S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండింగ్ ఫైల్స్‌ను సత్వరం పరిష్కరించాలి

విజయనగరం(టౌన్), జూన్ 9: ఆక్రమణ, అన్యక్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు, సామాజిక భూముల వివరాలను సత్వరమే గుర్తించి నివేదికలు సమర్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఆదేశించారు. గురువారం జిల్లా జిల్లా కలెక్టర్ సమావేశ భవనంలో రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు, చెరువులు, సామాజిక స్థలాలు అన్యాయాక్రాంతం, ఆక్రమణలకు గురైనవాటి వివరాలు నివేదించాలని చెప్పారు. ప్రభుత్వ భూములు పరిరక్షణకు తహశీల్దార్లు చర్యలు చేపట్టి ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

దిగజారుతున్న ప్రభుత్వ విద్య!

సీతానగరం, జూన్ 9: ప్రభుత్వ పాఠశాల విద్య అంటే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అంతంతమాత్రంగానే బోధిస్తున్నారని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు పెంపొందించడంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తకొత్త విద్యా విధానాలను ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రజల్లో దీనిపై ఆసక్తి క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకావడం లేదు.

లక్ష్యం దిశగా హరితహారం

నిజామాబాద్, జూన్ 9: పచ్చదనాన్ని పెంపొందిస్తూ, అటవీ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ఈసారి పరిస్థితులు అనుకూలిస్తుండడం జిల్లా యంత్రాంగానికి ఊరటనందిస్తోంది. సీజన్ ఆరంభానికి ముందే జిల్లాలో గత వారం రోజుల నుండి అన్ని ప్రాంతాల్లోనూ ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈసారి హరితహారం విజయవంతమవుతుందనే నమ్మకం బలపడుతోంది. గతేడాది జిల్లాలో మూడున్నర కోట్ల వరకు మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుని సుమారు 400పైచిలుకు నర్సరీల్లో పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ మొక్కల పెంపకం చేపట్టారు.

ఆగస్టు నాటికి 1995 గ్రామాలకు శుద్ధి జలాలు

నిజామాబాద్, జూన్ 9: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా వచ్చే ఆగస్టు నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 1995 ఆవాసాలకు శుద్ధి చేయబడిన రక్షిత జలాలను అందిస్తామని మిషన్ భగీరథ వైస్ చైర్మెన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన జలాల్‌పూర్ వద్ద నిర్మిస్తున్న వాటర్ గ్రిడ్ ఇంటెక్ వెల్ పనుల పురోగతిని పరిశీలించారు. మిషన్ భగీరథ ఎస్‌ఇ ప్రసాద్‌రెడ్డి, ఎస్సారెస్పీ ఎస్‌ఇ సత్యనారాయణ తదితరులతో కలిసి పోచంపాడ్‌లో లక్ష్మి కెనాల్ ఎత్తిపోతల పథకం పనుల ప్రగతిపై చర్చించారు.

ఆదమరిస్తే...అనర్థాలు తప్పవు

ఇందూర్, జూన్ 9: విద్యను వ్యాపారంగా మల్చుకుని ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న పలు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకుండా అభంశుభం ఎరుగని చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న తల్లిదండ్రులకు గుండెకోతను మిగుల్చుతున్నాయి.

మైనార్టీల సంక్షేమానికి కృషి

కామారెడ్డి, జూన్ 9: మైనార్టీల సంక్షేమానికి టిఆర్‌ఎస్ సర్కార్ ఎంతో కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ప్రభుత్వం నుండి మంజూరు అయిన చెక్కులను మైనార్టీ మజీద్ నిర్వహకులకు ప్రభుత్వ విప్ అందించారు. అనంతరము అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండగ సందర్భంగా ప్రభుత్వం 12మజీద్‌లకు రెండు లక్షల రూపాయలు మంజూరు చేయగా వాటిని మజీద్ నిర్వహకులకు పంపిణీ చేశామని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం షాధిముబారక్‌కు ప్రభుత్వం 51వేల రూపాయలు అందిస్తోందన్నారు.

నగల కోసం మహిళ హత్య

బోధన్, జూన్ 9:దొంగతనం కేసులో జైలుకెళ్లి బయటకు వచ్చిన ఓ పాత నేరస్థుడు బంగారు నగల అపహరణ కోసం మహిళను ఉరేసి హత్య చేసాడు. హత్యకు గురైన మహిళ సెల్‌ఫోన్‌ను అపహరించుకుపోయి ఇతరులకు విక్రయించడంతో ఈ ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి హత్య కేసును ఛేదించారు. బోధన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు ఈ హత్యకేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని తట్టికోట్ ఏరియాకు చెందిన సవిత ఈ నెల 2వ తేదీన మల్లారం అటవీ ప్రాంతంలో హత్యకు గురయ్యింది.

సాదాబైనామా దరఖాస్తులను తనిఖీ చేసిన ఆర్డీఓ

డిచ్‌పల్లి, జూన్ 9: దర్పల్లి మండల కేంద్రంలో సాదాబైనామా ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం రైతులు చేసుకున్న దరఖాస్తులను గురువారం నిజామాబాద్ ఆర్డీఓ యాదిరెడ్డి సందర్శించి పరిశీరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పలువురు రైతులతో మాట్లాడుతూ, వ్యవసాయానికి సంబంధించి సాదాబైనామాలపై కొనుగోలు చేసిన భూములకే ఈ ఉచిత రిజిస్ట్రేషన్లు వర్తిస్తాయని అన్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు, మీసేవా కేంద్రాల నిర్వాహకులు రైతులకు సహకరించాలని ఆయన సూచించారు. ఆర్డీఓ వెంట తహశీల్దార్ సూర్యప్రకాష్, రెవెన్యూ సిబ్బంది, మీసేవా కేంద్రాల నిర్వహకులు పాల్గొన్నారు.

ఈ సెట్ కౌనె్సలింగ్ ప్రారంభం

బెల్లంపల్లి, జూన్ 9: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం మొదటి రోజు ఈ సెట్ కౌనె్సలింగ్ ప్రారంభమైంది. ఈ కౌనె్సలింగ్‌కు 500మంది విద్యార్థులు హాజరయ్యారు. కౌనె్సలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు ఉదయం 9గంటలకు 1వ ర్యాంకు నుంచి 2వేల ర్యాంకు వరకు, మద్యాహ్నం 1.30గంటల 2001 నుంచి 4వేల ర్యాంకులు సాధించిన విద్యార్థుల దృవీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం వారి వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసుకున్నారు. శుక్రవారం జరిగే కౌనె్సలింగ్‌కు 4001 ర్యాంకు నుంచి 10వేల ర్యాంకులు సాదించిన విద్యార్థులు హాజరు కావాలని క్యాంపు ఇన్‌చార్జి పురుషోత్తం తెలిపారు.

కోదండరాంకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

తాండూర్, జూన్ 9: తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకపాత్ర పోషించిన టిజెఎసి చైర్మన్ కోదండరాంను విమర్శించిన మంత్రులు, ఎంపిలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎబివిపి జిల్లా కోకన్వీనర్ కృష్ణదేవరాయలు అన్నారు. మండలంలోని ఐబిలో గురువారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సకల జనులను ముందుకు తీసుకుపోయిన ఆచార్య కోదండరాంపై మంత్రులు, ఎంపిలు విమర్శలు చేయడం తగదన్నారు. ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలను ప్రశ్నించినందుకే మంత్రులు, ఎంపిలు కోదండరాంపై విమర్శలకు దిగడం శోచనీయమన్నారు.

Pages