S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రమ అరెస్టులపై ప్రజాసంఘాల ఆగ్రహం

ఖమ్మం(ఖిల్లా), జూన్ 9: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఖమ్మం పర్యటన సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం పట్ల ఇఫ్టూ, పివైఎల్, పివొడబ్ల్యూ తదితర ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ రామనర్సయ్య విజ్ఞాన కేంద్రం నుండి ప్రదర్శన నిర్వహించి బైపాస్‌రోడ్డు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు రామయ్య, సివై పుల్లయ్య, శిరోమణి తదితరులు మాట్లాడుతూ జిల్లాలో గుట్టలుగా పేరుకు పోయిన విద్యారంగ సమస్యలను పరిష్కారించాలని ప్రశ్నిస్తారేమోనన్న భయంతో అర్థరాత్రి విద్యార్థులను అరెస్ట్ చేయడం అమానుషమన్నారు.

పకడ్బందీగా చేపట్టాలి

కర్నూలు, జూన్ 9:స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి ఇంటింటి వివరాలు సేకరించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. నగరంలోని సునయన ఆడిటోరియంలో గురువారం స్మార్ట్ పల్స్ సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకూ మొదటి విడత, జూలై 6 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న స్మార్ట్ సర్వే ఇంటింటి వివరాల సేకరణ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలోని క్రీడా ప్రాంగణాలు ఆగస్టు నాటికి పూర్తి

నంద్యాల, జూన్ 9: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న క్రీడా ప్రాంగణాలన్నీ జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29 నాటికి పూర్తి చేస్తామని శాప్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియంను శాప్ ఓఎస్‌డి నాగరాజు, డిఎస్‌డిఓ సత్యనారాయణలతో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇండోర్ స్టేడియంలో రాత్రిపూట క్రీడలు ఆడేందుకు, నిర్వహించేందుకు వౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నంద్యాల క్రీడా ప్రాంగణాన్ని ఆగస్టు 29 నాటికి పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.

మఠంలో గురు పుష్యయోగం

మంత్రాలయం, జూన్ 9: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం గురు పుష్యయోగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురు పుష్యయోగం పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. బృందావన ప్రతిమను, ఉత్సవ మూర్తి ప్రహ్లాద రాయల తోపాటు వెండి పతాకం, వెండి ధ్వజంను బంగారు పల్లకిలో ఉంచి భాజాభజంత్రీల మధ్య మఠం ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి మూల బృందావనానికి బంగారు కవచం, కర్ణాటకలోని బెంగళూరు నుండి తెచ్చిన వివిధ రకాల పూలతో బహు సుందరంగా అలంకరించారు.

సమష్టి కృషితో క్రీడల అభివృద్ధి

కర్నూలు అర్బన్, జూన్ 9:క్రీడా సం ఘాలు, క్రీడాభిమానుల సమష్టి కృషి తో క్రీడల అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్‌వి.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జాతీయ క్రీడలకు శిక్షణ కేంద్రాల పరిశీలన పర్యటనలో భాగంగా గురువా రం ఆయన జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియం లో జిల్లా ఒలింపిక్ సంఘం, ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వివిధ క్రీడా సంఘాల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వైభవంగా మహాచండీయాగం

కోవెలకుంట్ల, జూన్ 9:పట్టణంలోని షిరిడీ సాయి దేవాలయం సమీపంలో గురువారం విశ్వశాంతి కోసం మహాచండీ యాగాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా తొలుత వివిధ రకాల పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అలాగే పంపాక్షేత్ర పీఠాధిపతి గోవిందానంద సరస్వతీస్వామి భక్తులకు ప్రవచనాలు బోధించారు. భక్తులు హోమంలో పాల్గొనేందుకు యాగశాలలు, హోమగుండాలు ఏర్పాటు చేశారు. సద్‌బ్రాహ్మణుల వేదమంత్రాల ఘోషతో యాగ ప్రదేశం మార్మోగింది. యాగంలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారం రోజుల పాటు జరిగే ఈ యాగం ముగిసేంత వరకూ కోవెలకుంట్ల పట్టణంలో మాంసాహార విక్రయం నిలిపివేశారు.

సంగమేశ్వరునికి నూతన శోభ

పాములపాడు, జూన్ 9:కొత్తపల్లి మండలంలో వెలసిన రూపాల సంగమేశ్వరుని ఆలయానికి మరమ్మతులు, శిథిలమైన ఉప ఆలయాల పునఃనిర్మాణానికి టెండర్లు పూర్తి చేయడంతో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి గురువారం భూమిపూజ చేశారు. డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక చొరవతో ఈ పనులకు రూ. 90 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఈ పనులను భువనేశ్వర్‌కు చెందిన జాతీయ పురస్కార శిల్పి అనిల్‌కుమార్ మహారాణి, 40 మంది శిల్ప నిపుణులతో చేపడుతారని ఆమె తెలిపారు.

పెరగనున్న సాగు..

కర్నూలు సిటీ, జూన్ 9 : ఈ ఖరీఫ్‌లో రైతులు వేరుశెనగ, కంది, వరి పంటలను ఎక్కువగా సాగు చేయటానికి సిద్ధమవుతున్నారు. గత కొనే్నళ్లుగా పత్తి పంటను సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జిల్లాలో పత్తి పంట సాధారణంగా 1,62,981 హెక్టార్లలో సాగవుతున్నట్లు అంచనా. అయితే 2014లో 3,06,058 హెక్టార్లలో, గత ఏడాది 2,00,123 హెక్టార్లలో సాగైంది. అయితే ఈ ఏడాది మరింత తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి పంటకు తెగుళ్లు అధికంగా రావటమే కాకుండా పెట్టబడి కూడా ఎక్కువగా వస్తుంది. దిగుబడి మాత్రం అంతంత మాత్రంగా ఉండటంతో రైతులు పత్తిపంట సాగు చేయటానికి ఇష్టపడటం లేదు.

జలాశయాలు నింపుతాం..

కర్నూలు, జూన్ 9 : జిల్లాలోని అన్ని జలాశయాలను ఈ ఏడాది నీటితో నింపుతామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. డిప్యూటీ సిఎం కెఇ గురువారం సుంకేసుల జలాశయం నుంచి కెసి కాలువకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ జిల్లాలోని వెలుగోడు, అలగనూరు, అవుకు, గోరుకల్లు జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తామన్నారు. ఈ 4 జలాశయాలను ఒక్కసారి నింపితే 30 టిఎంసిలకు పైగా నీరు నిల్వ చేయవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని స్పష్టమవుతోందని, అదే జరిగితే హంద్రీ-నీవా కాలువ ద్వారా పడమర ప్రాంతంలోని 100 చెరువులకు నీరు సరఫరా చేస్తామన్నారు.

నగరంలో రాత్రి పదిన్నరకు దుకాణాలు బంద్ చేయాల్సిందే

నెల్లూరు, జూన్ 9: నగరంలో రాత్రి పదిన్నర తర్వాత మద్యం, ఇతర అన్ని రకాల దుకాణాలు, హోటళ్లను మూసివేయించాలని నగర పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తన ఛాంబర్‌లో జరిగిన ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం అనంతరం ఆయన విలేఖరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అసాంఘిక, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా నిఘాను పటిష్టపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నగరంలోని వ్యాపారులు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Pages