S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త రేషన్ షాపులకు పచ్చజెండా!

మచిలీపట్నం, జూన్ 9: జిల్లాలో రేషన్ దుకాణాల సంఖ్య పెరగనుంది. నిత్యావసర సరుకుల పంపిణీని మరింత వేగవంతం చేసేందుకు జిల్లాలో 206 దుకాణాలను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. బందరు డివిజన్‌లో 27 దుకాణాలు, గుడివాడ డివిజన్‌లో 32, నూజివీడు డివిజన్‌లో 39, విజయవాడ డివిజన్‌లో 108 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2161 చౌక ధర దుకాణాల ద్వారా 13లక్షల 70వేల మంది కార్డుదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతోంది. ఇకపై రేషన్ షాపుల సంఖ్య 2367 కానుంది. ప్రతి 500 కార్డులకు ఒక రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేసి సరుకుల పంపిణీని వేగవంతం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన.

శరవేగంగా రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు

అనకాపల్లి(నెహ్రూచౌక్), జూన్ 9: ఎ-గ్రేడ్ హోదాలో ఉన్న అనకాపల్లి రైల్వేస్టేషన్ మరికొద్ది రోజుల్లో రూపు మారనుంది. విజయవాడ డివిజన్ పరిధిలో అనకాపల్లి స్టేషన్‌కు అన్ని విధాలు గా అత్యధిక అదాయం వస్తున్నట్లు దక్షి ణ మధ్య రైల్వే గుర్తించింది. అందుకు అనుగుణంగా ప్రయాణికులకు అన్ని వౌళిక వసతులు కల్పించడానికి దక్షిణ మధ్య రైల్వే సుమారు ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఈ స్టేషన్ అభివృద్ధిపై స్థానిక పార్లమెంటు సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనువాసరావు ఢిల్లీలో రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గు ప్తాను కలిసి చర్చించారు. ఆయన వినతి మేరకు రవీంద్ర గుప్తా అనకాపల్లి స్టేషన్‌ను సందర్శించి పరిశీలించారు.

నాల్గవ యూనిట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం

సీలేరు, జూన్ 9: సీలేరు జల విద్యుత్ కేంద్రంలో నాల్గవ యూనిట్ మరమ్మతు పనులను పూర్తి కావడంతో గురువారం వినియోగంలోకి వచ్చింది. దీనిద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ తెలిపారు. ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ నాల్గవ యూనిట్ టాక్టర్ విభాగంలో ఎర్త్ సాంకేతిక లోపాలు తలెత్తడంతో గతనెల 21వతేదీ నుంచి ఈ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి మరమ్మతులు చేపట్టామన్నారు. ఎర్త్ లోపాలు వలన యూనిట్‌లో టాక్టర్‌లోని 10 బస్ బార్‌లు కాలిపోయాయని, వీటిని తొలగించి కొత్త బస్‌బార్‌లను యూనిట్‌లో వేశామన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అవసరం

అనకాపల్లి, జూన్ 9: ఆర్థికంగా, సా మాజికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా బాగా వెనుకబడిన ఉత్తరాంధ్రకు 15వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని మా జీమంత్రి కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తో గత ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రాంత అభివృద్ధికి ఇ చ్చిన హామీని నెరవేర్చలేని విధానాలపై నా గవర్నర్ నరసింహన్‌కు రాసిన లేఖ లో ఆయన వివరించారు. రాష్ట్రంలోని రా యలసీమతోపాటు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాల్సిన ఆవశ్యకతను లేఖలో కొణతాల పేర్కొన్నా రు.

