S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

గచ్చిబౌలి, జూన్ 10: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రారంభమైన మాదిగ విద్యార్థుల చైతన్య సైకిల్ యాత్రను ప్రారంభించారు. తెలంగాణ శాసనసభ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినా ప్రయత్నాలు చేయలేదని అన్నారు. అఖిలపక్షాన్ని సిఎం కేసిఆర్.. ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అధికారం లేని సమయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన బిజెపి.. ఇప్పుడు నిజాయాతీని నిలబెట్టుకోవాలని అన్నారు.

హరితహారానికి కళాకారులు అకుంఠిత దీక్షతో కదలాలి

హైదరాబాద్, జూన్ 10: హరితహారం ప్రచారానికి కళాకారులు అకుంఠిత దీక్షతో పాల్గొనాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో తెలంగాణ కళాకారుల సమీక్ష సమావేశం శుక్రవారం రవీంద్రభారతిలో జరిగింది. రామన్న మాట్లాడుతూ కళాకారులు ఓ వర్గానికి, పార్టీకి చెందినవారు కాదని సైమైఖ్యతా భావంతో అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. వృక్ష సంపద తగ్గితే మానవ సమాజం మనుగడ కోల్పోతుందని చెప్పారు. ఒకేరోజు కోటి మొక్కలను నాటాలని ప్రణాళిక తయారు చేస్తున్నామని వివరించారు. మొక్కల పెంపకంపై అవగాహన సదస్సుల్లో పాల్గొన్న సాంస్కృతిక సారధి కళాకారులను రామన్న అభినందించారు.

సైబరాబాద్‌లో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందికి ప్రోత్సాహం

గచ్చిబౌలి, జూన్ 10: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందికి కమిషనర్ సివి ఆనంద్ ప్రోత్సాహక బహుమతులను అందించారు. శాంతిభద్రతలు, నేర, ట్రాఫిక్, పరిశోధన ఎస్‌బి భాగాలలో ప్రతిభ చూపిన 153 మందికి బహుమతులను అందించారు. ఆఫీసర్స్ సిబ్బంది రెండు విభాగాలు చేసి బహుమతులు అందించారు. 11 మంది ఇన్స్‌పెక్టర్లు, 34 మంది ఎస్‌ఐలు, 4 ఎఎస్‌ఐలు, 21 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 61 మంది పోలీసులు, నలుగురు మహిళా పోలీసులు, ఆరుమంది హోంగార్డులు, ఇద్దరు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, ఒక సీనియర్ అసిస్టెంట్ నగదు పురష్కారాలు అందించారు.

సికింద్రాబాద్ కోర్టులో న్యాయవాదుల నిరసన

అల్వాల్, జూన్ 10: తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని సికింద్రాబాద్ న్యాయవాదుల జెఎసి నాయకుడు కొమురయ్య చెప్పారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని కోర్టుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగకుండా జెఎసి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనలో భాగంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 42 మంది జడ్జిలు తెలంగాణ ప్రాంతానికి అప్షన్ పెట్టుకోవటంతో తెలంగాణ వారికి రాబోయే 30 సంవత్సరాల వరకు జడ్జీలు ఆయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినా న్యాయవ్యవస్థలో తెలంగాణ వారికి మళ్లీ అన్యాయం జరుగుతుందని వివరించారు.

రంగారెడ్డి జిల్లాలో బదిలీల పర్వం ప్రారంభం

హైదరాబాద్, జూన్ 10: రంగారెడ్డి జిల్లాలో బదిలీల పర్వం మొదలైంది. జిల్లాలో అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలు ఉండటంతో క్షేత్ర స్థాయిలో పని చేసే అధికారులకు న్యాయం జరిగేలా ప్రతిష్టాత్మకంగా ఎ,బి,సి,డి విభాగాలుగా ప్రాంతాలను విభజించి పట్టణ ఎక్కువ కాలం పని చేసిన వారిని గ్రామీణ ప్రాంతాలకు అక్కడ పని చేసే వారిని గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే అవకాశం కల్పిస్తూ బదీలీలు చేశారు. ఈ క్రమంలో గత సంవత్సరం విఆర్‌ఒలను బదిలీ చేసేన తరహలోనే శుక్రవారం 267 మంది పంచాయితీ కార్యదర్శులను కౌనె్సలింగ్ ద్వారా బదిలీ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులకు విందు

