S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలహీన వర్గాలకు రుణాల మంజూరులో జాప్యం తగదు

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 9: బలహీన వర్గాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకు అధికారులు సకాలంలో స్పందించకపోవటంపై గురువారం జరిగిన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు ఎస్‌ఎల్‌బిసి అధ్యక్షులు సురేష్, ఎన్.పటేల్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వెనుకబడిన తరగతుల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తమ శాఖ ద్వారా నెలకొల్పాల్సిన స్వయం ఉపాధి యూనిట్లను కొంతమంది బ్యాంకు అధికారులు రుణం మొత్తాన్ని విడుదల చేయకపోవటంతో గ్రౌండ్ చేయలేకపోతున్నామన్నారు.

నిరాదరణ కు గురైన వ్యక్తి ఆత్మహత్య

జగ్గయ్యపేట, జూన్ 9: అనారోగ్యం, నిరాదరణకు గురై పట్టణంలోని మున్సిపల్ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎస్ రామరాజు (45) గత కొద్దికాలంగా అనారోగ్యానికి గురై మున్సిపాలిటీకి చెందిన పాత కూరగాయల మార్కెట్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం ఉరి వేసుకొని ఉండగా గమనించిన స్థానికులు బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోర్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

నాణ్యత లేని ఎల్‌ఇడి బల్బులపై సిపిఎం నిరసన

బంటుమిల్లి, జూన్ 9: రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్‌లో ఇచ్చిన ఎల్‌ఇడి బల్బులు సరిగ్గా వెలగటం లేదని, వీటిని రీప్లేస్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈమేరకు ట్రాన్స్‌కో ఎఇ భానుప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి పంపిణీ చేసిన ఎల్‌ఇడి బల్బుల్లో నాణ్యత లోపించడం వల్ల సరిగ్గా పనిచేయడం లేదని పేర్కొన్నారు. వీటి స్థానంలో కొత్తవి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

అటవీ భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర

మైలవరం, జూన్ 9: అటవీ భూముల డిఫారెస్టేషన్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువీడకుండా చేస్తున్న ప్రయత్నం ఈ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న కుట్రేనని సిపిఐ జిల్లా ఇన్‌చార్జ్ కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బాబు ప్రయత్నాలను ఇప్పటికి రెండుమార్లు కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టినా ఆయన కొనసాగించటం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి చర్యలు ఫలిస్తే అటవీ సంపద ధ్వంసమై పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సిపిఐ సీనియర్ నేత వెంకటేశ్వరరావు మృతి

చల్లపల్లి, జూన్ 9: వక్కలగడ్డ గ్రామ మాజీ సర్పంచ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు రమణవరపు వెంకటేశ్వరరావు(86) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 16 సంవత్సరాలు గ్రామ సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి విశేష కృషి చేసిన వెంకటేశ్వరరావు 1970 నుండి పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షునిగా కొనసాగుతూ సంఘాన్ని ప్రగతిపథాన నిలిపారు. 14 ఏళ్ల వయస్సులోనే పాల ఉత్పత్తిదారుల సంఘంలోకి ప్రవేశించిన ఆయన 1952లో కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై సిపిఐలో చేరి పార్టీ పటిష్ఠతకు కృషి చేశారు.

కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు మానాలి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 9: స్వార్ధ రాజకీయాల కోసం కాపులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కాపు నేతలు సూచించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నేత బూరగడ్డ రమేష్‌నాయుడు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసత్య ప్రచారం చేస్తున్న ముద్రగడకు కాపులే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

తారకరామను విస్మరించి చింతలపూడి అంటారేమిటి?

మైలవరం, జూన్ 9: ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైలవరం మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలనే సంకల్పంతో విటిపిఎస్ నుండి వృథాగా పోయే నీటిని లిఫ్ట్ ద్వారా అందించేందుకు తారకరామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే దాన్ని విస్మరించి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తానని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం నాయకులు విమర్శించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నాయకులు ఎండి జానీ, రావూరి రామారావు, మాధవరెడ్డి, సాల్మన్‌రాజు, తదితరులు మాట్లాడారు.

భర్త చేతిలో నవ వధువు హత్య

జగ్గయ్యపేట, జూన్ 9: వివాహమై పట్టుమని రెండు నెలలు పూర్తి కాకుండానే ఒక నవ వధువు భర్త చేతిలో హత్యకు గురైంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరుకు చెందిన జిడుగు రాణికి పెనుగంచిప్రోలుకు చెందిన వెంకట నారాయణ (21)తో ఈ ఏడాది ఏప్రిల్ 24న వివాహం జరిగింది. బుధవారం భార్య రాణితో కలిసి వెంకట నారాయణ మేళ్లచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లారు.

‘మహా సంకల్పం’ నిర్వహణ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధం

కూచిపూడి, జూన్ 9: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహా సంకల్ప దీక్షకు ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్య ప్రాదేశిక సూత్రాలకే విరుద్ధమని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు. ప్రభుత్వ రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష, బుధవారం నిర్వహించిన మహా సంకల్ప దీక్షలు ప్రభుత్వ కార్యక్రమాలా? పార్టీ కార్యక్రమాలా? అని ప్రశ్నించారు. పెదపూడి గ్రామంలో కల్పన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయలేదన్నారు.

బదిలీలకు వేళాయే..!

మచిలీపట్నం, జూన్ 9: జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సమయం అసన్నమైంది. శుక్రవారం నుండి ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో జిల్లాలో కూడా పెద్దఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉంది. పలు ప్రభుత్వ శాఖల్లో అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులను బదిలీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పదిరోజుల పాటు జరిగే బదిలీలను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా బదిలీలు జరగనున్నాయి.

Pages