S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హలాలన్నీ పొలాల వైపే..!

ఎల్లారెడ్డిపేట, జూన్ 10: ఖరీఫ్ సీజన్‌కు కర్షకులు శ్రీకారం చుట్టారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 12వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. పైగా రైతులు ప్రతి యేటా 9.5వేల హెక్టార్ల వరకు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడం కారణంగా అధిక శాతం వర్షాభావ పంటలే సాగు చేస్తున్నారు. వర్షం పడగానే విత్తు నాటేందుకు రైతులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పెరిగిన ధరల కారణంగా గత ఏడాది కంటే ఈసారి హెక్టారుకు పాతిక శాతం పెట్టుబడులు అధికం కానున్నాయని రైతులు పేర్కొంటున్నారు.

రెండేళ్లలో చుక్కనీరు ఇవ్వలే..

సుల్తానాబాద్, జూన్ 10: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినప్పటికీ శ్రీరాంసాగర్ కాలువ ద్వారా రైతులకు చుక్క నీరు ఇవ్వలేదని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు విమర్శించారు. శుక్రవారం సుల్తానాబాద్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వర్షాలు పడే సమయంలో మంత్రి శ్రీరాంసాగర్ కాలువలను పరిశీలిస్తూ కాలువల అభివృద్ధికి 200 కోట్లు మంజూరయ్యాయనటం సరికాదన్నారు. కాకతీయ కెనాల్‌కు నిధులు మంజూరైతే శ్రీరాంసాగర్ కాలువకు మంజూరయ్యాయంటూ రైతులను మోసం చేయటం తప్ప మరేమిలేదన్నారు. రైతుల పక్షాన తమ పార్టీ, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

దసరాకు రాజాద్రి..

వేములవాడ, జూన్ 10: కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కొలిక్కివచ్చింది. రానున్న విజయదశమి వరకూ కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. ఈమేరకు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. కొత్త జిల్లాలతోపాటు మండలలాను కూడా పునర్‌వ్యవస్థీకరించనున్న దృష్ట్యా కరీంనగర్ దసరా నాటికి మూడు జిల్లాలుగా రూపుమారనున్నది. గతంలో ప్రకటించినట్లుగానే జిల్లాలో జగిత్యాలను జిల్లా చేయడంతో పాటు సిరిసిల్ల కేంద్రంగా శ్రీరాజరాజేశ్వరస్వామి పేరిట రాజాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అవగాహనకు వచ్చినట్లు తెలిసింది.
కెసిఆర్ దీక్ష ఇక్కడి నుంచే..

‘మా మండలాలను విలీనం చేయొద్దు..’

కరీంనగర్ టౌన్, జూన్ 10: జిల్లాలో కొనసాగుతున్న చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలను కొత్తగా ఏర్పాటు చేయనున్న సిరిసిల్ల జిల్లాలో కలుపవద్దంటూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి చొప్పదండి, రామడుగు మండలాలు కరీంనగర్‌లోనే కొనసాగుతాయని, గంగాధరపై కొంత సందిగ్ధం ఉందని, దానిని కూడా పరిపాలనా సౌలభ్యం కోసం కరీంనగర్‌లో ఉంచేవిధంగా చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని హామీ ఇచ్చినట్లు అఖిలపక్షం నేతలు తెలిపారు.

వరస దాడులతో విత్తన వ్యాపారులు బెంబేలు

జగిత్యాల, జూన్ 10: ప్రభుత్వం కో-మార్కెటింగ్ విత్తన విక్రయాలపై విధించిన నిషేధాన్ని తుంగలో తొక్కి విత్తన వ్యాపారులు కొనసాగిస్తున్న గుట్టు వ్యాపారంపై ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన వైఖరితో విత్తన వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే తనిఖీ బృందాల వరస దాడులు మంచి ఫలితాలు ఇవ్వడం పట్ల రైతుల్లోను అనందం వ్యక్తం అవుతుంది. కో-మార్కెటింగ్ విధానంను పూర్తిగా నియంత్రించేందుకు విత్తన వ్యాపారులపై ప్రత్యేక తనిఖీ బృందాల దాడుల్లో విత్తనాలు వెలుగు చూడడం సంబంధిత శాఖ అధికారులను కూడా అశ్చర్యానికి గురిచేస్తుంది.

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ, జూన్ 10: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వారి పిల్లపాపలతో స్వామివార్లను దర్శించుకోడానికి ఇక్కడికి తరలివచ్చారు. ఉదయం ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం అంతరాలయంలో కొలువుదీరిన స్వామివార్లను, అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారి ధర్మదర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది.

నేటి నుంచి ఎన్టీపిసి ఐదో యూనిట్ షట్‌డౌన్

గోదావరిఖని, జూన్ 10: రామగుండం ఎన్టీపిసి విద్యుత్ సంస్థలోని 5వ యూనిట్ శనివారం రోజు నుంచి వార్షిక మరమ్మతులు జరుపుకోనుందని తెలుస్తుంది. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్ షట్ డౌన్‌తో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడనుంది. సుమారు నెల రోజుల పాటు 5వ యూనిట్ వార్షిక మరమ్మతులు జరుపుకోనున్నట్లు సమాచారం.

లొంగిపోయిన మావోయిస్టుకు 5 లక్షల సాయం

కరీంనగర్ టౌన్, జూన్ 10: హుస్నాబాద్ మండల సుభాష్‌నగర్‌కు చెందిన లొంగిపోయిన మావోయిస్టు దళకమాండర్ బుర్ర భాగ్య అలియాస్ అరుణకు ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ అందజేశారు. లొంగిపోయిన మావోయిస్టు బుర్ర భాగ్య (18) అజ్ఞాతంలో కొనసాగి చత్తీస్‌ఘడ్, మహారాష్టల్రోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసి గత అక్టోబర్ 9న లొంగిపోయిన విషయం విధితమే. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ ప్రభుత్వానికి లొంగిపోయి పునరావాస చర్యలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కొత్త జిల్లా ఏర్పాటుపై అధికారులు తలమునకలు

నిజామాబాద్, జూన్ 10: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తెరాస ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో సమగ్ర నివేదికను అందించేందుకు ఆయా జిల్లాల అధికారులు సమాయత్తం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాను రెండుగా విభజిస్తూ, నూతనంగా కామారెడ్డి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైంది. ఈ నెల 7, 8వ తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు అందడంతో నూతనంగా ఏర్పాటవుతున్న జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను సమగ్ర అధ్యయనం చేసి ఈ నెల 20వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

నిజాంసాగర్, జూన్ 10: జిల్లాలో రోడ్డుప్రమాదాలు జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి సారిగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. నేరాలు ఘోరాల గురించి స్థానిక ఎస్‌ఐ అంతిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ విలేఖరులతోమాట్లాడారు. రోడ్డుప్రమాదాలు జరుగకుండాపోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో12 మంది మృతి చెందిన సంఘటన జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించిందన్నారు.

Pages