S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకన్నపాలెంలో కొండచిలువ హల్‌చల్

మనుబోలు, జూన్ 9:మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం ఓ కొండచిలువ హల్‌చల్ చేసింది. గ్రామ సమీపంలోని కండలేరు వాగు నుండి సుమారు 10 అడుగల పైన ఉన్న కొండచిలువ రోడ్డుపైకి వచ్చింది. ఈ ప్రాంతంలో కొందరు కూలీలు పని చేస్తుండడంతో కొండచిలువను చూసి భయంతో పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు భారీగా చేరుకుని పెద్దకర్రలతో కొండచిలువను చంపివేశారు.

కోటి రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగల పట్టివేత

తడ, జూన్ 9: ఆంధ్రా నుండి తమిళనాడుకు తరలిస్తున్న కోటి రూపాయల విలువ చేసే 38 ఎర్రచందనం దుంగలను తడ పోలీసులు పట్టుకున్నారు. సూళ్లూరుపేట సిఐ విజయకృష్ణ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రా నుండి తమిళనాడుకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న రెండు వాహనాలు బివి పాలెం గ్రామం లోపల ఆగి ఉన్నాయంటూ తడ పోలీసులకు ముందస్తు సమాచారం అందిందన్నారు. వెంటనే పోలీసులు బివి పాలెం చెట్టు కింద ఆగి వున్న వాహనాల దగ్గరకు వెళ్లే లోపల ఎర్రచందనం తరలించే స్మగ్లర్లు పోలీసులను చూసి పరార్ అయ్యారని తెలిపారు. ఈ వాహనాలను క్రేన్, జెసిబి సహాయంతో తడ పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు.

రెండేళ్ల బాబు పాలన సున్నా

ఆత్మకూరు, జూన్ 9: గడచిన రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో సగటు ప్రజానీకానికి ఒరిగిందేమీ లేదని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి విమర్శించారు. గురువారం ఆత్మకూరు మండలంలోని బట్టేపాడు, నువ్వూరుపాడు గ్రామాలతో సహా పురపాలక సంఘ పరిధిలోకి వచ్చే నరసాపురంల్లో ఆయన జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎనె్నన్నో హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కాక వాటిని సజావుగా అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారని తప్పుబట్టారు. రుణమాఫీపై బాబు తొలి సంతకం చేయగా, ఆ ప్రక్రియ నేటికీ ఓ కొలిక్కి రాలేదన్నారు.

బదిలీలపై ఉద్యోగుల్లో ఉత్కంఠ

నెల్లూరు, జూన్ 9: రాష్టవ్య్రాప్తంగా ఈనెల 10 నుండి 20వ తేది వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరగాల్సి ఉంది. గురువారం రాత్రి వరకూ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడకపోవడంతో బదిలీలు జరుగుతాయా, లేదా అనే మీమాంసలో అధికారులు ఉన్నారు. జిల్లాలో కింది స్థాయి నుంచి పైస్థాయి ఉన్నతాధికారి వరకు ఉత్కంఠ నెలకొంది. జిల్లాస్థాయి అధికారులు ఇప్పటికే రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

పంట సంజీవనిపై రైతులకు అవగాహన కల్పించాలి

నెల్లూరు, జూన్ 9: జిల్లాలో పంట సంజీవని కార్యక్రమంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి నిర్దేశించిన పంట గుంటల నిర్మాణాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం జానకి తెలిపారు. గురువారం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశం హాలులో పంట సంజీవని అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంట సంజీవని కార్యక్రమంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించడంతోపాటు నిర్దేశించిన పంట గుంటల నిర్మాణాల లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

నెల్లూరు మండలాభివృద్ధికి కృషి:ఆదాల

నెల్లూరు రూరల్, జూన్ 9: జిల్లాలోని నెల్లూరు మండలాన్ని అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో ఉంచుతానని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం నెల్లూరు మండల పరిధిలోని కొండ్లపూడి సంగం, ములుముడి, సౌత్‌మోపూరు గ్రామాల్లో పర్యటించి సుమారు కోటి రూపాయలు విలువ చేసే సిమ్మెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.

కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ బాలు కుటుంబం

నెల్లూరు కలెక్టరేట్, జూన్ 9: ప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురువారం తన కుటుంబ సభ్యులతో కలెక్టర్ ఎం జానకిని ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వచ్చే నెల 4న జిల్లా కేంద్రంలో నిర్వహించే తన జన్మదిన వేడుకలకు కలెక్టర్‌ను ఆహ్వానించారని సమాచారం. ఇప్పటివరకు పలు కార్యక్రమాలకు కలెక్టర్ అందించిన సహకారానికి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు బాలు సమీప బంధువు సాలూరు వాసూరావును బాలు జన్మదినోత్సవం సందర్భంగా విజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాలకు హాజరుకావాలని ఆమెను ఆయన కోరారు.

‘రాష్ట్భ్రావృద్ధే ప్రభుత్వ ధ్యేయం’

నెల్లూరు కలెక్టరేట్, జూన్ 9: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని టిడిపి నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నర్తకి సెంటర్‌లో గురువారం నిర్వహించిన మహా సంకల్ప (విజయోత్సవ) సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఇందుకోసం కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయటం శోచనీయమన్నారు.

నెలాఖరులోగా ఇ-కార్యాలయ వ్యవస్థ విధి విధానాలు పూర్తిచేయాలి

నెల్లూరు కలెక్టరేట్, జూన్ 9: ఈనెలాఖరులోగా ఇ-కార్యాలయ విధి విధానాల తీరుతెన్నులు అమలుపై అవగాహనతో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న అన్నారు. వచ్చేనెల నుండి అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలు ఇ-కార్యాలయ విధానంలో ఉండాలన్నారు. గురువారం హైదరాబాద్ నుండి జాయింట్ కలెక్టర్‌లతో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తొలి విడతగా అన్ని జిల్లాల్లో కొన్ని శాఖలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు.

తుని సంఘటనలో బాధితులను విడిపించాలని అడగటం ముద్రగడకు సమంజసమా...?

వైకాపా దిద్దుబాటు చర్యలు
* నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి
ఇన్‌చార్జుల నియామకం
* అద్దంకి ఇన్‌చార్జిగా గరటయ్య
ఆంధ్రభూమి బ్యూరో

Pages