S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోనసీమలో బంద్ పాక్షికం

అమలాపురం, జూన్ 10: ముద్రగడ దీక్ష భగ్నం కారణంగా టిబికె జెఎసి ఇచ్చిన పిలుపుమేరకు కోనసీమలో బంద్ పాక్షికంగా జరిగింది. శుక్రవారం ఉదయం కొద్దిగా బంద్ ప్రభావం కనిపించినా అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు యధావిధిగా సాగాయి. బస్సులు, ఆటోలు యధావిధిగా తిరిగాయి. అయితే ముమ్మిడివరం, కొత్తపేట, పి గన్నవరం మండలాల్లో బంద్ ప్రభావం కనిపించింది. అమలాపురంలో బంద్ పాక్షికంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి. ఆర్టీసీ బస్సులను నడిపారు. అయితే అమలాపురం పట్టణంలో కొంతమంది తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించగా మరికొంతమంది తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించుకున్నారు.

ప్రభుత్వ భూములు సర్వే

సీతానగరం, జూన్ 10: ప్రభుత్వ భూముల పరిశీలనలో భాగంగా శుక్రవారం మండలంలోని కాటవరం గ్రామ పంచాయతీ పరిధిలోగల కొండను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ పరిశీలించారు. ఆ కొండ 96 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ఆ భూమిని ప్రభుత్వం అవసరం వచ్చిన సమయంలో ఉపయోగించుకోవచ్చునని జెసి తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వేలో భాగంగా ఈ గ్రామానికి వచ్చినట్టు జెసి తెలిపారు. ఈ సందర్భంగా ఆ సమీపంలోనే పనిచేస్తున్న ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనిచేస్తున్న కూలీలకు సక్రమంగా సొమ్ములు అందుతున్నాయోలేదో అడిగి తెలుసుకున్నారు. అలాగే మహిళలే పనిచేస్తున్నారేమిటని ఎపిఒను జెసి ప్రశ్నించారు.

ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ - క్లీనర్ మృతి

రేణిగుంట, జూన్ 10: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న సంఘటనలో లారీలో ఉన్న క్లీనర్ మృతిచెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. వేరుసెనగ కాయల లోడుతో కడప నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ ఆంజనేయపురం, మామండూరు మధ్యలో మరమ్మతులకు గురై రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొంది. వాస్తవానికి చెన్నైకి వెళ్లే లారీ డ్రైవర్ షేక్‌బాబుజాన్‌బాష తన ముందు వెళ్తున్న లారీని దాటి వెళ్లడానికి ప్రయత్నించి కుడివైపున రోడ్డుపక్కన ఉన్న లారీని ఢీకొన్నాడు. దీంతో లారీ ఎడమవైపుకూర్చొని ఉన్న క్లీనర్ కడపజిల్లాకు చెందిన నాగముని (45) అక్కడి కక్కడే మృతిచెందాడు.

‘సంచారజాతుల సమస్యలు పరిష్కరించాలి’

ఛిత్తూరు, జూన్ 10 : రాష్ట్రంలోని సంచారజాతులు, విముక్త జాతల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంచార జాతుల సంఘం నేతలు మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడారు. రవి మాట్లాడుతూ ఐదేళ్లుగా సంచార జాతులు చేసిన పోరాటాలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల అభివృధ్ది కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అయితే తమ జాతుల సమస్యల పట్ల అటు ప్రభుత్వంగాని, ఇటు అధికారులు గాని స్పందిచక పోవడం దారుణమన్నారు.

ప్రేమ జంట తెచ్చిన తంటా...!

