S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే వికాస్‌పర్వ్

ఒంగోలు అర్బన్,జూన్ 9:ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెట్టరా అని రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. గురువారం స్థానిక కాపుకల్యాణ మండపంలో భారతీయజనతాపార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో వికాసపర్వ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.

వైద్యుడు రత్నంపై నిర్భయ కేసు నమోదు చేయాలి

చీరాల, జూన్ 9: మహిళా హౌస్‌సర్జన్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఒంగోలు రిమ్స్ డాక్టర్ బంకా రత్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ చీరాల డివిజన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక గడియార స్తంభం సెంటరులో గురువారం వైద్యుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జి ఆదిత్య, జి ఏసుబాబు మాట్లాడుతూ ప్రజలకు వైద్యం అందించాల్సిన వైద్యుడే ఇటువంటి ఘటనలకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా

పొన్నలూరు, జూన్ 9: మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చాగంరెడ్డి ఇంద్రసేనారెడ్డి (10) ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. చాగంరెడ్డి జయరామిరెడ్డి, పార్వతిల మొదటి సంతానం అయిన ఇంద్రసేనారెడ్డి తన స్నేహితులు నలుగురితో కలిసి గొరిశలేరువాగులో రైతులు మేత కోసం జెసిబితో తీసిన గుంతలో సరదాగా ఈతకు దిగారు. ఈ నేపథ్యంలో ఈత కొడుతుండగా ఇంద్రసేనారెడ్డి పూడికలో ఇరుక్కుపోగా, పక్కనే ఉన్న పిల్లలు కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి కేకలు విని బాలుడిని బయటకు తీయగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

ఘనంగా అమ్మవారి ప్రతిష్ఠాపన

పాయకాపురం, జూన్ 9: ఎంతో వైభవంగా గత 23 సంవత్సరాల నుండి స్థానిక ప్రకాష్‌నగర్ సెంటర్‌లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రతిష్ఠాపన ఉత్సవం ఈ సంవత్సరం కూడా కన్నుల పండుగగా జరిగింది. గత 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరగడంతో గురువారం ఉదయం నుండి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, కుంభాభిషేకం, బోనాల్ని భక్తులు గావించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ అమ్మవారి తీర్థ ప్రసాదాల్ని భక్తులకు అందజేశారు. ఈ ఉత్సవంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తాబాద వెంకటేశ్వరరావు, కార్యదర్శి జి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

పుష్కర పనుల పూర్తికి చర్యలేమిటి ..?

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 9: కృష్ణాపుష్కరాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైనందున నగరంలో జరుగుతున్న పుష్కర పనుల పూర్తికి అధికారులు ఏయే చర్యలు తీసుకొంటున్నారంటూ విఎంసి కమిషనర్ వీరపాండియన్ విఎంసి ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. ఈ గురువారం ఉదయం నగరంలోని మూడు సర్కిల్ కార్యాలయాల్లో జరుగుతున్న పుష్కర పనులను స్వయంగా పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఇంకా కొన్ని అభివృద్ధి పనుల్లో నెలకొన్న జాప్యం పట్ల కాంట్రాక్టర్ల తీరుతోపాటు అధికారుల తీరుపై మండిపడ్డ అయన సత్వరమే ఆయా పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సిటీ స్క్వేర్ పనుల ప్రతిపాదనలు తయారుచేయాలి

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 9: నగరంలో సిటీ స్క్వేర్, కెనాల్ ఫ్రంట్ డిజైన్ పనులకు సంబంధించి ప్రతిపాదనలు తయారుచేయాలని చైనా ప్రతినిధుల బృందాన్ని జిల్లా కలెక్టర్ బాబు.ఎ కోరారు. గురువారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్‌తో కలిసి చైనా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. వీటిలో ప్రధానంగా సిటీ స్క్వేర్, హౌసింగ్, దుర్గా ఘాట్, పవిత్ర సంగమం ఘాట్, కెనాల్ ఫ్రంట్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. వీటిలో ఇప్పటికే దుర్గాఘాట్, పవిత్ర సంగమం ఘాట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.

భూసేకరణ పెండింగ్ ఫైల్స్ తక్షణమే పరిష్కరించాలి

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 9: జిల్లాలో వివిధ శాఖల్లో భూసేకరణకు సంబంధించి పెండింగ్ ఫైల్స్‌ను తక్షణం పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, రహదారులు, బిల్డింగ్‌లు, రైల్వేస్, జలవనరులశాఖకు సంబంధించిన కృష్ణా లెఫ్ట్ ఫ్లడ్ బ్యాంక్ బుడమేరు, డ్రైనేజీ, మున్సిపాల్టీలు వంటి శాఖలకు భూసేకరణపై సంబంధిత శాఖల రెవెన్యూ అధికారులతో గురువారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో గత సమావేశం నుండి నేటి వరకు సంబంధిత ఫైల్స్ ప్రగతిని జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

20 నుండి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 9: ఈనెల 20 నుండి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరుగుతుందని సర్వే శాస్ర్తియబద్ధంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జిల్లాలో చేయనున్న సమగ్ర కుటుంబ సర్వేపై గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పుష్కర సెల్‌లో సంబంధిత ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఈనెల 20 నుండి 40 రోజులపాటు జరిగే సమగ్ర కుటుంబ సర్వేను అందుబాటులో ఉన్న సమస్త సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఆధార్, రేషన్, ఓటరు కార్డులతో పాటు గ్యాస్, బ్యాంకు ఖాతాలను ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుందన్నారు.

నగరం నుంచే ‘రాష్ట్ర రవాణా’

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 9: రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో లాజిస్టిక్స్ విభాగంలో ప్రధాన భూమిక వహించే రాష్ట్ర రవాణాశాఖ కార్యాలయం విజయవాడలో ప్రారంభించటం ఎంతో అభినందనీయమని కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో భవన సముదాయంలో రాష్ట్ర రవాణాశాఖ కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ప్రాంతం నుంచి జూన్ 27 నాటికి కార్యకలాపాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో రవాణాశాఖ రాష్ట్ర కార్యాలయం తరలింపును రెండు దశల్లో పూర్తిచేయటం జరుగుతుందని తెలిపారు.

పుష్కర ఘాట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 9: పదకొండు మెట్లతో కూడిన టెంప్లేట్ డిజైన్ నమూనాలతో ఒకే దఫా 15 మీటర్ల మెట్లను నిర్మించే విధానాన్ని మరింత వేగవంతం చేసి పుష్కర ఘాట్ల నిర్మాణాలను పూర్తిచేయాలని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. గురువారం సాయంత్రం నగరంలో నిర్మితమవుతున్న పద్మావతి, కృష్ణవేణి, సీతమ్మపాదాలు, దుర్గా, మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో గల జరుగుతున్న ఘాట్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 12న ప్రారంభమయ్యే పుష్కరాలకు రెండు నెలల వ్యవధి మాత్రమే ఉంన్నందున ప్రతి గంటకు చేయాల్సిన పనులపై ప్రగతి నివేదికలను సిద్ధం చేసుకోవాలన్నారు.

Pages