S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త శకానికి నాంది

వాషింగ్టన్, జూన్ 9: భారత్-అమెరికా సహజ మిత్రులని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న మైత్రి ఉన్నత శిఖరాలకు చేరిందని ఆయన వెల్లడించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలు ప్రభావవంతమైనవని ఆయన స్పష్టం చేశారు. యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో బుధవారం రాత్రి ఆయన ప్రసంగించారు. భారత్-అమెరికాల సంబంధాల్లో కొత్తశకం ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఇరుదేశాల ప్రయోజనాలు కాపాడుకోవడంతోపాటు ప్రపంచానికే ఆదర్శంగా మారిందని ఆయన అన్నారు.

‘ఉడ్తాపంజాబ్’లో మార్పులు సరైనవే

ముంబై, జూన్ 9: వివాదాస్పదంగా మారిన ‘ఉడ్తాపంజాబ్’ సినిమాలో తాము సూచించిన మార్పులు సరైనవేనని సెన్సార్ బోర్డు సమర్థించుకుంది. ఈ సినిమాలో ‘పంజాబ్’ సంకేత బోర్డును తొలగించాలని, దానితో పాటు మరో పదమూడు మార్పులను సూచించటం వెనుక ఔచిత్యంపై బాంబే హైకోర్టు గురువారం సెన్సార్‌బోర్టును ప్రశ్నించింది. జూన్ 17న విడుదల కావలసిన ఈ సినిమాలో అవసరమైన మార్పులను చేయాల్సిందన్న సెన్సార్‌బోర్డు ఆదేశాలను సవాలు చేస్తూ ‘ఉడ్తాపంజాబ్ ’ నిర్మాతలైన ఫాంటమ్ ఫిల్మ్స్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్.సి.్ధర్మాధికారి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది.

మాల్యా, హెలికాప్టర్ కుంభకోణాలపై ‘సిట్’

న్యూఢిల్లీ, జూన్ 9: హైప్రొఫైల్ కేసుల విచారణ వేగవంతం చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. వివిఐపి హెలికాప్టర్ల కుంభకోణం, లిక్కర్ కింగ్ విజయమాల్యా రుణాల ఎగవేత వంటి కేసులు సత్వరం విచారణ చేపట్టడానికి గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి సారథ్యంలో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్)ను సిబిఐ నియమించింది. అడిషనల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థాన నేతృత్వంలో దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 1984 కేడర్ ఐపిఎస్ అధికారి రాకేష్‌కు సిట్ చీఫ్‌గా నియమించారు. 2002 ఫిబ్రవరిలో గోధ్రాలో జరిగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ దగ్ధం కేసును విచారించిన సిట్‌కు ఆయన సారధ్యం వహించారు.

లండన్‌లో న్యూడ్ హోటల్

లండన్, జూన్ 9: లండన్‌లో ఓ కొత్త హోటల్ వినూత్న పంథాలో వెలసింది. ‘బున్యాదీ’ అన్న హిందీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ హోటల్ లండన్‌లో తొలి నగ్న హోటల్‌గా ప్రారంభమైంది. బున్యాదీ అంటే పునాది అని అర్థం అని యజమానులు తెలిపారు. హోటల్‌కు వచ్చే వినియోగదారులు పూర్తి సహజత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకే ఈ హోటల్‌ను ప్రారంభించినట్లు వారు వెల్లడించారు. వినియోగదారులు హోటల్‌కు బట్టలు వేసుకోవటం అనేది ఐచ్ఛికమని వారు చెప్పారు. ‘మా హోటల్‌కు వచ్చే వినియోగదారులు ఆ రాత్రిని ఎలాంటి భేషజాలు లేకుండా హాయిగా గడపాలన్నదే మా ఉద్దేశం. మా దగ్గర కృత్రిమ రసాయనాలు ఉండవు. కృత్రిమ రంగులు ఉండవు. విద్యుత్తు ఉండదు. గ్యాస్ ఉండదు.

ఎయిడ్స్‌పై పోరులో భారత్ కీలక పాత్ర

ఐక్యరాజ్య సమితి, జూన్ 9: ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగిస్తున్న ఔషధాలలో 80 శాతం ఔషధాలను భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థలు సరఫరా చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జెపి నడ్డా తెలిపారు. తక్కువ వ్యయం అయ్యే జనరిక్ ఔషధాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో హెచ్‌ఐవి చికిత్సను ఎక్కువగా అందుబాటులోకి తేవడానికి తోడ్పడ్డాయని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో హెచ్‌ఐవి/ ఎయిడ్స్ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి జనరల్ అసెంబ్లీ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.

జర్నలిస్టులకు త్వరలో అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు

నల్లగొండ టౌన్, జూన్ 9: త్వరలో తెలంగాణలో పని చేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. గురువారం విలేఖరులతోమాట్లాడుతూ ఇప్పటికే కొంత మందికి హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగిందని, లేని వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సిఎం కెసిఆర్ 20కోట్లు మంజూరు చేయడం జరిగిందని, వాటికి 80లక్షల వడ్డీ వచ్చిందని, పూర్తి మొత్తాన్ని జర్నలిస్టుల సంక్షేమానికే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ను వీడను.. అధికారమే లక్ష్యంగా కృషి

నార్కట్‌పల్లి, జూన్ 9: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే తెచ్చింది సాధించింది కెసిఆర్ అన్నట్లుగా ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ఎన్నికల హామీలను విస్మరిస్తున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిఆర్‌ఎస్‌పై విమర్శలు కురిపించారు. గురువారం నార్కట్‌పల్లి మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది కాంగ్రెస్‌నేనని, అలాంటి పార్టీ అభివృద్ధికోసం వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాడుతానని పేర్కొన్నారు.

అమిత్‌షా సభకు అంతా సిద్ధం

సూర్యాపేట, జూన్ 9: గత రెండేళ్ల ఎన్డీయే పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన వికాస్‌పర్వ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలో నిర్వహించే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ది, రాబోయే మూడెళ్లలో చేయనున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతంచేసే లక్ష్యంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య ప్రధానకేంద్రంగా ఉన్న సూర్యాపేటలో అమిత్‌షా సభను నిర్వహించాలని నిర్ణయించారు.

షా సభకు భారీ భద్రత: ఎస్పీ

సూర్యాపేట, జూన్ 9: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగసభకు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో బహిరంగసభ స్థలాన్ని పరిశీలించి చేపట్టాల్సిన భద్రత చర్యలను సమీక్షించారు. బహిరంగసభ వేదిక, బహిరంగసభ స్థలం, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుని పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటుచేస్తున్నామన్నారు. తన పర్యవేక్షణలో అధనపు ఎస్పితో పాటు వందలాది మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

తెలంగాణకు హరితహారం వరం

నల్లగొండ టౌన్, జూన్ 9: తెలంగాణకు హరితహారం ఒక వరంలా భావించి జిల్లాను ముందంజలో ఉంచే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని కమిషనర్ అనితా రామచంద్రన్ సూచించారు. గురువారం డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు అన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొక్కలు నర్సరీలలో సిద్దంగా ఉన్నాయని, నీటి వసతి ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని విస్తుృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా రక్షణ చర్యలు సైతం తీసుకోవాలన్నారు. గ్రామాలలలో సర్పంచ్, కార్యదర్శిలోలు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు.

Pages