S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిపి ప్రజలను మోసం చేస్తోంది

భీమవరం, జూన్ 9: టిడిపి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలుచేసి ప్రజలను మోసం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు విమర్శించారు. కేవలం పదవుల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు ఇష్టానుసారంగా జరుగుతున్నాయని, వీటిని అడ్డుకుంటామని ప్రకటించారు. వీటివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. గురువారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉండి మండలం యండగండి గ్రామంలో మూడు పంటలు పండే సారవంతమైన 200 ఎకరాల ఆయకట్టు ఉందని, దీని మధ్యలో 30 ఎకరాల్లో కొంతమంది అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారన్నారు.

బీసీల్లో చేర్చేంతవరకు ఉద్యమిస్తాం

భీమవరం, జూన్ 9: పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, కాపు సామాజికవర్గానికి చెందినవార్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా అదరం.. బెదరమని కాపునాయకులు అన్నారు. కాపులను బిసిల్లో చేర్చేంతవరకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్ఫూర్తితో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముద్రగడకు మద్దతుగా తాము కూడా ఆందోళన బాట పడతామని, అయితే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఈ ఆందోళన చేపడతామని భీమవరం కాపునాడు పట్టణ కమిటీ పేర్కొంది. గురువారం శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కాపునాడు పట్టణ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బేతు కృష్ణారావు, మాగాపుప్రసాద్‌లు మాట్లాడారు.

‘కల్తీ’ వాసన!

శ్రీకాకుళం, జూన్ 9: ప్రజా ఆరోగ్యంపై బాధ్యత లేని సిండికేట్ నేతలు చేస్తున్న మద్యం వ్యాపారంలో కల్తీ గుట్టు రట్టు అయ్యింది. జిల్లా కేంద్రంతోపాటు పాతపట్నం, చాపర ప్రాంతాల్లో గురువారం అబ్కారీశాఖ అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. సుమారు 30 వేల మద్యం సీసాలకు అమర్చేందుకు కొత్తగా తయారైన కప్పులు ఈ దాడుల్లో వెలుగుచూశాయి.

వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి!

కొత్తూరు, జూన్ 9: కొత్తూరు పట్టణంలో పలువురి నుంచి అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసి, ఉన్నపళంగా ఉడాయించిన వడ్డీ వ్యాపారి యాళ్ల వెంకటరావుకు కొత్తూరులో గురువారం బాధితులు దేహశుద్ధి చేశారు. అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి కొత్తూరుకు చెందిన బోణంగి నాగమ్మ, ఎం.దుర్గమ్మ, అల్లు మండోదరమ్మలతో పాటు మరో ఆరుగురి నుంచి 21 లక్షల 31 వేల రూ.లు వసూలు చేసి వెంకటరావు ఉడాయించినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల కిందట ఇదే వడ్డీ వ్యాపారిపై ఎస్‌పికి కూడా బాధితులు ఫిర్యాదు చేశారు.

రాజాం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మృతి

రాజాం, జూన్ 9: రాజాం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుమల రవికుమార్(48) అనూహ్య పరిస్థితుల్లో మృత్యువాత పడ్డారు. పొగిరి గ్రామానికి చెందిన రవికుమార్ బుధవారం రాత్రి గ్రామంలో జరిగిన చిన్న వివాదాన్ని పరిష్కరించేందుకు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు హాజరై అక్కడ పని ముగించుకొని రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటికి చేరుకొనేందుకు మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా, శ్రీకాకుళం రోడ్డులోని గొలుసుల ఖానా మలుపు వద్ద ఏం జరిగిందో ఏమో గాని శరీరం నుంచి తల తెగిపడి ఉన్న స్థితిలో రవి మృతదేహం కనిపించింది.