హైదరాబాద్, జూన్ 10: మహానగర పాలక సంస్థకు పేరు ప్రతిష్ఠలు తెచ్చే పారిశుద్ధ్య విభాగంలో విధి నిర్వహణలో చిత్తశుద్ధిని కనబర్చిన కార్మికులకు కమిషనర్ బి. జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా కితాబునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కార్మికులకు ఆయన తన చాంబర్‌లో ప్రత్యేకంగా తేనేటీ విందును కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికుల యోగక్షేమాలను సైతం కమిషనర్ అడిగి తెలుసుకోవటం పట్ల కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కమిషనర్ తన ఛాంబర్‌లో పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి విందుఇవ్వటం జిహెచ్‌ఎంసి చరిత్రలోనే మొట్టమొదటి సారి.

కళ్లద్దాల కెమెరాలు ప్రారంభం

గచ్చిబౌలి, జూన్ 10: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విభాగానికి కళ్లద్దాల కెమెరాలను కమిషనర్ ఆనంద్ అందించారు. దేశంలో మొదటిసారి ఐ వార్న్ కెమెరాలను సైబరాబాద్‌లో ప్రవేశపెట్టారు. గతంలో బాడీ కెమెరాలతో మంచి ఫలితాలు రావడంతో కళ్లద్దాల కెమెరాలకు శ్రీకారం చుట్టారు. ఏడు కెమెరాలను సిటిపి అందించింది. 32 జిబి డాటా సామర్థ్యం కలిగి 21 గంటల ఆడియో వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉంది. కిట్ బ్యాగ్‌లు, స్టేషన్‌లో ఉపయోగించే కంప్యూటర్లు, ట్యాబ్‌లను కమిషనర్ ఆనంద్ అందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

నగరంపై సౌదీ మృగాళ్ల కన్ను

హైదరాబాద్, చార్మినార్, జూన్ 10: వారంతా ఒకప్పడు బాగా బతికిన వారే..! పేదరికంతో.. పొట్ట చేతపట్ట్టుకుని కుటుంబ పోషణ కోసం పరదేశానికి వెళ్లటమే వారి పాలిట శాపంగా మారింది. ఎన్నో బాధలతో కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం కోసం ఆశ్రయిస్తే ఏకంగా సౌదీ అరేబియాకు అమ్మేశారంటూ రాజేంద్రనగర్‌కి చెందిన బాధిత మహిళ ఉస్నాబేగం కన్నీరు పెట్టింది. పాతబస్తీలో ఇలాంటి మహిళలు ఎందరో..! సౌదీలో ఉద్యోగాల కోసం వెళ్లిన మహిళలు షేక్‌ల వేధింపులు తాళలేక తప్పించుకుని, భారత రాయబార కార్యాలయం సహకారంతో స్వదేశానికి చేరుకున్నారు.

తేలని లెక్క!

హైదరాబాద్, జూన్ 10 మహానగరంలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు, జంక్షన్ల వద్ధ దర్శనమిస్తున్న బిచ్చగాళ్ల సమస్య జిహెచ్‌ఎంసికే గాక, వివిధ ప్రభుత్వ శాఖలకు సవాలుగా మారింది. వీరిలో ఎక్కువ మంది స్థానికేతరులు ఉండటం, ఎప్పటికపుడు వీరి సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకోవటంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న అంశంపై వివిధ శాఖల అధికారుల తర్జనభర్జన చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించి నగరాన్ని బెగ్గర్‌లెస్ సిటీగా తీర్చిదిద్దేందుకు గడిచిన పదిహేనళ్లలో వివిధ ప్రభుత్వ శాఖలు సుమారు అరడజను సార్లు అధ్యయనాలు చేసి, క్షేత్ర స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశాయి. అయినా ఏ ఒక్కటీ ఫలితాలివ్వలేదు.

సకాలంలో ఎరువులు, విత్తనాలు

కరీంనగర్, జూన్ 10: జిల్లాలో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు అందుబాటులో ఉందని తెలిపారు. బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిధులు, రుణాలను అందించడానికి చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.

Pages