S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ చరిత్రను తిరగరాశాం

విజయవాడ, జూన్ 7: దశాబ్దకాలం పాటు అవినీతి.. కుటుంబ పాలన.. స్వప్రయోజనలతో దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పాలన నుండి నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా బిజెపి ప్రభుత్వం పటిష్ఠ అవినీతి రహిత పాలనను అందిస్తోందని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీఇరానీ పేర్కొన్నారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతీ పైసా పేదవాడి దరి చేరేందుకు గాను కేంద్రం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు పోతోందన్నారు. దేశంలో పోర్టులు... రహదారులు... ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రగతిని సాధించి మెరుగైన వృద్ధిరేటును నేడు సాధించుకోగలుగుతున్నామన్నారు.

ముదిరిన మూడేళ్ల వివాదం

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జెఎసి, టిఆర్‌ఎస్ పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. బుధవారం టిజెఎసి కీలక సమావేశం నిర్వహించి మంత్రుల వాఖ్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని టిజెఎసి చైర్మన్ ప్రొ. కోదండరామ్ స్పష్టం చేశారు. నాంపల్లిలోని టిజెఎసి కార్యాలయంలో బుధవారం ఉదయం పది గంటలకు టిజెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. మంత్రుల విమర్శలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిం చి నిర్ణయం తీసుకోనున్నారు. జెఎసి ఎవరో నడిపిస్తే నడిచే సంస్థ కాదని, ప్రజల పక్షాన ఉంటామని కోదండ రామ్ చెప్పారు.

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీనే!

వాషింగ్టన్, జూన్ 7: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని హిల్లరీ క్లింటన్ దాదాపుగా దక్కించుకున్నారు. దీంతో 249 ఏళ్ల అమెరికా చరిత్రలో ఒక ప్రధాన పార్టీనుంచి అభ్యర్థిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె అరుదైన రికార్డును సైతం సృష్టించబోతున్నారు. ఆదివారం ప్యూర్టోరికోలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంతో పాటుగా అదనపు సూపర్‌డెలిగేట్ల మద్దతుతో కలిపి 68 ఏళ్ల హిల్లరీ క్లింటన్ పార్టీ అభ్యర్థి కావడానికి అవసరమైన మద్దతును కూడగట్టుకున్నట్లు ఓ మీడియా కథనం పేర్కొంది.

టి.ఎంసెట్-2 దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్, జూన్ 7: మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణలో నిర్వహిస్తున్న ఎంసెట్-2 దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 14వ తేదీ వరకూ గడువు పెంచారు. 500 రూపాయల జరిమానాతో జూన్ 20 వరకూ, వెయ్యి రూపాయిల జరిమానాతో 25వ తేదీ వరకూ, 5వేల జరిమానాతో 30వ తేదీ వరకూ, 10వేల జరిమానాతో జూలై 6వ తేదీ వరకూ పొడిగించారు. జూలై 1 నుండి అభ్యర్ధులు తమ హాల్‌టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

హైదరాబాద్, జూన్ 7: ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు రెండు పెద్ద సవాళ్లు ఉన్నాయి. రెండు వేల కోట్ల రూపాయల లోటును భర్తీ చేసేందుకు విద్యుత్ చార్జీలను, ఏడు వందల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసిని గట్టెక్కించేందుకు బస్సు చార్జీలను పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కాని ఏ మేరకు పెంచాలనే దానిపై ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది.

కోటి లడ్డూలతో పోటు కార్మికుల రికార్డ్

తిరుపతి, జూన్ 7: తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే మే నెలలో రికార్డు స్థాయిలో కోటికి పైగా లడ్డూలు తయారుచేసిన పోటు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2500 ప్రోత్సాహక బహుమానం ఇవ్వాలని టిటిడి ఇఒ సాంబశివరావు నిర్ణయించారు. ఈక్రమంలో కొత్త మైలురాయిని చేరుకున్న పోటు, అదనపు పోటులోని 482 మంది కార్మికులు, 16 మంది సహాయకుల సేవలను ఇఒ ప్రశంసించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం పోటు విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇఒ మాట్లాడుతూ పోటు కార్మికులు అద్భుతమైన సేవలు అందించారని, భవిష్యత్తులోను ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

లేఖ రాయడం రాజకీయమే

న్యూఢిల్లీ, జూన్ 7: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా నదీ యాజమాన్యం బోర్డుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాసి రాజకీయం చేయటం మంచిది కాదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి ఆరోపించారు. వేణుగోపాలచారి మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాకముందే నీటి పంపిణీ బాధ్యతను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించాలని చంద్రబాబు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివని చెప్పిన చంద్రబాబు ఇప్పుడిలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

అరెస్ట్‌లు ఆగవు

గుంటూరు, జూన్ 7: తూర్పు గోదావరి జిల్లా తునిలో రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారని, ఘటనకు బాధ్యులైన మరికొందరిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ అమాయకులపై ఎలాంటి వేధింపులకు ప్రభుత్వం తావివ్వదని, ఘటన వెనుక రౌడీషీటర్ల ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. వీరిలో అధికశాతం మంది వైకాపా కార్యకర్తలేనని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తూ కొంతమంది రాజకీయ స్వప్రయోజనాల కోసం కులాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

తెలంగాణ లారీలకు సింగిల్ పర్మిట్‌కోసం కృషి

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ లారీలకు రవాణా కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి సింగిల్ పర్మిట్లు అందేలా కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు వి శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు మంత్రిని సచివాలయంలో కలుసుకొని సమస్యలు వివరించారు. దీంతో స్పందించిన మంత్రి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మతో కలసి లారీ యజమానులతో చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తాత్కాలిక పర్మిట్‌గా ఒక్క రోజుకు రూ. 1400లు వసూలు చేస్తున్నారని, నెలసరిగా రూ. 5000లు వసూలు చేస్తూ ఏడాదికి రూ.

రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలి

హైదరాబాద్, జూన్ 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు ప్రజలంతా సహకారం అందించాలని విశ్వయోగి విశ్వంజీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, బుధవారం మహాసంకల్ప దీక్ష తీసుకుంటున్న సందర్భంగా, రాష్ట్ర పాలకులు, ప్రజలకు ఆశీస్సులు అందిస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు అనేకం ఉన్నప్పటికీ, అభివృద్ధి పథంలో నడుస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత వల్ల రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచిపేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Pages