ఉపాధి హామీ పనులకై ముట్టడి

రావికమతం,జూన్ 9: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా పిల్లవానిపాలెం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు గురువారం రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంపై ఉపాధి హామీ కూలీలు వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సమయంలో తహశీల్దార్ సిద్ధ య్య స్పందించి ఆందోళనకారులకు నచ్చచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి ంది. గ్రామంలో చిన్నఅప్పన్న చెరువు ఆక్రమణకు గురికావడంతో ఉపాధి హామీ పనులకు నోచుకోక కూలీలు వలసలు పోతున్నారని, మరోవైపు ఆయకట్టు భూములకు సాగునీరు అందలేనందున ఆక్రమణలను తొలగించాలని గత ఏడాది అక్టోబర్‌లో గ్రామస్థులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

అంథకారంలో 25 గిరిజన గ్రామాలు

సీలేరు, జూన్ 9: దుప్పిలవాడ పం చాయతీ పరిధిలో సుమారు 25 గ్రా మాలకుపైగా గత వారంరోజుల నుం చి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంథకారంలో మగ్గుతున్నాయి. ట్రా న్స్‌కో సిబ్బంది ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితులు నె లకొన్నాయని వైకాపా నాయకులు ఆ రోపిస్తున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా విద్యుత్‌కు అంతరాయం నెలకొన్నా ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో గిరిజనులు చీకట్లోనే కా లం వెళ్ళదీస్తున్నారని వాపోయారు. ఆయా గ్రామాలకు దారకొండ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుండేదన్నారు.

ప్రశాంతంగా ఆర్‌ఇసిఎస్ పాలిటెక్నిక్ కౌనె్సలింగ్

కశింకోట, జూన్ 9: స్థానిక ఆర్‌ఇసిఎస్ కార్యాలయ ఆవరణలో ఉన్న రాజీవ్‌గాంధీ ఆర్‌ఇసిఎస్ పాలిటెక్నిక్‌లో గురువారం జరిగిన కౌనె్సలింగ్ ప్రశాంతంగా జరిగింది. మెకానికల్, ఇఇఇ, ఇసిఇ, సివిల్ బ్రాంచ్‌లున్న ఈ కళాశాలలో 120 సీట్లకు 362 దరఖాస్తులు వచ్చాయి. కౌనె్సలింగ్ సందర్భంగా 310 మంది విద్యార్థులు రావడంతో వీరిలో 120 మందిని ఎంపిక చేశారు. కౌనె్సలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ అనకాపల్లి నుండి బికె సూర్యప్రకాష్, సహాయకునిగా ప్రభుత్వపాలిటెక్నిక్ ఆధ్యాపకుడు ఎ.నాగరాజు విచ్చేశారు.

విద్యాబోధనలో మార్పులు రావాలి

పాడేరు, జూన్ 9: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాబోధనలో మార్పులు రావాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీకృష్ణాపురం బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఇండియా ఎడ్యుకేషన్ కలెక్టివ్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ లో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్యావిధానంలో నాణ్యతలు లోపిస్తున్నాయన్నారు. విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్య బోధనలో మార్పులు రావాలని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుందన్నారు.

అధ్వాన్న రోడ్డు మరమ్మతులకు వైకాపా ఆందోళన

మునగపాక, జూన్ 9: అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు గతుకులు పడి స ంవత్సరాలు గడుస్తున్నా ఆర్‌అండ్‌బి అ ధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వైకాపా నాయకులు, కార్యకర్తలు గురువారం రాస్తారోకో నిర్వహించారు. వైకాపా అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జ్జి బొడ్డేడ ప్రసాద్ సారద్యంలో వైకాపా శ్రేణులు అనకాపల్లి- అచ్యుతాపురం ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించి నిరసనను వ్యక్తం చేశారు. గురువారం స్థానిక రిక్షాల స్టా ండ్ దగ్గర ఉదయం 9 నుండి 11 గం టల వరకు రాస్తారోకో నిర్వహించారు. దీనివలన ట్రాపిక్ భారీస్థాయిలో నిలిచిపోయింది.

29 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు

విశాఖపట్నం, జూన్ 9: విశాఖ నగరం నాల్గవ వార్డు పోతినమల్లయ్యపాలెం గిరిపై 13 ఏళ్ళ కిందట వెలసిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతోంది. స్వామి వారి చతుర్ధశ వార్షికోత్సవ సహిత పరిత్రోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవోతపేతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ప్రధాన అర్చకులు ఫణిహారం వేంకట నరసింహాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

Pages