S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్ర పోతున్నారా?

విజయనగరం(టౌన్), జూన్ 9: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధిలో యంత్రాంగం పనితీరుపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సభ్యులతో ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధితో పాటు సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్న మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీలు నివసించే గ్రామాల్లో ఖర్చుచేయకుండా అలసత్వం వహిస్తున్నారని ఆసంతృప్తి వ్యక్తంచేశారు.

లారీ దొంగల అరెస్టు

విజయనగరం(టౌన్), జూన్ 9: పట్టణ పరిధిలో లారీ చోరీ కేసును సిసి ఎస్, పట్టణ వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. గురువారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సిసి ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ నెల నాలగవతేదీ రాత్రి కణపాకలోని ఎస్‌బి ఐ ముందు పార్కు చేసిన ఎపి-16టిడి1789నెంబరు గల లారీని చోరీకి గురైనట్లు సిసి ఎస్ పోలీసులకు సమాచారం అందిందని డి ఎస్పీ చక్రవర్తి తెలిపారు. వన్‌టౌన్ సి ఐ వెంకట అప్పారావు, సిబ్బందితో ఆరు బృందాలను ఈకేసును దర్యాప్తు చేసేందుకు నియమించామని తెలిపారు.

తీరు మారదు.. పాలన సాగదు!

విజయనగరం (్ఫర్టు), జూన్ 9: మున్సిపల్ పాలనా వ్యవహారాల్లో ఒకవైపు పాలకవర్గం, మరోవైపు అధికార యంత్రాంగం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో పట్టణ అభివృద్ధి కుంటుపడుతోంది. మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణ పౌరులకు అందవలసిన సేవలు కూడా సకాలంలో సక్రమంగా అందడంలేదు. అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. అన్ని విభాగాలలోను నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.

వైద్యసేవలో అలసత్వం వహిస్తే చర్యలు

గజపతినగరం, జూన్ 9: వైద్య సేవలు అందించడంలో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి ఎం. కిషోర్ కుమార్ హెచ్చరించారు. గురువారం స్థానిక సిహెచ్ ఎన్‌సిలో గురువారం ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో 95శాతం పురోగతి ఉందని, లక్ష్యాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని అన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్‌లు అందించాలని సూచించారు. అర్హత గల పిల్లలకు సిహెచ్‌సి, పిహెచ్‌సిలలో వ్యాక్సిన్‌లువేయాలని అన్నారు.

ఆరోగ్య ఉపకేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి

వేపాడ, జూన్ 9: ఆరోగ్య ఉప కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తూ వైద్యసేవలను అందుబాటులో ఉంచాలని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆర్. త్రినాథరావు ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని చినదుంగాడ, బాణాది గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో మాతా శిశు సంరక్షణకు సేవలకు అనుకూలమైన వసతులు ఉన్నాయా లేదా మహిళా ఆరోగ్య కార్యకర్తలు విధులను ఏవిధంగా నిర్వహిస్తున్నది పరిశీలించారు. బాలింతలు, గర్భిణీలలో ప్రమాదకర సమస్యలను గుర్తించి వైద్యాధికారిచే పరీక్షలు జరిపించాలని అన్నారు. ఈ సందర్భంగా చినదుంగాడ లో ఉన్న గర్భిణీ లను కలసి మహిళా ఆరోగ్య కార్యకర్తల పనితీరుపై ఆరా తీశారు.

ఫిట్‌నెస్ లేని బస్సులపై చర్యలు తప్పవు

గజపతినగరం,జూన్ 9: భద్రతాపరంగా లోపాలు ఉన్న పాఠశాలల బస్సులపై చర్యలు తీసుకోక తప్పదని సాలూరు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పి.వి. గంగాధరరావు అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో పట్టణంలో గల ప్రైవేటు పాఠశాలల బస్సుల యజమానులు, డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండడంతోపాటు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు వయస్సు గల వారిని మాత్రమే నియమించుకోవాలని అన్నారు. డ్రైవర్‌తోపాటు సహాయకుడుని తప్పనిసరిగా ఏర్పాటు చేయడంతోపాటు బస్సులలో డ్రైవర్ అడ్రస్సు, ఫోన్ నెం., పాఠశాల యాజమాన్యంపేరు, ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

మైదాన ప్రాంత గిరిజనుల కోసం ‘మాడా’ ఏర్పాటు చేయాలి

విజయనగరం (్ఫర్టు), జూన్ 9: జిల్లాలో మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధి కోసం మోడిఫైడ్ ఏరియా డవలప్‌మెంట్ అప్రోచ్ (మాడా) వ్యవస్థను ఏర్పాటు చేయాలని మైదాన ప్రాంత గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గేదెల లక్ష్మణ్, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రఘుపతుల శశిభూషణ్ కోరారు. ఈ మేరకు ఎస్సీఎస్టీసెల్ చైర్మన్ కారెం శివాజీకి గురువారం ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదాన ప్రాంత గిరిజనుల కోసం మాడా ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో గిరిజన విద్యార్థుల కోసం ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని, ఎస్సీఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు.

దీక్షలవల్ల ప్రజలకు ఏమి ఒరిగింది

విజయనగరం(టౌన్), జూన్ 9: తెలుగుదేశం ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షల పేరుతో నిర్వహించిన సభలు వలన సామాన్య ప్రజలకు ఒరిగిందేమిటని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ ప్రశ్నించారు. గురువారం పార్టీ కార్యలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విజయనగరంలో పరిశ్రమలు మూతపడి కార్మికులు వీధినపడి తిరుగుతుంటే, సామాన్యులు డబ్బులు ఖర్చుపెట్టి బడిలో చేర్పించడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు రుణాలు లేక అనేక సమస్యలతో ప్రజానీకం అల్లాడుతుంటే నవ నిర్మాణ దీక్షలు కారణంగా వారం రోజులు అధికారులు దీక్షా సభల నిర్వహణలో తల మునకలయ్యారని అన్నారు.

రెండు నెలల్లో పూర్తి చేయాల్సిందే..

విజయనగరం(టౌన్), జూన్ 9: వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ లక్ష్యాన్ని రెండునెలల్లో సాధించాలని జిల్లా కలెక్టర్ ఎం ఎం నాయక్ మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణ పారిశుద్ధ్యం, స్వచ్ఛాంధ్ర, ఇంటింట మరుగుదొడ్డి నిర్మాణం లక్ష్యాలను సమీక్షించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధలను భాగస్వామ్యం చేసి ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం జరిగేలా ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని అన్నారు. గ్రామాల వారీగా అవగాహన సదస్సు నిర్వహించాలని తెలిపారు.

ఉద్యాన పంటలను ప్రోత్సహించండి

విజయనగరం(టౌన్), జూన్ 9: ఉద్యాన పంటలను సాగుచేసే రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఉద్యాన శాఖ, మైక్రో ఇరిగేషన్ అధికారులతో జిల్లాలో కూరగాయల పంటలు, బిందుసేధ్యం, సూక్ష్మ సేధ్యం ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూరగాయల పంటల సాగు విస్తీర్ణం పెంచాలని స్పష్టంచేసారు. రైతులు వివరాలు, భూమి వివరాలు సేకరించి ఉద్యాన పంటలను విరివిగా ప్రోత్సహించాలని అన్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు కూరగాయలు పెంచేందుకు పెండాల్ రైతులకు మంజూరు చేయాలని తెలిపారు. అల్లం, కొబ్బరి అంతర్ పంటలు సాగుచేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.

Pages