S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

శామీర్‌పేట, జూన్ 10: ప్రధానమంత్రి పంటల బీమా పథకం, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర్లు, మినుములు, వేరుశేనగ, పసుపు పంటలకు ఈ బీమా పథకం వర్తించనుందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో మొక్కజొన్న పంటను గ్రామం యూనిట్‌గా వరి, జొన్న కంది, పెసర, మినుము, పసుపు పంటలను మండలం యూనిట్‌గా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

బాలకేంద్రాలు, బాలభవన్‌లు అభివృద్ధి చెందాలి

వికారాబాద్, జూన్ 10: బాలకేంద్రాలు, బాలభవన్‌లు అభివృద్ధి చెందాల్సిన అవసరముందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక సత్యభారతి ఫంక్షన్ హాలులో జవహర్ బాలకేంద్రం వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేట్, కార్పొరేట్‌ల కారణంగా బాలకేంద్రాలు కనుమరుగవుతున్నాయని చెప్పారు. వేసవి శిక్షణ శిబిరాలను ప్రోత్సహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వికారాబాద్ బాలకేంద్రం ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

పది దాటితే పరేషానే!

హైదరాబాద్, జూన్ 10: పేరుకే మహానగరం..రాత్రి పది గంటలు దాటిందంటే చాలు న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి వెళ్లేందుకు ఒక్క ఆర్టీసి బస్సు కూడా అందుబాటులో ఉండదు. మరోవైపేమో ప్రయాణికుల సౌకర్యమే తమ లక్ష్యమంటూ ప్రకటనలు చేస్తున్న ఆర్టీసి అధికారులు రాత్రి పూట రైళ్లు, ట్రావెల్స్ బస్సులు, బస్ స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు తరలి వెళ్లేందుకు అవసరమైన సంఖ్యలో బస్సులను నడపలేకపోతున్నారు.

డబ్బుల కోసం స్నేహితుడి హత్య

జీడిమెట్ల, జూన్ 10: డబ్బుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ చోటుచేసుకుని స్నేహితున్ని హత్య చేసిన నిందితున్ని దుందిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దుందిగల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాలానగర్ జోన్ ఇన్‌చార్జి డిసిపి సాయిశేఖర్, పేట్‌బషీరాబాద్ ఏసిపి అశోక్‌కుమార్, సిఐ వెంకటేశ్వర్లు నిందితుని వివరాలను వెల్లడించారు. ఐడిపిఎల్ కాలనీ, దిల్‌ఖుష్‌నగర్‌లో నివాసముండే సయ్యద్ సమీర్ (22) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తాడు. కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గ జిల్లా కత్నూర్ గ్రామానికి చెందిన హన్మంత్‌రాయ్ దయానంద్ (22) క్లీనర్‌గా పనిచేస్తాడు.

మేడ్చల్‌కు త్వరితగతిన గోదావరి జలాలు సరఫరా చేయాలి

మేడ్చల్, జూన్ 10: మేడ్చల్ ప్రాంతానికి త్వరితగతిన గోదావరి జలాలను సరఫరా చేయాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, మైనారిటీ అధ్యక్షుడు ఆజ్మత్‌ఖాన్, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, కుమార్ యాదవ్ తదితరులు శుక్రవారం మిషన్ భగీరథ పథకం ఎండి దానకిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. సచివాలయంలోని ఎండి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించి నాయకులు గోదావరి జలాల సరఫరా విషయమై ఆయనకు వివరించారు.

దీప్తి, వ్యూహ గాన మాధుర్యం

హైదరాబాద్, జూన్ 10: అమృత వర్షిణి మ్యూజిక్ అకాడమీ పదో వార్షికోత్సవ సంబరాలలో భాగంగా శుక్రవారం రవీంద్రభారతిలో సంగీత గురువు దీప్తి, శిష్యురాలు వ్యూహ తమ గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గంభీర నాటరాగంలో ఉత్తుకోటి వెంకట సుబ్బయ్య భాగవతార్ కృతి ‘విగ్నరాజం భజే..’ ప్రారంభించారు. ఆనందభైరవి రాగంలో ‘మరివేరే గతి ఎవరమ్మ..’ శ్యామశాస్ర్తీ రచనను అద్భుతంగా గానం చేశారు. గురువు దీప్తి అంధ కళాకారిణి అయినప్పటికీ ఎందరో శిష్యులను తయారు చేశారు. కళాకారులను సినీ దర్శకుడు ఎస్‌వి కృష్ణారెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సివి రాములు అభినందించారు.

ఫసల్ బీమా యోజనతో ప్రయోజనం

వికారాబాద్, జూన్ 10: వికారాబాద్ మండలంలోని రైతులు ప్రధానమంత్రి ఫసల్‌భీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి వినె్సంట్ వినయ్‌కుమార్ కోరారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వం జాతీయ వ్యవసాయ బీమా పథకం, నూతన జాతీయ వ్యవసాయ బీమా పథకం, వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న పంటకు హెక్టారుకు 50 వేల రూపాయల బీమాకు అసలు ప్రీమియం 3500 రూపాయలు కాగా రైతుల వాటా 1000 రూపాయలని తెలిపారు.

బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి

కీసర, జూన్ 10: బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ కె.చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా నాగారం, చీర్యాల గ్రామాల్లో ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం విధ్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో డబ్బులు ఖర్చు చేసేదాని కన్నా ప్రభుత్వ పాఠశాలలు ఎంతో మేలని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. చీర్యాల సర్పంచ్ లావణ్యశ్రీనివాస్, ఎం ఇఓ శశిధర్, ఉప సర్పంచ్‌లు బి. శ్రీనివాస్, బి.

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చిరువ్యాపారులు సహకరించాలి

ఉప్పల్, జూన్ 10: జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చిరువ్యాపారులు అధికారులకు సహకరించాలని డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌బి, ట్రాఫిక్ పోలీసులతో కలిసి చిరు వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఫుట్‌పాత్ కబ్జాలతో నిత్యం తలెత్తే ట్రాఫిక్ సమస్యతో వచ్చిపోయే వాహనాదారులు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో రెడ్, గ్రీన్‌జోన్‌లను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారిలో రెడ్‌జోన్, కాలనీల రహదార్లలో గ్రీన్‌జోన్‌లను ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

కార్మికులకు మెరుగైన జీవన విధానాన్ని కల్పించాలి

జీడిమెట్ల, జూన్ 10: కార్మికులకు మెరుగైన జీవన విధానాన్ని కల్పించాలని, ఎళ్లవేళలా వారికి అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. గాంధీనగర్‌లోని రెక్స్నార్డ్ యూరోఫ్లెక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపిన వివేక్ కార్మికులకు రూ.10800 వేతన ఒప్పందాన్ని కుదిర్చారు. ఒప్పందపు పత్రాన్ని యాజమాన్యం చేతులమీదుగా అందుకున్నారు. వివేక్ మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల యాజమాన్యం కార్మికులకు కాలానుగుణంగా జీతభత్యాలను పెంచాలని సూచించారు. కార్మికులు సంతోషంగా ఉంటేనే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

Pages