తనాలు ఉచితంగా సరఫరా చేయడం వంటి చర్యలు చేపడుతున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. దీంతో వేసవిలో గ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తుండటం ప్రతిఏటా పరిపాటిగా మారింది.

ఏటిఎం నుంచి దర్జాగా చోరీ

ఖైరతాబాద్, జూన్ 10: ఏటిఎం మిషన్ నుంచి డబ్బులు అపహరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి వెంకటేశ్వరరావు, ఏసిపి వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లా తోగుంట మండలానికి చెందిన మారెడ్డి సుధీర్‌రెడ్డి (23) నగరంలోని బికె.గూడలో నివాసం ఉంటున్నాడు. ఇతను ఏటిఎం సెంటర్లలో నగదు నింపే బ్రింక్స్ సెక్యూరిటీ సంస్థలో విధులు నిర్వహించి మానేశాడు. ఇతని స్నేహితుడు ఎల్లారెడ్డి కూడా నగరంలోని మరో సంస్థలో ఇదే తరహా విధులు నిర్వహించేవాడు.

13న వికారాబాద్‌లో ప్రజావాణి

హైదరాబాద్, జూన్ 10: వికారాబాద్‌లోని మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 13న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలు తెలుపుకనేందుకుగాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజావాణికి వివిధ శాఖాధిపతులు హాజరుకానున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Pages