S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైరుతి పలకరింపు

విశాఖపట్నం, జూన్ 9: కేరళ తీరాన్ని బుధవారం తాకిన నైరుతి రుతుపవనాలు మరింతగా పురోగమించి గురువారం నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని పలకరించాయి. ఇవి అనంతపురం, ఒంగోలు వరకూ విస్తరించినట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ఇవి విస్తరించాయి. శుక్రవారం నాటికి కోస్తా, రాయలసీమల్లో మరింతగా విస్తరించవచ్చునని తెలిపారు. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని తెలిపారు.

ఎవరు ఎక్కడికో..!

విజయవాడ, జూన్ 9:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ప్రతిష్ఠంభన నెలకొంది. జూన్ ఒకటి నుంచి 15వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకుని 10 రోజులవుతున్నా, బదిలీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయలేదు. ఆ ఫైల్‌ను తన వద్దనే ఉంచుకుని కాలం వెళ్లబుచ్చుతున్నారు. బదిలీలకు సంబంధించి గైడ్‌లైన్స్ రాకపోవడంతో రాష్ట్రంలో ఉద్యోగులు అయోమయంలో పడిపోయారు. ఏ క్షణాన ఎక్కడికి బదిలీ అవుతామో తెలియక ఉద్యోగులు గత కొద్ది రోజులుగా విధులపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు.

విజయవాడలో ఉన్నా..

హైదరాబాద్, జూన్ 9: వారం రోజులుగా అదృశ్యమైన వెలాసిటీ కార్పొరేట్ జూనియర్ కాలేజీ సీనియర్ లెక్చరర్ అశ్వత్థరావు గురువారం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, సొంత పనుల మీద తాను విజయవాడ వచ్చానన్నారు. నారాయణ సంస్థలు తనను బంధించాయన్న వార్తలు సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థరావు టెలిఫోన్‌లో ఆంధ్రభూమి హైదరాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ ఇప్పటికీ తాను వెలాసిటీలోనే పనిచేస్తున్నానని, ఆ యాజమాన్యం తనపై ఎందుకింత దుష్ప్రచారం చేస్తోందో అర్ధం కావడం లేదని చెప్పారు. ఫోన్‌లో అందుబాటులో ఉన్న అశ్వత్థరావు ఎక్కడా ప్రత్యక్షం కాలేదు. తాను ఎక్కడున్నారో ఎవరికీ చెప్పలేదు.

వేగం పెరిగితే వేటే

న్యూఢిల్లీ, జూన్ 9: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 62 శాతం మితిమీరిన వేగం వల్లే జరుగుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంటూ తప్పు చేసే డ్రైవర్లను కట్టడి చేయడం కోసం జాతీయ రహదారులపై సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కొత్త మోటారు వాహనాల చట్టం ఆమోదం పొందుతుందని తాము ఆశిస్తున్నామని, ప్రమాదాలు కారకులయ్యే వారికి కఠినమైన శిక్షలను విధించడానికి సంబంధించి రాజస్థాన్ రవాణా మంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందం త్వరలోనే తన నివేదికను సమర్పించనుందని, కేబినెట్ ఆమోదం తర్వాత దాన్ని త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుందని గడ్కరీ చెప్పారు.

ఇదిగో.. రెండో విడత

విజయవాడ, జూన్ 9: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో 1,65,538 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. రెండో విడత రుణ మాఫీగా 3,500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని, వీటిని రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నామని తెలిపారు. రుణ మాఫీ మొత్తాన్ని తీసుకోకుండా బ్యాంకుల్లో ఉంచుకున్న వారికి వడ్డీ చెల్లించాలని, అత్యవసరమనుకున్న రైతులకు ఆ మాఫీ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని బ్యాంకర్లను కోరారు.

దీక్ష భగ్నం.. ముద్రగడ అరెస్టు

కాకినాడ, జూన్ 9: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురువారం చేపట్టిన ఆమరణ దీక్షను తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య సిఐడి పోలీసులు భగ్నం చేసి, ఆయన్ని అరెస్టు చేశారు. ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని కాపు నేతలు పిలుపు నిచ్చారు. అత్యంత ఉద్విగ్న పరిస్థితుల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అరెస్టు సమయంలో ముద్రగడ నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించిన నేపథ్యంలో సిఐడి పోలీసులు అరెస్టు వారెంట్‌తో అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో దీక్షలో ఉన్న ముద్రగడ పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని ఉన్నారు.

