S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట గెలిచిన హిల్లరి

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పార్లమెంటు-కాంగ్రెస్- ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించిన చారిత్రక పరిణామం. నరేంద్ర మోదీ ప్రసంగ ప్రభావ తరంగాలు విస్తరిస్తుండిన సమయంలోనే అంతర్జాతీయ దృష్టిని మరింతగా ఆకట్టుకున్న మరో మహా పరిణామం అమెరికాలో సంభవించింది. హిల్లరీ రోథమ్ క్లింటన్ సాధించిన సంస్థాగత ఘన విజయం ఈ సమాంతర పరిణామం. వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్షపదవికి జరుగనున్న ఎన్నికలలో హిల్లరీ క్లింటన్ డెమొక్రటిక్ పార్టీ నామాంకిత-నామినీ-గా పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది. అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలు డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ.

రామయ్యకు పట్ట్భాషేకం

భద్రాచలం, జూన్ 9: పుష్యమి సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామికి గురువారం పట్ట్భాషేకం నిర్వహించారు. ఉదయం గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. అనంతరం అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా స్వామికి బాలభోగం నైవేద్యంగా సమర్పించారు. తర్వాత ఉత్సవమూర్తులను బేలమండపానికి తీసుకెళ్లారు. అక్కడ స్వామికి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన జరిగాయి. నిత్యకల్యాణ క్రతువును భక్తులతో చేయించారు. స్వామికి కల్యాణం జరిగాక పట్ట్భాషేక క్రతువు భక్తి ప్రవత్తులతో ప్రారంభించారు. రామదాసు చేయించిన నగలను ధరింప చేసి స్వామిని సింహాసనంపై కూర్చుండబెట్టి కిరీటం, రాజదండం, రాజముద్ర తదితర అలంకరణలు చేశారు.

మీసేవా కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు

బోనకల్, జూన్ 9: మండల పరిధిలోని మీసేవా కేంద్రాల వద్ద రైతులు సాదా బైనామా ద్వారా ఆన్‌లైన్ చేయించుకునేందుకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండల పరిధిలోని కలకోట, ముష్టికుంట్ల, బోనకల్, బ్రాహ్మణపల్లి, గోవిందాపురం గ్రామాల్లో మీసేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదెకరాలలోపు ఉచిత రిజిస్ట్రేషన్ కోసం రైతులు తమ దరఖాస్తులతో మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఆన్‌లైన్ సమస్యలను తలెత్తుతున్నాయని చెబుతూ మీసేవా కేంద్రాల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

జమలాపురం ఆలయ ఇఓగా రమణమూర్తి

ఎర్రుపాలెం, జూన్ 9: జమలాపురం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ఇవొగా ఎవి రమణమూర్తి గురువారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. గత రెండు నెలల నుండి ఆరోగ్య కారణాలతో సెలవుపై వెళ్ళారు. ఆయన స్థానంలో అన్నపురెడ్డిపల్లి ఇవొ నల్లపోతు సుబ్బారావుఇప్పటి వరకు అధనపు విధులు నిర్వర్తించారు. తిరిగి రమణమూర్తి రావడంతో ఆయనకు బాద్యతలు అప్పగించారు.

ఏజెన్సీ దళితుల ఆత్మఘోష ప్రభుత్వానికి పట్టదా?

భద్రాచలం టౌన్, జూన్ 9: భద్రాచలం ఏజెన్సీలోని దళితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరడం లేదని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్‌రాజ్ పేర్కొన్నారు. ఏజెన్సీ దళితుల ఘోష ప్రభుత్వానికి పట్టడం లేదా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఏఎంసీ కాలనీలో గురువారం జరిగిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారిని ఏజెన్సీ దళితుల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని, 3 ఎకరాల భూ పంపిణీ పథకం ఏజెన్సీలో అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు.

క్రీడలతో ఆరోగ్యకరమైన సమాజం

కొత్తగూడెం, జూన్ 9: క్రీడలు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం ద్వారా రేపటి ఆరోగ్యమైన సమాజానికి వారు ఉపయోగపడేలా దోహదపడుతాయని సింగరేణి జిఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ ఆనందరావు అన్నారు. సింగరేణి కార్పోరేట్ ఏరియా ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం గురువారం స్థానిక ప్రకాశంస్టేడియంలో జరిగింది. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కంపెనీ ఉద్యోగులకే కాకుండా పరిసర ప్రాంత కుటుంబాలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఎర్రుపాలెం ట్రాన్స్‌కో ఎఇపై విజిలెన్స్ విచారణ

ఎర్రుపాలెం, జూన్ 9: ఎర్రుపాలెం ట్రాన్స్‌కో ఎఇ రవీంధర్‌బాబుపై రైతులు ట్రాన్స్‌కో సిఎండికి ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం ట్రాన్స్‌కో విజిలెన్స్ సిఐ కె జనార్థన్‌రెడ్డి ఎర్రుపాలెంలో విచారణ నిర్వహించారు. మండల పరిధిలోని భీమవరం రెవెన్యూ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాళ్ళ వెంకటేశ్వర్లు తదితర 15మంది రైతులు కలసి ఒక లక్షరూపాయలు, రామన్నపాలెం గ్రామానికి చెందిన యరమల ఆదిరెడ్డి తదితర 12మంది రైతులు తమ గ్రామాల్లో ఉన్న 23కెవి ట్రాన్స్‌ఫారాలను మార్చి 63కెవి ట్రాన్స్‌ఫారాలు ఇచ్చేందుకు ఎఇ రవీంధర్‌బాబుకి 70వేలు ఇచ్చినట్లు గత నెలలో సిఎండికి ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో వౌలిక వసతుల కల్పనే ధ్యేయం

ఖానాపురం హవేలి, జూన్ 9: ప్రభుత్వ విద్యా సంస్థల్లో వౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. గురువారం స్థానిక టిటిడిసిలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లాలోని విద్యా రంగ పరిస్థితులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమిక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ జిల్లాలో పాఠశాలల్లో వౌళిక సదుపాయాల కోసం 187.35 కోట్లు అవసరమని విన్నవించారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల వారీగా పాఠశాలల అవసరాల గురించి వివరించిన కలెక్టర్ జిల్లాలో మరిన్ని మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

విద్యా వ్యవస్థ పటిష్ఠతకు కృషి

ఖమ్మం, జూన్ 9: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. గురువారం స్థానిక టిటిడిసి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 20కోట్ల వ్యయంతో విద్యారంగాన్ని పటిష్టం చేయనున్నామన్నారు. గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాల వల్ల విద్యా వ్యవస్థ గాడి తప్పిందని, దానిని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.

మారిన మావోల రణరీతి

భద్రాచలం, జూన్ 9: మావోలు తమ రణరీతిని మార్చారు. తమ ఆయుధ సంపత్తిలోకి రాకెట్ లాంఛర్లను చేర్చుకున్నామని గత మూడేళ్ల క్రితమే ప్రకటించినప్పటికీ వాటిని వాడిన దాఖలాలు లేవు. దానికి తోడు మావోయిస్టులు రాకెట్ లాంఛర్లు తయారు చేసేందుకు లారీ ట్రాన్స్‌పోర్టుల ద్వారా తరలిస్తున్న విడి భాగాలను ఉమ్మడి రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలపై దాడి చేసి టెక్ మధుతో సహా రాకెట్ లాంఛర్లు తయారు చేసే విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం రేకెత్తించింది.

Pages