S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజనతో వీధిన పడ్డారు!

విశాఖపట్నం, జూన్ 7: రాష్ట్ర విభజనతో మూడు కళాశాలలకు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థులు రోడ్డున పడ్డారు. వీటికి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జెఎన్‌ఎఎఫ్‌యు) అనుబంధ కళాశాలల గుర్తింపును రద్దు చేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దాదాపు ఆరు నెలలుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని నరవలో ఉన్న వరహా కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, విజయవాడ, భీమవరంలోని ఆర్కిటెక్చర్ కోర్సు నిర్వహిస్తున్న కళాశాలలు ఉమ్మడి రాష్ట్రంలో అనుబంధ కళశాలలుగా కొనసాగాయి.

అమరావతిలో హార్వర్డ్, యేల్, స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ శాఖలు

విజయవాడ, జూన్ 7: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన స్టాన్‌ఫోర్డ్, యేల్, హార్వర్డ్ యూనివర్సిటీలు భారతదేశంలో తమ విభాగాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలియచేశారు. ఈ విభాగాలను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభ్యర్థనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం సిఎం క్యాంపు కార్యాలయంలో స్మృతి ఇరానీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన యూనివర్సిటీలను ఎపిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

చిన్నమ్మని ఇరుకున పెట్టిన ‘ఇరానీ’!

విజయవాడ, జూన్ 7: మనకు నచ్చని వారి గురించి ఎక్కువగా మాట్లాడం... వారి పేరును ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడుతుంటాం. తాజా రాజకీయాల్లో సీనియర్ నాయకులు ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అలాంటిది చిరకాల రాజకీయ ప్రత్యర్థిని ఏదైనా సందర్భంలో పొగడాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? తమ రాజకీయ జీవితంలో అలాంటి అవసరం రాకూడదనే చాలామంది నాయకులు భావిస్తుంటారు. కానీ పురంధ్రీశ్వరి మాత్రం అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోలేకపోయారు. విషయానికి వస్తే.. బిజెపి రెండేళ్ల పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా ‘వికాస్ పర్వ్’ పేరుతో బిజెపి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

రేపటినుండి ఆమరణ దీక్ష

కాకినాడ, జూన్ 7: తునిలో కాపుల ఐక్యగర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లు ముఖ్యమంత్రి చంద్రబాబే సృష్టించారని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తునిలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ఆయనే బాధ్యుడన్నారు. తుని ఘటనలో జరుగుతున్న అరెస్టులకు నిరసనగా మంగళవారం ఉదయం నుండి ఆందోళనకు దిగిన ముద్రగడ రాత్రి 8 గంటల సమయంలో విరమించారు. బుధవారం సాయంత్రంలోగా తుని ఘటనలో పెట్టిన కేసులన్నీ ఉపసంహరించాలని, లేని పక్షంలో గురువారం ఉదయం నుండి ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

కీలక వడ్డీరేట్లు యథాతథం

ముంబయి, జూన్ 7: ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లలేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. మంగళవారం ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఆర్‌బిఐ నిర్వహించింది. ఈ క్రమంలో రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచిన సెంట్రల్ బ్యాంక్.. నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ని కూడా ఉన్నచోటే ఉంచింది. దీంతో రెపో రేటు 6.50 శాతం వద్దే, రివర్స్ రెపో రేటు 6 శాతం వద్దే ఉన్నాయి. సిఆర్‌ఆర్ కూడా 4 శాతం వద్దే అలాగే ఉంది.

27 వేల స్థాయికి సెనె్సక్స్

ముంబయి, జూన్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 7 నెలల తర్వాత తిరిగి 27 వేల స్థాయిని తాకింది. 232.22 పాయింట్లు ఎగిసి 27,009.67 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 65.40 పాయింట్లు ఎగిసి 8,266.45 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 66.77 శాతానికి కోలుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది.

టీవీతో దోమలు పరార్!

న్యూఢిల్లీ, జూన్ 7: దక్షిణ కొరియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జి.. మంగళవారం ఓ సరికొత్త ‘మస్కిటో అవే టీవీ’ని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. దీని ధరల శ్రేణి 26,900 రూపాయల నుంచి 47,500 రూపాయల మధ్య ఉంది. ‘ఈ ఎల్‌జి మస్కిటో అవే టీవీ భారతీయ వినియోగదారులకు చక్కగా సరిపోతుంది. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈ టెలివిజన్‌లో ఓ అల్ట్రా సోనిక్ డివైస్‌ను అమర్చాం. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయ్యిందంటే, దీన్నుంచి వచ్చే ధ్వని తరంగాల సాంకేతికతతో దోమలు దూరంగా పోతాయి. ఈ తరంగాల వల్ల మనుషులకు ఎటువంటి హానీ ఉండదు.’ అని ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ

విజయవాడ, జూన్ 7: కృష్ణా జిల్లాలో చమురు, సహజ వాయువుల నిక్షేపాల వెలికితీత ముమ్మరం కానున్నందున మచిలీపట్నం కేంద్రంగా మరో ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వరంగ చమురు ఉత్పాదక దిగ్గజాలైన ఒఎన్‌జిసి, గెయిల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఒఎన్‌జిసి, గెయిల్ అధికారులు చంద్రబాబు నాయుడును మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో కలిశారు.

మార్కెట్‌లోకి డాట్సన్ ‘రెడీ-గో’

న్యూఢిల్లీ, జూన్ 7: జపాన్ ఆటోరంగ దిగ్గజం నిస్సాన్.. మంగళవారం భారతీయ మార్కెట్‌కు డాట్సన్ ‘రెడీ-గో’ కారును పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 2.38 లక్షల రూపాయల నుంచి 3.34 లక్షల రూపాయల మధ్య ఉంది. దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ తదితర చిన్న కార్లకు పోటీగా డాట్సన్ బ్రాండ్‌లో నిస్సాన్ ఈ రెడీ-గోను ముందుకు తెచ్చింది. ఆల్టో-ఇయాన్ ధరల శ్రేణి 2.5 లక్షల రూపాయల నుంచి 4.42 లక్షల రూపాయల మధ్య ఉన్నది తెలిసిందే. ఇదిలావుంటే రెడీ-గో మోడల్.. భారత్‌లో డాట్సన్ బ్రాండ్‌లో నిస్సాన్ తెచ్చిన మూడో కారు.

బిగ్‌బజార్ క్యాష్, బోనస్ ఆఫర్లు

హైదరాబాద్, జూన్ 7: ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపార విభాగం.. బిగ్‌బజార్ తమ వినియోగదారులకు ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇక ప్రతి నెలా మొదటి 8 రోజులు (1 నుంచి 8వ తేదీ మధ్య) తమ స్టోర్లలో జరిపే 2,500 రూపాయలకుపైగా కొనుగోళ్లపై 2,000 రూపాయల విలువైన ‘మంత్లీ క్యాష్/ బోనస్ వోచర్ల’ను వినియోగదారులకు ఇవ్వనుంది. దీంతో నెలలో మిగతా రోజులు (9 నుంచి నెల చివరిదాకా) చేసే కొనుగోళ్లపై వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని, రాయితీలుంటాయని పేర్కొంది. ఈ మేరకు బిగ్‌బజార్ సిఇఒ సదాశివ్ నాయక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

Pages