అసహనానికి గుర్తు

ఎవాంజలిస్టుల మత అసహనానికి గుర్తుగా ఇటీవల కృష్ణాజిల్లా అంగలూరు గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన దళితవాడలో రామాలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత సంతర్పణ జరిగింది. దీనికి దళితవాడకు చెందిన మతం మార్చుకొని క్రైస్తవులుగా మారిన వారిని ఫాస్టర్లు, సంతర్పణను బహిష్కరించాలని ఆదేశించారు. వారు దాన్ని తూ.చ.తప్పకుండా పాటించారు. ఇది క్రైస్తవంలోని పరమత అసహనానికి ప్రతీక.
-డా.టి. హనుమాన్ చౌదరి, సికిందరాబాద్

క్రమంగా పుంజుకుంటున్న స్వదేశీ

అభివృద్ధిపేరుతో పాలక పక్షాలు బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తమ ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్ చేయాలన్న అంశం బహుళజాతి సంస్థలకు తెలిసినంతగా ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదనడంలో సందేహం లేదు. అది ఆ సంస్థలకు వెన్నతో పెట్టిన విద్య. బహుళజాతి సంస్థల దాటికి తట్టుకోలేక పలు స్వదేశీ వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఒకానొకప్పుడు గ్రామ సీమలకు జీవనాధారంగా వున్న పలు కుటీర పరిశ్రమలు నేడు కనుమరుగు అయ్యాయి. స్వదేశీ ఉత్పత్తుల స్థానాన్ని బహుళజాతి సంస్థల ఉత్పత్తులు కబ్జా చేసాయి. స్వదేశీ అనేది కేవలం ఎన్నికల నినాదంగా మారింది.

- ఫి. మస్తాన్ రావు

అంతరించిన అసలు చదువు

కకన్యాశుల్కం నాటకంలో కరటక శాస్ర్తీ శిష్యునికి పాఠం చెబుతూ చదువన్నది ఎందుకు? అని ప్రశ్నించగా పొట్టపోసుకునేందుకు అని జవాబు చెప్పి తన సంస్కృత చదువు నిష్ప్రయోచనమైనదని ఇంగ్లీషు చదువు ఘనమైనదని అంటాడు. సుమారు వంద ఏళ్ల క్రితమే చదువుయొక్క ధ్యేయం ఇలా వివరింపబడింది. అదే అభిప్రాయం నేడు ఇంకా బలపడిపోయింది. చదువుకి కొలబద్దలు డిగ్రీలు. నేటి విద్యాలయాలలో చదువులు పరీక్షల నిర్వహణ ఒక ప్రహసనంగా మారాయి. మాస్ కాపీయింగులు పేపరు లీకేజీలు దొంగ సర్ట్ఫికెట్లు మితిమీరిపోయాయి. ఇటీవల ద్రవిడియన్ విశ్వవిద్యాలయం వారిచే ఈయబడిన ఎంఫిల్ మరియు పిహెచ్‌డి పట్టాల విషయంలో అక్రమాలు జరిగాయి. దానిపై సిఐటి విచారణకు ఆదేశాలీయబడినాయి.

- వేదుల సత్యనారాయణ

‘లండన్ హౌస్’ సుడిలో కాంగ్రెస్

కిశోర్ చంద్రదేవ్ ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడు. కొద్దిరోజుల క్రితం ఆయన ఇలా అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ పతనానికి సీనియర్లు కారణం. వారు సోనియాగాంధీకి తప్పుడు సలహాలిచ్చి పార్టీని భ్రష్టు పట్టించారు.’’ ఆ ప్రకటనలో నిజం ఉన్నదా? సీనియర్లు అంటే ఎవరు? దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, ఎకె ఆంటోని, కమలనాథ్, జైరాం రమేశ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, పళనియప్పన్ చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, మన్మోహన్ సింగ్, అభిషేక్ సింఘ్వి ఇత్యాదులు. వీరిని పార్టీ బాధ్యతలనుంచి తప్పించాలని యువనాయకత్వానికి పగ్గాలను అప్పగించాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారు. ఇదుగో ఇదే అభిప్రాయం కిశోర్ చంద్రదేవ్ ప్రకటనలో వ్యక్తమయింది.

- ముదిగొండ శివప్రసాద్

Pages