పెద్ద మార్కెట్ సమస్యలు పరిష్కారిస్తా

శ్రీకాకుళం, జూన్ 9: ప్రజాసమస్యలే ఊపిరిగా.. రాజకీయాలు నెరిపిన దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు ఆశయాలకు అనుగుణంగా తనయుడు ఎం.పి. రామ్మోహన్‌నాయుడు ముందుకు సాగుతున్నారు. ఇక్కడ పొట్టిశ్రీరాములు మార్కెట్‌ను ఎం.పి. రామ్మోహన్‌నాయుడు సాధారణ కొనుగోలుదారుడుగా బజార్‌లో కూరగాయలు వర్తకుల నుంచి కొనుగోలు చేస్తూ గురువారం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని మార్కెట్ సంఘం పిలుపుమేరకు ఆయన గురువారం పొట్టిమార్కెట్ మొత్తం కలియ తిరిగారు. రోడ్డుపై కూరగాయలు అమ్ముతుండటాన్ని చూసిన ఆయన నూతనంగా భవనాలు కట్టించారు కదా, ఎందుకు ఆయా భవనాలను స్వాధీనం చేసుకోవడం లేదని అక్కడి వర్తకులను ప్రశ్నించారు.

చిత్రలేఖనం పోటీలో విజేతకు కలెక్టర్ అభినందన

శ్రీకాకుళం(రూరల్), జూన్ 9: జిల్లాలో ఇంటాక్ సంస్థ ఫిబ్రవరిలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో జాతీయ స్థాయిలోపదివేల మంది పాల్గొన్నారు. జిల్లాలోని గాయిత్రీ హైస్కూల్‌కు చెందిన సి.హెచ్ సుచిత్ర అనే విద్యార్థిని ప్రాంతీయ స్థాయిలో బహుమతి గెలుచుకుంది. ఢిల్లీ నుంచి జ్ఞాపిక, సర్ట్ఫికేట్ మంజూరు చేసినట్టు ఇంటాక్ కన్వీనర్ దూసి ధర్మారావు తెలిపారు. సుచిత్రకు గురువారం కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌వో రమేష్, తల్లిదండ్రులు రాజారావు, సుజాత పాల్గొన్నారు.

చరిత్ర ఉన్న నేత వైకాపాలో ఉన్నారా?

ఆమదాలవలస, జూన్ 9: వైకాపాలో మంచి చరిత్ర ఉన్న నాయకుడు ఒక్కరూ లేరని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఎం చంద్రబాబునాయుడుపై 4/20 కేసులు ఫిర్యాదులు చేసిన వైఎస్ జగన్ అతని అనుచరులు అవినీతి పరులని విమర్శించారు. వైఎస్ జగన్‌కు వత్తాసు పలుకుతున్న నాయకులు పూటకో పార్టీ ఫిరాయించి సిబిఐ కేసుల్లో నిందితులుగా ఉన్నారని విప్ పేర్కొన్నారు. జగన్‌పై 11, ఆయన తండ్రిపై నాలుగు కేసులు సిబిఐలో ఉన్నాయన్నారు.

విద్యార్థులు ప్రజాజీవితాన్ని అధ్యయనం చేయాలి

సారవకోట, జూన్ 9: విద్యార్థులు కళాశాలలు, తమ స్వగ్రామాలకే పరిమితం కాకుండా వివిధ ప్రాంతాలల్లోని ప్రజాజీవితాన్ని కూడా చదవాలని తద్వారా ఆయా ప్రాంతాలలో ఉన్న యువతకు స్ఫూర్తినివ్వాలని శ్రీకాకుళం ఎం.పి కింజరాపు రామ్మోహన్‌నాయుడు హితవుపలికారు. మండలంలోని గొర్రెబంద పంచాయతీ బురుజువాడ గ్రామంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తన పరిధిలో బురుజువాడ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆకర్షణీయ గ్రామంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించినట్టు ప్రకటించారు.

జోరుగా వెబ్ కౌనె్సలింగ్

ఎచ్చెర్ల, జూన్ 9: ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి స్థానిక ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో హెల్ప్‌లైన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న వెబ్‌కౌనె్సలింగ్ జోరుగా సాగుతోంది. గురువారం 343మంది అభ్యర్థులు సర్ట్ఫికేట్ పరిశీలనకు ముందుకు వచ్చారు. ఓసీ, బీసీలు 324మందికాగా ఎస్సీ, ఎస్టీలు 19మంది ఉన్నారు. ఇప్పటివరకు 1342మంది కౌన్సిలింగ్‌కు ముందుకు వచ్చి వెబ్ ఆప్షన్ వైపు పరుగులు తీస్తున్నారు.

Pages