S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్ మెయిల్ ముఠా అరెస్టు

హైదరాబాద్, జూన్ 9: జూనియర్ ఆర్టిస్టు కాలె శ్రీనివాస్ కిడ్నాప్ కేసులో 13 మంది నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ‘స్టూడియో9’ టివి ఛానెల్ సిఇఓ శివకుమార్, సిఐడి హోంగార్డ్ జగదీష్ ఉన్నారు. ఇటీవల జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ తన ఫ్లాట్‌లో వ్యభిచారం నడిపిస్తున్నాడంటూ బెదిరించి ఈ ముఠా అతణ్ణి రూ.రెండు లక్షలు డిమాండ్ చేసింది. ఆ మొత్తం ఇవ్వకపోవటంతో అతణ్ణి ఏకంగా కిడ్నాప్ చేసింది. ఎలాగోలా బయటపడ్డ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విశ్వనగరంగా హైదరాబాద్

హైదరాబాద్, జూన్ 9: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చడానికి 1900 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి తెలిపారు.
గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

నేడు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఆలస్యం

హైదరాబాద్, జూన్ 9: గ్రేటర్ హైదరాబాద్ ప్రజల నీటి దాహార్తిని తీరుస్తున్న కృష్ణా ఫేజ్-3కి సంబంధించిన కోదండాపూర్‌లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు సంబంధించిన ఎలక్ట్రికల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తెలంగాణ ట్రాన్స్‌కో అధికారులు పలు మరమ్మతులు చేపడుతున్నారు. ఫలితంగా విద్యుత్ సరఫరాను తెలంగాణ ట్రాన్స్‌కో అధికారులు నిలిపివేయడంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం నీటి సరఫరా ఆలస్యంగా, అతితక్కువగా సరఫరా అవుతుందని జలమండలి అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

చిన్నారులను విద్యావంతులుగా తీర్చి దిద్దాలి

అల్వాల్, జూన్ 9: చిన్నారులను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు చెప్పారు. గురువారం ఓల్డ్ అల్వాల్‌లో నూతనంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంకా ప్రజలకు అన్ని రంగాల్లో అందుబాటులోకి రాలేదని, అదేసమయంలో కొంతమంది మంచి అనుభవం ఉన్న వారు ప్రాంతాలవారీగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సంస్థలకు మంచి స్పందన ఉందని ఆయన చెప్పారు. చిన్నారులను పాఠశాలకు పంపటానికి ముందు ఏర్పాటు చేస్తున్న డే కేర్ సెంటర్‌లకు నగరంలో మంచి ప్రాధాన్యత ఉందని ఆయన వివరించారు.

అవిభక్త కవలలకు అమ్మ ప్రేమ పంచిన నిలోఫర్

హైదరాబాద్, జూన్ 9: తలలు కలిసి పుట్టిన అవిభక్త కవలలకు పదేళ్ల పాటు అమ్మప్రేమను పంచింది నిలోఫర్ ఆసుపత్రి. వరంగల్‌కు చెందిన ఓ పేద కుటుంబంలో జన్మించిన వీరిని అప్పట్లో అరుదైన ఆపరేషన్ చేసి విడదీసేందుకు అప్పటి సూపరింటెండెంట్ డా.ఎన్.సి.కె. రెడ్డి ఇక్కడకు తీసుకువచ్చారు. వీరి కోసం ఆసుపత్రి మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డే వీరికి ప్రపంచం. వీరి ఆలనాపాలనా చూసుకునేందుకు రోజుకు మూడు షిఫ్టుల్లో ముగ్గురు ఆయాలు. చదివించేందుకు ప్రత్యేకంగా అధ్యాపకులు. ఇక వీరికిచ్చే భోజనం కూడా స్పెషలే కావటంతో వీరి పోషణ వ్యయంతో కూడుకుంది.

బోలెడంత భారం!

హైదరాబాద్, జూన్ 9: కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంవల్ల ప్రభుత్వంపై సుమారు రూ. 2వేల కోట్ల వరకు భారం పడనున్నట్టు అధికారులు వేసిన ప్రాథమిక అంచనాలో తేలినట్టు తెలిసింది. కొత్త జిల్లాలు 14 నుంచి 15 వరకు ఏర్పాటు చేయడానికి భవనాల నిర్మాణానికే జిల్లాకు రూ. 100 కోట్ల చొప్పున విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్క ప్రకారమే దాదాపురూ. 14 నుంచి 15 వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. బడ్జెట్‌లో కొత్త జిల్లాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించని విషయం ఈ సందర్భంగా గమనార్హం.

ఆర్టీసీని ఏం చేద్దాం?

హైదరాబాద్, జూన్ 9: నష్టాల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి)ను గట్టెక్కించి లాభాలబాటలో నడపించడం పట్ల ముఖ్యమంత్రి దృష్టి సారించారు. డీజిల్ ధరలు పెరగడం, ఆక్యుపెన్సీ రేటు తగ్గడంతో కష్టాల్లో పడిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు చార్జీలు పెంచడమా? లేక ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలా? అనే అంశంపై ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లో డిపో మేనేజర్ స్థాయినుంచి ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ వరకు అన్నిస్థాయిల అధికారులతో కూడిన విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గురువారం ఆదేశించారు.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

ఖమ్మం, జూన్ 9: రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ విద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు 20కోట్లను వెచ్చించనున్నామన్నారు. 1.50లక్షల మంది పేద విద్యార్థులు నాణ్యమైన విద్య అందనుందన్నారు. రాష్ట్రంలో పాఠశాలల భవన నిర్మాణాల కోసం 9కోట్లు మంజూరు చేశామన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

మిషన్ భగీరథకు మరో 2200 కోట్లు

హైదరాబాద్, జూన్ 9: మిషన్ భగీరథకు ఈ ఆర్థిక సంవత్సరం 2,200 కోట్ల రూపాయల రుణం అందించేందుకు నాబార్డ్ ముందుకు వచ్చింది. గత సంవత్సరం 1,976 కోట్లు మంజూరు చేశారు. దీంతో మిషన్ భగీరథకు ఇప్పటివరకు నాబార్డ్ 4,176 కోట్ల రూపాయల రుణ సహాయం అందించేందుకు అంగీకరించినట్టు అయింది. మొదటి విడత 1,976 కోట్ల రూపాయలు మంజూరు చేసి, నిధులను విడుదల కూడా చేశారు. రెండవ విడత మొత్తాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి నాబార్డ్ అండగా ఉంటుందని బ్యాంక్ జనరల్ మేనేజర్ సత్యప్రసాద్ తెలిపారు.

రాజకీయ పార్టీగా టి-జాక్?

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ రాజకీయ జెఎసి రాజకీయ పార్టీ రూపు దాలుస్తుందా? రాజకీయ పక్షాలన్నింటిలో ఇదే చర్చ సాగుతోంది. కోదండరామ్ వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ నేతలు అనూహ్యంగా పెద్దయెత్తున దాడి ప్రారంభించడానికి కారణం కూడా ఇదేనని విశే్లషకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో టిజెఎసి అంటే తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నింటి రూపం. టిఆర్‌ఎస్, బిజెపి, టిడిపి, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పక్షాలన్నీ కలిపితేనే అప్పటి టిజెఎసి. కానీ ఇప్పుడు టిజెఎసిలో ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున కోదండరామ్ జెఎసికి నాయకత్వం వహించారు. ఇప్పుడు టిజెఎసిలో మిగిలింది కూడా తెలంగాణ విద్యా వంతుల వేదిక ఒక్కటే.

Pages