S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండో రోజుకు ముద్రగడ దీక్ష

రాజమహేంద్రవరం, జూన్ 10: కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగిస్తున్న దీక్ష శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. కిర్లంపూడిలో ఆమరణ దీక్షను భగ్నం చేసిన అనంతరం ముద్రగడను పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ వైద్య పరీక్షలను నిరాకరించారు. ఆసుపత్రిలో వైద్యులు ఎంత నచ్చజెప్పినప్పటికీ ముద్రగడ అంగీకరించలేదు. దీంతో అతికష్టం మీద రక్త పరీక్ష నిర్వహించారు. సుగర్ లెవెల్స్ తగ్గుతున్నట్టు శుక్రవారం వైద్యులు ధ్రువీకరించారు.

బిజెపితోనే అభివృద్ధి

సూర్యాపేట, జూన్ 10: కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బిజెపితోనే అభివృద్ధి తెలంగాణ సాధ్యమని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఎక్కడ కుటుంబ పాలన ఉన్నా అక్కడ అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’లో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లా, సూర్యాపేటలో నిర్వహించిన సభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై ధ్వజమెత్తారు.

అమరావతి డిజైన్లపై ఉన్నతస్థాయి కమిటీ

హైదరాబాద్, జూన్ 10: అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి ప్రభుత్వం తెరతీసింది. 900 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు ఆరుగురు సభ్యులతో ఉన్నతాధికార కమిటీని నియమించింది. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, సిఆర్‌డిఎ కమిషనర్, సిఆర్‌డిఎ ప్లానింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. వివిధ సంస్థలు ఇచ్చే డిజన్లు, ఇతర పాలనాపరమైన అంశాలపై ఈ కమిటీ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటుంది.

లైన్ క్లియర్.. తరలింపునకు తొలగిన అడ్డంకులు

విజయవాడ, జూన్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుకున్నది సాధించుకున్నారు. జూన్ 27 నాటికి ఉద్యోగులంతా అమరావతికి వచ్చితీరాలన్న ఆయన పట్టుదలను నెరవేర్చుకుంటున్నారు. స్థానికత, 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, వౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక సమస్యలను ఉద్యోగులు సాకుగా చూపి, అమరావతి రావడానికి మొరాయించారు. అయితే, ప్రభుత్వం ఈ సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చింది. 30 శాతం హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వం కొద్దిరోజుల కింద ట ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిం దే. ఉద్యోగుల ప్రధాన సమస్య అయిన స్థానికత అంశానికి రాష్టప్రతి ఆమోదముద్ర వేయడంతో ఆ అడ్డంకి తొలగిపోయింది.

విరివిగా మొక్కలు నాటాలి

రాప్తాడు, జూన్ 10:ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటినపుడే అనంతపురం జిల్లాను హరిత అనంతపురంగా మారుతుందని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మైనారిటీ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ కోన శశిధర్‌లు హాజరయ్యారు. ముందుగా మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ కోన శశిధర్‌లు మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. అనంతరం వారు మాట్లాడుతు జిల్లాలో మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ప్రతి వ్యక్తి 3మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు.

ఎస్సీల అభ్యున్నతకి కృషి

అనంతపురం సిటీ, జూన్ 10:ఎస్సీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని, చదువుకున్న షెడ్యూల్డు కులాల (ఎస్సీ) నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ(స్కిల్ డెవలప్‌మెంట్) ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ జూపూడి ఫ్రభాకరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ అందించే రుణాల లబ్ధిదారుల అవకాహన సదస్సును నిర్వహించారు.

తాగునీటి ఎద్దడి రానీకండి

అనంతపురం, జూన్ 10 : జిల్లాలో ఎక్క డా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సత్వరం చర్యలు చేపట్టాలని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆర్‌డబ్ల్యు ఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని మున్సిపల్ గెస్ట్‌హౌస్‌లో తాగునీరు, చెరువుల మరమ్మతులపై చిన్ననీటి పారుదల శాఖ, ఆర్‌డబ్ల్యు ఎస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన నీటి సరఫరా ప్రాజెక్టులైన శ్రీరామిరెడ్డి, జెసి నాగిరెడ్డి, పిబిఆర్ నుంచి తాగునీట సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తి నీటి ఎద్దడి ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించినా ఫలితం లేకుండా పోతోందన్నారు.

త్వరలో 85 ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు

అనంతపురం, జూన్ 10 : వాతావరణంలో నెలకొనే మార్పులను నమోదు చేయడంతోపాటు వర్షం శాతాన్ని కొలిచేందుకు త్వరలో 85 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను (ఎడబ్ల్యు ఎస్) మంజూరు కానున్నట్లు జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సుదర్శనం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మొత్తం 134 ఎడబ్ల్యుఎస్‌లు ఉన్నట్లు తెలిపారు. వీటిలో కేవలం 12 స్టేషన్లలో కేవలం వర్షపాతం మాత్రమే నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని సైతం ఆధునీకరించే అవకాశాలున్నాయన్నారు.

చిట్‌ఫండ్ కంపెనీ కుచ్చుటోపీ!

అనంతపురం, జూన్ 10 : సకాలంలో చీటీదారులకు డబ్బు చెల్లిస్తామని నమ్మబలికి నెలలు గడిచినా చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తూ కుచ్చుటోపీ పెట్టబోయిన ఓ చిట్‌ఫండ్ కంపెనీపై బాధితులు శుక్రవారం నగరంలోని టూ టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని సాయినగర్ ఐదో క్రాస్‌లోని ప్రత్యూన్ ఎన్‌క్లేవ్‌లో భావన చిట్‌ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని నిర్వహిస్తున్నారు. నగరంతోపాటు ధర్మవరం, హిందూపురంలో వీరి శాఖలు ఉన్నాయి. ఇటీవల హిందూపురంలోని ఈ సంస్థ బ్రాంచిలో నెలకొన్న అవకతవకలపై చీటీదారులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో సీజ్ చేశారు.

పర్యాటకులను ఆకర్షించేలా శిల్పారామాన్ని తీర్చిదిద్దాలి

అనంతపురం సిటీ, జూన్ 10:పర్యాటకులను ఆకర్షించేలా శిల్పారామాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ కోనశశిధర్ సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర శివార్లులోని శిల్పారామాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రస్తుతం జరిగిన పనులను అవసరమైన వసతులను గురించి సంబందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా శిల్పారామంలో పచ్చదనాన్ని పెంపొందించాలని టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాల్, ఏఓ శివప్రసాద్‌లను ఆదేశించారు. సందర్శకులను ఆకర్షించేలా ల్యాండ్ నేస్‌లను ఏర్పాటు చేయాలన్నారు. శిల్పారామం గేట్ నుండి హైవే వరకు 20లక్షలతో రోడ్డుకు నిధులు మంజూరు చేస్తామని, త్వరితగతిన రోడ్డు నిర్మించాలన్నారు.

Pages