చిత్తూరు, జూన్ 10 : ప్రేమ జంట వివాహ వివాదం చినికిచినికి గాలివానగా మారి ఒకరి ఆత్మహత్యకు దారి తీయగా, ఇటు పోలీసులను అటు బాధిత కుటుంబాల మధ్య చిచ్చురేపింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు నగరం ఇరువారంకు చెందిన ఓ ప్రేమ జంట ఈ నెల 6న అదృశ్యమైంది. దీంతో వారి ఆచూకి కోసం యువతి తల్లిదండ్రులు టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువారంకు చెందిన జోసఫ్ సెల్వరాజ్ (42) ను విచారణ నిమిత్తం మంగళవారం తమ స్టేషనుకు పిలిపించుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మొదటి భార్య ఇంటికి వెళ్లిన శెల్వరాజ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

న్యూట్రిన్ కార్మికులకు రాజంపేట ఎంపి ఆర్థిక సాయం

చిత్తూరు, జూన్ 10: చిత్తూరు నగరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులకు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తనవంతు సాయం అందజేశారు. లాకౌట్‌లో ఉన్న ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలంటూ గత 185 రోజులుగా కర్మాగారం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న కార్మికులను ఆర్థికంగా ఆదుకునే చర్యల్లో భాగంగా రెండు రోజుల క్రితం రూ 2.75 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సాయాన్ని వైకాపా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పివి గాయత్రీదేవి మంగళవారం కార్మికుల దీక్షా స్థలానికి చేరుకుని కార్మికులకు అందజేశారు.

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

తిరుమల, జూన్ 10: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమలకు చేరుకుని పద్మావతి అతిధిగృహాల సముదాయాల్లో బసచేశారు. ఉదయానే్న శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని తిరుమలేశుని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలుకగా జె ఇ ఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి ఇ ఒ కోదండరామారావు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.

హైదరాబాద్ ఔషధ నగరి

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీకి హైదరాబాద్ ఫార్మాసిటీ అని పేరు పెట్టింది. ఫార్మా సిటీ ఏర్పాటుకు పరిశ్రమల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ భూమి లభ్యతనుబట్టి ఫార్మా సిటీ సరిగ్గా ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారో ప్రకటిస్తారు. 12,500 ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది నుంచి ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ ఫార్మా కంపెనీలు ఇక్కడ తమతమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించారు.

మొక్కులు తీర్చని సర్కారు

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ ప్రభుత్వం నెరవేరని హామీల్లో సిఎం మొక్కులు కూడా చేరిపోయాయి. తెలంగాణ ఏర్పడితే ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రలోని ప్రసిద్ధ దేవాలయాల్లో మొక్కులు, కానుకలు సమర్పించుకుంటామని రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలోనే కెసిఆర్ మొక్కుకున్నారు. ఆయన మొక్కుకున్నట్టే తెలంగాణ ఆవిర్భావంతోపాటు, తెరాస సర్కారే అధికారంలోకి రావడంతో తన మొక్కుల విషయాన్ని బయటపెట్టారు. మొక్కులు తీర్చుకునేందుకు ఏడాది కిందటే ఫిబ్రవరి 24, 2015లోనే జీవో జారీ చేసి, నగల తయారీ కోసం రూ.5.59 కోట్లు విడుదల చేసింది. మూడు నెలల్లో నగలు తయారుచేసి ఇవ్వాల్సిందిగా తయారీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.

యాగంతో గృహప్రవేశం

జగదేవ్‌పూర్, జూన్ 10: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను వచ్చే శ్రావణ మాసంలో ప్రారంభిస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఇళ్లను ప్రారంభించిన రోజే యాగం నిర్వహించి అత్యంత వేడుకగా గృహప్రవేశాలను నిర్వహిస్తామన్నారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెండు దత్తత గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో సిఎం మాట్లాడారు. డబుల్‌బెడ్ రూం ఇంటితో పాటు ప్రతి ఇంటికి 24 గంటలూ తాగునీరు అందిస్తామన్నారు. ఆగస్టు 4 తర్వాత మంచి ముహూర్తం ఉన్నందున గృహప్రవేశాలు నిర్వహించుకుందామన్నారు.

Pages