S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగరంగ వైభవంగా ఆంజనేయుని కల్యాణం

శ్రీకాకుళం(కల్చరల్), జూన్ 9: నగరంలోని పుణ్యపువీధిలో ఉన్న అభయాంజనేయస్వామి వారి దేవాలయంలో పది రోజులుగా జరుగుతున్న హనుమజ్జయంతి ఉత్సవాలు గురువారం రాత్రి సువత్సల అభయాంజనేయస్వామి వారి కల్యాణమహోత్సవంతో ముగిశాయి. స్వామి, అమ్మవార్ల విగ్రహాలను కొలువుతీర్చి అరసవల్లి దేవస్థానం అర్చకుడు హరిబాబు ఆధ్వర్యంలో పుష్యమి నక్షత్ర మకర లగ్నమందు స్మార్తాగమం ప్రకారం శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. తొలుత మహిళలు 121 కలశలతో పురవీధుల్లో శోభాయాత్రలో పాల్గొన్నారు.

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నరసన్నపేట, జూన్ 9: సమాజంలో సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే పౌష్టికాహారాన్ని తీసుకున్ననాడే సాధ్యవౌతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మండలంలోని జమ్ముపంచాయతీలో గురువారం ఏర్పాటు చేసిన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వంకు మెక్సికో మద్దతు

మెక్సికో సిటీ, జూన్ 9: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం పొందడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మెక్సికో దేశం మద్దతు తెలిపింది. అయిదు దేశాల పర్యటనలో చివరి మజిలీగా గురువారం మెక్సికో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పినా నీటోతో వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంధనం, రోదసీ రంగాలుసహా వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశంపై ఇరువురు నేతలు జర్చలు జరిపారు.

సాధించింది తక్కువ.. ప్రచారం ఎక్కువ

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ సంకీర్ణ ప్రభుత్వం రెండేళ్లలో సాధించించింది తక్కువ, ప్రచారం ఎక్కువ అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు.

మోదీ కోసం కారు నడిపిన మెక్సికో అధ్యక్షుడు

మెక్సికో సిటీ, జూన్ 9: అయిదు దేశాల పర్యటనలో భాగంగా గురువారం మెక్సికో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పినా నీటో మోదీ ఉన్న కారును స్వయంగా నడిపారు. వాళ్లిద్దరూ కారులో ‘క్వింటోనిల్’ అనే రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ మోదీతో కలిపి నీటో శాకాహార భోజనం చేశారు.

అణు విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి ఎందుకు మార్చారు?

న్యూఢిల్లీ, జూన్ 9: ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. ఏచూరి గురువారం విలేఖరులతో మాట్లాడుతూ అణువిద్యుత్ కేంద్రాన్ని గుజరాత్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు మార్చటం వెనక ఉన్న రాజకీయం ఏమిటని ప్రశ్నించారు. గుజరాత్‌ను సురక్షితంగా ఉంచుకోవాలనే లక్ష్యంతోనే అణు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

కనికరం చూపండి

అహ్మదాబాద్, జూన్ 9: గుజరాత్ గుల్బర్గ్ మారణకాండ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన 24మందిపై కనికరం చూపించాలని వారి తరపు న్యాయవాది గురువారం ప్రత్యేక కోర్టుకు విన్నవించారు. 2002 గుజరాత్ అల్లర్లలో నాటి ఎంపి ఎహ్సాన్ జాఫ్రితోసహా 69మందిని ఊచకోత కోసిన ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం 24మందిని దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. నేరస్థులందరికీ మరణ దండన విధించాలని ప్రాసిక్యూషన్ వాదించగా, గురువారం ఉదయం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిబి దేశాయ్ నిందితుల తరపు న్యాయవాది అభయ్ భరద్వాజ్ వాదనలు విన్నారు. ప్రాసిక్యూషన్ డిమాండ్‌కు వ్యతిరేకంగా అభయ్ సుదీర్ఘంగా తన వాదనలు వినిపించారు.

‘పఠాన్‌కోట్’ ఓ కుంటిసాకు

ఇస్లామాబాద్, జూన్ 9: ద్వైపాక్షిక చర్చల ప్రక్రియను దెబ్బతీసేందుకు ‘పఠాన్‌కోట్’ దాడిని భారత్ ఓ కుంటిసాకుగా చూపుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఉగ్రవాద సంబంధిత అంశాలతోసహా ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న అనేక ఇతర అంశాలను కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే పాకిస్తాన్ విధానమని ఆ దేశ విదేశ వ్యవహారాలలో ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ గురువారం మీడియాతో అన్నారు. 2015 డిసెంబర్‌లో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్తాన్‌కు వచ్చినప్పుడు చర్చల కొనసాగింపునకు అంగీకరించారని, జనవరి 2న పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడి జరగటంతో చర్చల ప్రక్రియ నిలుపుదలకు భారత్‌కు ఓ కారణం దొరికినట్లయిందని అజీజ్ విమర్శించారు.

ఇరాక్‌లో ఆత్మాహుతి దాడులు

బాగ్దాద్, జూన్ 9: ఇరాక్‌లో గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 27 మంది మృతిచెందగా డజన్లకొద్దీ గాయపడ్డారు. బాగ్దాద్‌లోని ఒక వాణిజ్య ప్రాంతంలో శక్తివంతమైన బాంబు పేలడంతో 15 మంది మృతిచెందగా, 35 మంది గాయపడ్డారు. తాజీ పట్టణంలో ఆర్మీ చెక్‌పోస్టు వద్ద జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతిచెందారు. వీరిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు కాగా, ఏడుగురు పౌరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మరో 28 మంది గాయపడ్డారని వారు తెలిపారు. తాజా దాడులకు తామే కారణమని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ప్రకటించుకుంది.

బల్యన్‌ను తక్షణం తొలగించండి

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు లేకుండా దాద్రీ దురాగతం జరగదని, దాని అనంతర పరిణామాల వెనుక కూడా ఆయన మద్దతు ఉందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక మోదీ హస్తం ఉందని ఆరోపించిన ఏచూరి, బల్యాన్‌ను తక్షణం కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దేశంలో జరుగుతున్న మతపరమైన హింసాత్మక ఘటనల వెనుక ప్రధాని మోదీ ప్రమేయం ఉందని, దాద్రీ ఘటనలోనూ ఆయన ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని ఏచూరి స్పష్టం చేశారు. రెండేళ్ల మోదీ పాలనపై సిపిఎం రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడారు.

Pages