S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిసరాలు పరిశుబ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులు దూరం

ఆసిఫాబాద్, జూన్ 9: వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులను అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రతంగా ఉండేలా చూసుకోవాలని జిల్లా మలేరియా అధికారి అల్హం రవి పేర్కొన్నారు. గురువారం ఆసిఫాబాద్ క్లస్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అడ, కెరమెరి, వాంకిడి, రెబ్బెన పిహెచ్‌సిన పర్యవేక్షక సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరు స్థానికంగా ఉండాలని సూచించారు. వ్యాధులకు కారణమైన దోమలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇండ్ల చుట్టు మురికి గుంతలు ఉండకుండా, వర్షపునీరు నిలవకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలి

నిర్మల్ రూరల్, జూన్ 9: అంగన్‌వాడీ కేంద్రాలు ఆరోగ్యలక్ష్మీ పథకాన్ని సమర్దవంతంగా నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర స్ర్తి శిశుసంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కే.ఆర్.ఎస్ లక్ష్మీదేవి అన్నారు. మండలంలోని వెంగ్వాపేటలో అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో ఆరోగ్యలక్ష్మీ పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. కార్యకర్తను సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. నేరుగా గర్భిణిలను పథకం ద్వార పొందుతున్న ప్రయోజనాలను అడిగారు.

కోదండరాంను విమర్శించడం సరికాదు

శ్రీరాంపూర్ రూరల్, జూన్ 9: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోవాలని సూచించారే తప్ప ఎవరినీ విమర్శించలేదని టిడిపి తూర్పు జిల్లా అధ్యక్షుడు జక్కుల రాజేశం అన్నారు. శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని వర్గాలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంతగానో కృషి చేసిన ప్రొఫెసర్ కోదండరాంను విమర్శించడం సరికాదన్నారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

ఉట్నూరు, జూన్ 9: బడీడు పిల్లలను వంద శాతం పాఠశాలల్లో చేరేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ సంబంధిత ఏటిడబ్ల్యూవోలు, హెచ్‌ఎంలను ఆదేశించారు. గురువారం స్థానిక పిఎమ్మార్సీ భవనంలో ఏటిడబ్ల్యూవోలు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సెస్సీలో 80శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, వచ్చే ఏడాదిలో 95శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులను పాఠశాలల్లోనే ఉంచి విద్యాబుద్దులు నేర్పుతు 15 నుండి జరిగే పరీక్షలకు సిద్దం చేయాలన్నారు.

రూపాయికే నల్లా కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోండి

బెల్లంపల్లి, జూన్ 9: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం సంవత్సరానికి రూ.2లక్షల ఆదాయం కలిగి ఉన్నవారికి బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23వార్డుల్లో గల పేద ప్రజలు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పసుల సునీతారాణి కోరారు.

గుడుంబా నియంత్రణకు అన్ని విధాల సహకరిస్తాం

ఆదిలాబాద్, జూన్ 9: జిల్లాలో నిషేదిత గుడుంబా నియంత్రణకు సమష్టిగా కృషి జరగాలని, ఇందుకోసం పోలీసు శాఖ తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. గురువారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ దుగ్గల్‌ను ఎక్సైజ్ శాఖ ఇంచార్జి డిప్యూటి కమిషనర్ ఎం.రమేష్ రాజ్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పోలీసుల సహకారాన్ని కోరారు. ప్రభుత్వం నిషేదించిన దేశిదారు, గుడుంబాను అరికట్టేందుకు వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించాలని, నిందితులను ముందుగానే గుర్తించడం ద్వారా వారిపై కేసులు నమోదు చేసే వీలుకల్గుతుందన్నారు.

జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయండి

ఆదిలాబాద్, జూన్ 9: స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా బహిరంగ మలవిసర్జన సహిత ఆదిలాబాద్ జిల్లాగా రూపొందించడానికి కృషి చేయాలని జిల్లా గ్రామీణ తాగునీటి శాఖ ఎస్‌ఈ మల్లేష్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతంగా నిర్వహించి, సంపూర్ణ పారిశుద్ధ్య పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి ఎంపిడీవోలకు, డ్వామా ఎపివోలకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్వచ్చ భారత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోవు నాలుగేళ్లలో రాష్టవ్య్రాప్తంగా సంపూర్ణ పారిశుద్ద్య గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అదికారులకు వివరించారు.

పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిన ఎఎస్పీ రాధిక

ఆదిలాబాద్, జూన్ 9: పట్టుదలే లక్ష్యంగా జిల్లా ఎఎస్పీ రాధిక 8850 మీటర్ల ఎత్తుగల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి పోలీసు శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేశారని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అభినందించారు. గురువారం ఎఎస్పీ రాధిక జిల్లా ఎస్పీ దుగ్గల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తీరును ఛాయచిత్రాలతో వివరించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ గతంలో కున్ పర్వతం విజయవంతంగా అధిరోహించడం వల్ల ఇదే స్పూర్తితో ఎవరెస్ట్‌ను అధిరోహించడం జరిగిందని, నెల రోజుల ముందు అన్ని విధాల శిక్షణ తీసుకున్నానని తెలిపారు. ఎస్పీ దుగ్గల్ మాట్లాడుతూ ఓ మహిళ..

జిల్లాలో కొత్తగా 12 బిసి వసతి గృహాల ఏర్పాటు

ఆదిలాబాద్, జూన్ 9: బిసి జనాభా అధికంగా ఉన్న జిల్లాలో వెనకబడినవర్గాల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపుదలకోసం కేంద్ర సామాజిక న్యాయశాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి తారా చంద్ గెహ్లాత్ కొత్తగా 12 బిసి వసతి గృహాలను జిల్లాకు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. బుధవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర బిసి సంక్షేమ శాఖ మంత్రితో ఎంపి గెడం నగేష్‌తో కలిసి బిసిల సంక్షేమం, అభివృద్ధి గురించి చర్చించారు. ఈ మేరకు గురువారం మంత్రి రామన్న ఒక ప్రకటన విడుదల చేస్తూ బిసి శాఖ మంత్రితో జరిపిన బేటి ఫలవంతమైందన్నారు.

బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

సంగారెడ్డి టౌన్, జూన్ 9: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ జెడి ఎ.మాధవి శ్రీలత సూచించారు. ఈ పంటల బీమా పథకాలపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద మొక్కజొన్న పంటను గ్రామ యూనిట్‌గా, వరి, జొన్న, పెసర, మినుము, కంది, వేరుశనగ, సోయ చిక్కుడులను మండల యూనిట్‌గా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ పంటల బీమా మొత్తం ఆయా పంటల రుణ పరిమితి మేరకు ఉంటుందన్నారు.

Pages