S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగ నేతల్లో చీలిక చిచ్చు?

హైదరాబాద్, జూన్ 10:సచివాలయం తరలింపువ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. తరలింపును కనీసం ఆరునెలల వరకూ వాయిదా వేయాలని సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం కోరుతుండగా, నిర్ణీత గడువులోగా ఉద్యోగులు వస్తారని ఏపి ఎన్జీఓ నేత అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెబుతున్నారు.

రెండేళ్ల తర్వాత అభివృద్ధిపై చర్చ..

కడప,జూన్ 10: జిల్లాపరిషత్ పాలక వర్గం ఏర్పాటై రెండేళ్లుగడచినా వైకాపా పాలనలో ఉండటం, తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావడం, టిడిపికి బలం లేకపోయినా ఏ ఒక్కసమావేశం కూడా అభివృద్ధిపై చర్చ జరగకుండా అర్థాంతరంగానే ముగుస్తూ వచ్చింది. శుక్రవారం జెడ్పిసమావేశ మందిరంలో 7వ సర్వసభ్య సమావేశం జరగగా రసాభాస, అరుపులు, కేకల మధ్యసమావేశం జరిగినా టీ కప్పులో తుఫాన్ లాగా సమావేశం పూర్తిస్థాయిలో కొనసాగింది.

పంట సంజీవిని లక్ష్యాలను అధిగమించాలి

నందలూరు, జూన్ 10:రాజంపేట నియోజకవర్గానికి కేటాయించిన 15 వేల పంట సంజీవిని, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను పూర్తి చేసి లక్ష్యాలను అధిగమించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుస్తామని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చింతలకుంట గ్రామంలో ఇంకుడు గుంతల తవ్వకం పనుల్లో మేడా స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు భూగర్భజలాల పెంపునకు చేపట్టిన ఇంకుడుగుంతలు, పంట సంజీవిని త్రవ్వకాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. ఏ గ్రామంలో కూడా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంకుడుగుంతలు, పంట సంజీవిని పనుల్లో పాల్గొనడం హర్షణీయమన్నారు.

వాడివేడిగా జడ్పీ సమావేశం!

కడప,జూన్ 10: నగరంలోని జిల్లా పరిషత్ సభాభవన్‌లో శుక్రవారం జరిగిన 7వ జెడ్పి సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. వైకాపా, తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలపై పరస్పరం ధూషణల మధ్య సమావేశం జరిగింది. సమాశానికి అధ్యక్షత వహించిన వైకాపా నేత జెడ్పి చైర్మన్ గూడూరు రవి కూడా గతంలో ఎన్నడూ నోరువిప్పని ఆయన శుక్రవారం జరిగిన సమావేశంలో తన స్వరాన్ని పెంచారు. వేదికపై జెడ్పి చైర్మన్, కన్వీనర్‌గా కలెక్టర్ కెవి సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, శాసన మండలిడిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వవిప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డిలు ఆశీనులయ్యారు.

ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు

ప్రొద్దుటూరు, జూన్ 10: స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు లభిస్తున్నాయని, ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మున్సిపల్ ఛైర్మెన్ ఉండేల గురివిరెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ బద్వేలి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధిని, సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న మెరుగైన వైద్య సేవలకు ఫలితంగా ఆసుపత్రికి ఎ-గ్రేడ్ వచ్చిందన్నారు.

పర్యాటక కేంద్రంగా పెద్ద దర్గా

కడప, జూన్ 10: జిల్లాలోని పెద్దదర్గాను రాష్ట్రంలో నెంబర్ వన్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారని కలెక్టర్ కెవి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా జెడ్పి 7వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద దర్గాను మూడు ఎకరాల విస్తీర్ణంలో సుందరీకరణగా తీర్చిదిద్దుతామని, అందుకు చుట్టుపక్కల నివాస ప్రాంతమున్నవారితో త్వరలో సంప్రదింపులు చేస్తామని తెలిపారు. అలాగే హజ్‌హౌస్‌కు రూ.12కోట్లు నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయని త్వరలో టెండర్లు పిలిచి పనులను వేగవంతం చేస్తామన్నారు.

ఎమ్మెల్యే యరపతినేని దందా యదార్థమే

హైదరాబాద్, జూన్ 10: మైనింగ్ శాఖ అనుమతులు లేవు. హైకోర్టు ఆదేశాలకు విలువ లేదు. కాని విలువైన సున్నపు రాయి ఖనిజాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరులను ప్రేరేపించి అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు గండిపడుతున్నా అధికార యంత్రాంగంలో ఉలుకు పలుకు లేదు. చివరకు హైకోర్టు కూడా అక్రమ మైనింగ్‌ను ఆపాలని ఆదేశాలు ఇచ్చినా గుంటూరు జిల్లా కలెక్టర్ లేదా మైనింగ్ శాఖ అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది.

బ్యాంక్ రుణాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలి

రాజంపేట, జూన్ 10:పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలను సక్రమంగా వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని విప్ మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ సభాభవన్‌లో 154 మంది లబ్దిదారులకు రూ. 1.24 కోట్ల సబ్సిడీ రుణ అర్హత పత్రాలు, చెక్కులను మేడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి రూ. 16 వేల కోట్ల లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు.

పెండింగ్ కేసులు పరిష్కరించండి : ఎఎస్పీ

పులివెందుల, జూన్ 10: డివిజన్ పరిధిలోని పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించాలని, క్రైమ్ రేటును కూడా తగ్గించాలని పులివెందుల ఎఎస్పీ అన్బురాజన్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో రీజనల్ పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు పెండింగ్‌లో ఉన్న ప్రతి కేసును పరిష్కరించాలన్నారు. అలాగే ఎక్కడా కూడా క్రైమ్ రేటు పెరగకుండా చూడాలన్నారు. అసాంఘీక కార్యకలాపాలు, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి నిలిపి ప్రతి గ్రామంలోను ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతి గ్రామానికీ పోలీసులు రోజూ వెళ్లి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వుండాలన్నారు.

త్వరలో విస్తరణ?

గుంటూరు, జూన్ 10: కృష్ణా పుష్కరాల తర్వాత ఏపి కేబినెట్ విస్తరణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీపరంగా మహానాడు, మహాసంకల్ప దీక్షలు, ఈ నెలలో రాజధానికి పాలనావ్యవస్థ తరలింపుప్రక్రియ పూర్తిచేసి, ఆపై విస్తరణ అంశంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాలోచనలు జరపనున్నట్లు తెలిసింది. ప్రధానంగా పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు పదవి ఇవ్వాలని ముఖ్యనేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Pages